జహీరాబాద్ టౌన్: పలు శాఖల అధికారులు కలసి గురువారం పట్టణంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి బాలకార్మికులను గుర్తించారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి రత్నం, కార్మికశాఖ అధికారి యాదయ్య, సీడబ్ల్యూసీ సభ్యుడు మహరాజ్, డీసీపీయూ సభ్యుడు గోపాల్, ఏఎస్‌ఐ మల్లయ్య తదితర శాఖల అధికారులు అశోక్, మోతిరాం, సత్తిరెడ్డి తదితరులు పట్టణంలోని హోటళ్లు, వ్యాపార సంస్థలను తనిఖీలు నిర్వహించారు. 14 మంది బాలకార్మికులను గుర్తించి వారిని సంగారెడ్డిలోని దివ్యదిశ హోంకు తరలించారు. ఈ సందర్బంగా జిల్లా బాలల సంరక్షణ అధికారి రత్నం మాట్లాడుతూ 14 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టడం నేరమన్నారు. పిల్లలను పనుల్లో పెట్టుకుంటే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.