హైదరాబాద్: నగరంలోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కింగ్‌కాలనీలోని ఓ వాటర్ ప్లాంట్‌లో పనిచేస్తున్న బాలలకు పోలీసులు బుధవారం విముక్తి కల్పించారు. డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు సదరు వాటర్‌ప్లాంట్‌పై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ వెట్టిచాకిరీ చేస్తున్న 16 మంది బాలలను గుర్తించి, బాలల సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. ప్లాంట్ నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు డీసీపీ తెలిపారు.