బెంగళూరు: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి కార్లంటే విపరీతమైన మోజు. దానిలో భాగంగా పలు రకాలైన కార్లను కోహ్లి కొనుగోలు చేస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని అనేకసార్లు కోహ్లినే స్పష్టం చేశాడు కూడా. అయితే కోహ్లికి తన గడ్డమన్నా చాలా ఇష్టమట. తనకు గడ్డం బాగుండటం వల్లే దానిని పెంచుతూ ఉంటానన్నాడు. తాను ఎక్కువగా గడ్డాన్ని తీయించడాన్ని ఇష్టపడనని కోహ్లి మరోసారి తెలిపాడు.
‘నాకు నా గడ్డం అంటే చాలా ఇష్టం. నాకు గడ్డం బాగుంటుందనే అనుకుంటున్నా. అందుచేత గడ్డాన్ని తీయించి క్లీన్‌షేవ్‌లో కనబడాలని అనుకోను’ అని కోహ్లి తెలిపాడు. అంతకుముందు కూడా తన గడ్డంపై రవీంద్ర జడేజా చేసిన చాలెంజ్‌ను సైతం కోహ్లి నిరాకరించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment