హైదరాబాద్ :నెలన్నర క్రితం హైదరాబాద్ లోని పాతబస్తీలో పోలీసుల కార్డన్‌సెర్చ్‌లో పట్టుబడిన బాల కార్మికులు ఆదివారం తమ స్వస్థలాలకు పయనమయ్యారు. పట్టుబడిన వారిలో చాలామందిని అప్పట్లోనే వారి స్వస్థలాలకు పంపించగా, 50 మందిని మాత్రం సైదాబాద్‌లోని బాలకార్మికుల సదనానికి తరలించారు. ఆదివారం వీరిని అధికారులు నాంపల్లి రేల్వేస్టేషన్‌కు బస్సులో తరలించి, ఓ రైల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక బోగీలో భద్రత నడుమ వారి స్వస్థలమైన కోల్‌కతాకు పంపించారు.