అనుమతి లేకున్నా.. ఆరెస్సెస్‌ చీఫ్‌ జెండావిష్కరణ! | RSS chief Mohan Bhagwat hoists tricolour in Kerala | Sakshi
Sakshi News home page

అనుమతి లేకున్నా.. ఆరెస్సెస్‌ చీఫ్‌ జెండావిష్కరణ!

Published Tue, Aug 15 2017 11:55 AM | Last Updated on Sun, Sep 17 2017 5:33 PM

అనుమతి లేకున్నా.. ఆరెస్సెస్‌ చీఫ్‌ జెండావిష్కరణ!

అనుమతి లేకున్నా.. ఆరెస్సెస్‌ చీఫ్‌ జెండావిష్కరణ!

న్యూఢిల్లీ: ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ అధికారుల అభ్యంతరాలను తోసిపుచ్చుతూ  కేరళలోని ఓ స్కూల్‌లో జాతీయ జెండాను ఎగురవేశారు. రాజకీయ నేతలు పాఠశాలలో జెండాను ఎగురవేయరాదని జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేసినా ఆయన ఖాతరు చేయలేదు.

71వ స్వాతం‍త్ర్య దినోత్సవం సందర్భంగా మంగళవారం పలక్కాడ్‌ జిల్లాలోని ఓ పాఠశాలలో మోహన్‌ భగవత్‌ జాతీయ జెండాను ఎగురవేశారు.  పాఠశాలల్లో రాజకీయ నేతలు జెండా ఎగురవేయడం సరికాదని, స్కూల్‌ అధికారులు, ప్రజా ప్రతినిధులను మాత్రమే ఇందుకు అనుమతిస్తామని పలక్కాడ్‌ జిల్లా కలెక్టర్‌ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కేరళ ప్రభుత్వ చర్యపై ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అధికారుల తీరును తీవ్రంగా తప్పుపట్టాయి. రాష్ట్రంలో వామపక్షాలు, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ ఘటన దుమారం రేపుతున్నది.



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement