గడ్డం... కాదు అడ్డం | Guinness World Record to Sarwan Singh | Sakshi
Sakshi News home page

గడ్డం... కాదు అడ్డం

Published Tue, Aug 25 2015 10:47 PM | Last Updated on Tue, Aug 21 2018 2:34 PM

గడ్డం... కాదు అడ్డం - Sakshi

గడ్డం... కాదు అడ్డం

తిక్క లెక్క
గడ్డం... దేనికీ కాదు అడ్డం అనుకున్నాడేమో! ఈ పెద్దమనిషి తన గడ్డాన్ని తెగ ఏపుగా పెంచాడు. ఫలితంగా ఈ గడ్డమే ఇతగాడిని గిన్నిస్ బుక్కుకెక్కించింది. ఈ తెగబారెడు గడ్డపాయన పేరు శర్వణ్ సింగ్. భారత సంతతికి చెందిన ఈయన కెనడాలో ఉంటాడు. ఈయన ఎత్తు దాదాపు ఆరడుగులైతే, ఈయనగారి గడ్డం పొడవు ఏకంగా 8.25 అడుగులు. ఈ గడ్డం పొడవు 7.8 అడుగులు ఉన్నప్పుడే, 2008లో గిన్నిస్ బుక్కుకెక్కాడు. ఆ రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరకపోగా, ఈయనగారి గడ్డం మాత్రం మరింతగా పెరుగుతూ రావడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement