వాషింగ్టన్: ప్రపంచంలోనే అతి చిన్న శుకనంగా అమెరికా ఫ్లోరిడాకు చెందిన 'పర్ల్' అనే ఆడ శునకం నిలిచింది. ప్రస్తుతం భూమి మీద జీవిస్తున్న శునకాల్లో ఇదే అత్యంత పొట్టిది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు కూడా దక్కించుకుంది.
చిహువాహువా బ్రీడ్‌కు చెందిన ఈ బుల్లి శునకం వయసు రెండేళ్లు. ఎత్తు 3.59 అంగుళాలు. పొడవు 5 అంగుళాలు. అంటే టీ కుప్పు సైజులో ఉంటుంది. ఇది పుట్టినప్పుడు ఔన్సు బరువు కంటే తక్కువ ఉండటం గమనార్హం. గతంలో గిన్నిస్ రికార్డు సృష్టించిన మిరాకిల్ మిల్లీ సోదరే దీనికి జన్మనివ్వడం మరో విశేషం. 2020లో మిల్లీ చనిపోయింది. మరో ప్రత్యేక ఏంటంటే ఈ రెండు శునకాల యజమాని కూడా ఒక్కరే. ఆమే ఫ్లోరిడాలోని వనేసా సెమ్లర్.
పర్ల్ చాలా యాక్టివ్‌గా ఉంటుందని, చికెన్, సాల్మన్ ఫిష్‌ను చాలా ఇష్టంగా తింటుందని సెమ్లర్ చెప్పుకొచ్చారు. రోజుకు నాలుగు సార్లు దీనికి ఆహారం అందిస్తున్నట్లు తెలిపారు. రోడ్డుపై కేఫ్‌లు కన్పిస్తే వాటి ముందు అరుస్తుందని, దానికి క్రీమ్ ఇచ్చేంతవరకు అలాగే మొరుగుతుందని వివరించారు.
కాగా.. గతంలో ప్రపంచంలో అతి పొట్టి శునకంగా బ్రిటన్‌కు చెందిన యార్క్‌షైర్ టెర్రియర్ ఉండేది. దీని ఎత్తు 2.8 అంగుళాలే. పొడవు 3.75 అంగుళాలు. అయితే ఈ శునకం 1945లో చనిపోయింది. ఇంతకంటే పొట్టి శునకాన్ని ఇప్పటివరకు గుర్తించలేదు.
చదవండి: 92 ఏళ్ల వయసులో నాలుగో భార్యకు విడాకులు.. ఇక చాలు అంటూ..
Comments
Please login to add a commentAdd a comment