ఏసీపీ చెర నుంచి బాల కార్మికునికి విముక్తి | child labour saved from acp | Sakshi
Sakshi News home page

ఏసీపీ చెర నుంచి బాల కార్మికునికి విముక్తి

Published Wed, Apr 1 2015 3:36 PM | Last Updated on Mon, Aug 20 2018 3:37 PM

child labour saved from acp

హైదరాబాద్ : బాధ్యతాయుతమైన పోలీసు వృత్తిలో ఉన్న ఓ అధికారి  తన ఇంట్లో బాల కార్మికుడి చేత వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. దీనిపై పక్కా సమాచారం అందడంతో కార్మికశాఖ అధికారులు సదరు పోలీసు ఆఫీసర్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ సరూర్‌నగర్ హుడా కాలనీలో నివాసం ఉంటున్న ఏపీఎస్‌పీ బెటాలియన్ ఏసీపీ ఈవీ రామారావు ఇంట్లో కార్మికశాఖ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు.

సూరి (10)  అనే బాలుడి చేత రెండేళ్లుగా ఇంటి పనులు చేయించుకుంటున్నారన్న సమాచారంతో కార్మికశాఖ కమిషనర్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. తనిఖీలో ఏసీపీ ఇంట్లో ఉన్న బాల కార్మికుడిని తమ సంరక్షణలోకి తీసుకున్నారు. అడ్డువచ్చిన కానిస్టేబుల్‌ను సైతం అదుపులోకి తీసుకున్నారు. ఏసీపీ ప్రస్తుతం కర్నూలు బెటాలియన్‌లో పనిచేస్తున్నారు. కాగా ఆయనపై కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement