అమెరికా మిచ్‌గాన్‌కు చెందిన ఎరిన్ హనీకట్. వయసు 38 ఏళ్లు. గత రెండేళ్లుగా నాన్‌స్టాప్‌గా గడ్డం పెంచుతూనే ఉంది. అది ఇప్పుడు 30 సెం.మీ. పెరిగి.. గిన్నిస్ బుక్‌లోకి ఆమె పేరును ఎక్కించింది. అందుకు కారణం.. అతిపొడవైన గడ్డంతో భూమ్మీద జీవించి ఉన్న మహిళ ఈమెనే కాబట్టి.
ఎరిన్ గడ్డం సహజమైందట. ఎలాంటి హార్మోన్‌లు, సప్లిమెంట్లు తీసుకోలేదట. ఆమెకు ఉన్న పాలిసిస్టిక్ ఓవెరియన్ సిండ్రోమ్(PCOS) వల్లే ఆమెను ఇలా మార్చేసింది. ఈ సిండ్రోమ్‌తో ఇలా జుట్టు పెరగడం మాత్రమే కాదు.. పీరియడ్స్ సజావుగా రాకపోవడం, బరువు పెరగడం, సంతానలేమి లాంటి సమస్యలు ఆమెను చుట్టుముట్టాయి. పీకోస్ వల్ల 13వ ఏట నుంచే ఆమె ముఖంపై గడ్డం పెరగడం ప్రారంమైందట.
షేవింగ్, వ్యాక్సింగ్, అవాంఛిత రోమాల్ని తొలగించే అన్ని పద్ధతుల్ని ఆమె ఉపయోగించారట. ఒక్కోసారి రోజుకు మూడుసార్లు షేవింగ్ చేసిన సందర్భాలూ ఉన్నాయట. అయినా లాభం లేకుండా పోయింది. ఈలోపు ఓ యాక్సిడెంట్‌లో ఆమె కాలికి తగిలిన గాయంతో ఇన్‌ఫెక్షన్ సోకి.. కాలిని తీసేయాల్సి వచ్చింది. అంతేకాదు ఆ ప్రభావం మరికొన్ని అవయవాలపై కూడా పడింది.
ఏళ్లు గడిచేకొద్దీ ఆరోగ్యం దిగజారి.. మానసికంగా కుంగిపోతున్న ఆమెకు డాక్టర్లు ఆమెకు ధైర్యం కోసం చెప్పిన మాటలు.. ‘అయ్యేదేదో ఎప్పటికైనా అవుతుంది. సంతోషంగా జీవితంలో ముందుకుసాగిపో అని. ఆ మాటలతో ఆమె తనను తాను మార్చుకుంది. తాను మహిళగా ఉండడం కన్నా.. సంతోషంగా కనిపించాలని నిర్ణయించుకుంది. ఈలోపు మరికొన్ని అనారోగ్య పరిస్థితులు ఆమెను చుట్టుముట్టాయి. అయినా ఆమె చెక్కుచెదర్లేదు. భాగస్వామి సహకారంతో.. మొక్కవోని ధైర్యంతో జీవితంలో ముందుకు సాగుతోంది. ఇప్పుడు పొడవైన గడ్డంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది. ఇంతకు ముందు ఈ రికార్డు అమెరికాకే చెందిన 75 ఏళ్ల వివియన్ వీలర్ పేరిట ఉండేది.
Comments
Please login to add a commentAdd a comment