sarwan Singh
-
నేడు మళ్లీ ఢిల్లీ చలో
చండీగఢ్: కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి చట్టబద్ధత సహా పలు డిమాండ్ల సాధనకు రైతు సంఘాలు చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమం ఆదివారం తిరిగి మొదలవుతుందని రైతు సంఘం నేత సర్వాన్ సింగ్ పాంథర్ చెప్పారు. శంభు నుంచి శుక్రవారం మొదలైన ర్యాలీపై హరియాణా పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడంతో మొత్తం 16 మంది గాయపడ్డారని, వీరిలో ఒకరు వినికిడి శక్తి కోల్పోయారని ఆయన వివరించారు. క్షతగాత్రుల్లో నలుగురు చికిత్స పొందుతుండగా మిగతా వారు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారన్నారు. ఈ పరిణామంతో శనివారం ర్యాలీని నిలిపివేశామని ఆయన శంభు వద్ద మీడియాకు తెలిపారు. తమ డిమాండ్లపై చర్చలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆహా్వనం అందలేదని పాంథర్ చెప్పారు. తమతో చర్చలు జరిపే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్లు కనిపించడం లేదన్నారు. అందుకే, 101 మంది రైతుల బృందంతో కూడిన జాతాను ఆదివారం మధ్యాహ్నం నుంచి శాంతియుతంగా తిరిగి ప్రారంభించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. శుక్రవారం రైతులపైకి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో కేందరంలోని బీజేపీ ప్రభుత్వం అసలు స్వరూపం బట్టబయలైందని ఆయన వ్యాఖ్యానించారు. -
ఈ సింగ్.. రియల్ హీరో
మత విశ్వాసాల కంటే ఓ ప్రాణిని రక్షించడమే మిన్న అని భావించాడు. అసాధారణ రీతిలో సాహసం చేసి పునర్జన్మ ఇచ్చాడు. పంజాబ్‌కు చెందిన శర్వాణ్ సింగ్ (28).. రియల్ లైఫ్ హీరో అనిపించుకున్నాడు. శర్వాణ్ స్నేహితులతో కలసి కారులో వెళ్తుండగా రోడ్డు పక్కన కొంతమంది నిల్చుని కాలువవైపు చూస్తున్నారు. ఏం జరిగిందో తెలుసుకోవాలని శర్వాణ్ కారు ఆపి జనం దగ్గరికి వెళ్లి చూశాడు. నదిలో పడిన ఓ కుక్క ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంది. బయటకు రాలేక మృత్యువుకు దగ్గరవుతోంది. జనం ఆ దృశ్యాన్ని చూస్తున్నారు కానీ ఆ కుక్కను కాపాడేందుకు ఎవరూ ప్రయత్నించలేదు. శర్వాణ్‌కు ఈత రాదు. అయినా కుక్కను ఎలాగైనా కాపాడాలని నిర్ణయించుకున్నాడు. ఆలస్యం చేయకుండా వెంటనే రంగంలోకి దిగాడు. సిక్కు మతవిశ్వాసాలకు పవిత్రంగా భావించే తలపాగా తీశాడు. ఇది చూసి అక్కడున్న వారు షాకయ్యారు. శర్వాణ్ అవేమీ పట్టించుకోలేదు. తలపాగాను తాడుగా చేసుకుని ఓ అంచును పట్టుకోమని స్నేహితులకు ఇచ్చి.. మరో అంచును పట్టుకుని వారి సాయంతో కాలువలోకి ఏటవాలుగా దిగాడు. అయితే నీళ్లల్లో నుంచి కుక్కును బయటకు తీసుకురావడానికి శ్రమించాల్సి వచ్చింది. మరో గుడ్డను తీసుకుని దాన్ని సాయంతో కుక్కను కాలువపైకి తీసుకువచ్చాడు. కుక్క బాగా నీరసించిపోయింది. సింగ్ తన దగ్గరున్న బిస్కెట్లు దానికి అందించాడు. కాసేపటి తర్వాత కోలుకున్న కుక్క అక్కడి నుంచి వెళ్లిపోయింది. తన శ్రమ ఫలించినందుకు సింగ్ సంతోషపడ్డాడు. సిక్కు మత విశ్వాసాల ప్రకారం ఇంట్లో లేదా స్నానం చేసేటపుడు మాత్రమే తలపాగా తీయాలి. ఆ సమయంలో కుక్క ప్రాణాలను రక్షించడమే ప్రధానమని భావించానని శర్వాణ్ సింగ్ చెప్పాడు. -
గడ్డం... కాదు అడ్డం
తిక్క లెక్క గడ్డం... దేనికీ కాదు అడ్డం అనుకున్నాడేమో! ఈ పెద్దమనిషి తన గడ్డాన్ని తెగ ఏపుగా పెంచాడు. ఫలితంగా ఈ గడ్డమే ఇతగాడిని గిన్నిస్ బుక్కుకెక్కించింది. ఈ తెగబారెడు గడ్డపాయన పేరు శర్వణ్ సింగ్. భారత సంతతికి చెందిన ఈయన కెనడాలో ఉంటాడు. ఈయన ఎత్తు దాదాపు ఆరడుగులైతే, ఈయనగారి గడ్డం పొడవు ఏకంగా 8.25 అడుగులు. ఈ గడ్డం పొడవు 7.8 అడుగులు ఉన్నప్పుడే, 2008లో గిన్నిస్ బుక్కుకెక్కాడు. ఆ రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరకపోగా, ఈయనగారి గడ్డం మాత్రం మరింతగా పెరుగుతూ రావడం విశేషం.