వైజాగ్ నుంచి సికింద్రాబాద్ వచ్చిన జన్మభూమి ఎక్స్ప్రెస్ లో 74మంది బాల కార్మికులను గుర్తించిన పోలీసులు వారికి విముక్తి కలిగించారు. అక్రమంగా బాల కార్మికులను తరలిస్తున్నారంటూ అందిన సమాచారం మేరకు పోలీసులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్, అసోం తదితర ప్రాంతాలకు చెందిన బాలకార్మికులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని రెస్క్యూ హోంకు తరలించారు. వారిలో 24మంది బాల కార్మికులు కాగా, మరికొంతమంది వెట్టిచాకిరీ కార్మికులు. కాగా వీరిని తరలించిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.