27మంది బాల కార్మికులకు విముక్తి
కరీంనగర్: కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ లో పలు హోటళ్ల పై పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా హోటళ్లలో పని చేస్తున్న 27 మంది బాల కార్మికులను గుర్తించారు. వారికి పని నుంచి విముక్తి కలిగించి బాలసదన్‌కు తరలించారు. మరోసారి చిన్నారులతో పని చేయించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హోటళ్ల యజమానులను హెచ్చరించారు.