
World's Tallest Dog: అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన జ్యూస్ అనే అమెరికన్ గ్రేట్ డేన్ కుక్క ప్రపంచంలోనే ఎత్తయిన కుక్కగా గిన్నిస్ రికార్డు సృష్టించింది. దీని ఎత్తు 3 అడుగుల 5.18 అంగుళాలు. దీని వయసు రెండేళ్లు. ఇంత ఎత్తు ఉన్నప్పటికీ మిగతా చిన్నగా ఉన్న కుక్కలతో త్వరగా కలిసిపోయి ఆడుకుంటుందని దాని యాజమాని తెలిపారు.
తాము జ్యూస్‌ను చిన్న పిల్ల వయసు నుంచే పెంచుకుంటున్నామని, అప్పుడే అది భారీ సైజులో ఉండేదని దాని యజమాని బ్రిటనీ డేవిస్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌కు తెలిపారు. జ్యూస్ చాలా పొడువైన కాళ్లను కలిగి ఉన్నాడని పేర్కొన్నారు.
చదవండి: రష్యా ‘విక్టరీ డే’.. పుతిన్ కీలక ప్రకటన?