sultan shahi
-
16 మంది బాల కార్మికులకు విముక్తి
హైదరాబాద్: నగరంలోని మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని కింగ్కాలనీలోని ఓ వాటర్ ప్లాంట్లో పనిచేస్తున్న బాలలకు పోలీసులు బుధవారం విముక్తి కల్పించారు. డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు సదరు వాటర్ప్లాంట్పై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ వెట్టిచాకిరీ చేస్తున్న 16 మంది బాలలను గుర్తించి, బాలల సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. ప్లాంట్ నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు డీసీపీ తెలిపారు. -
పరిశ్రమల్లో తనిఖీలు: బాల కార్మికులకు విముక్తి
హైదరాబాద్ : నగరంలోని సుల్తాన్ షాహీ ప్రాంతంలోని గాజు పరిశ్రమల్లో పోలీసులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ పని చేస్తున్న 20 మంది బాల కార్మికులను పోలీసులు విముక్తి కల్పించారు. వారంతా బీహార్ రాష్ట్రానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. వారందరిని సాధ్యమైనంత త్వరగా బీహార్ పంపేందుకు ఏర్పాట్లు చేస్తామని పోలీసులు వెల్లడించారు. గాజు పరిశ్రమలకు చెందిన ఇద్దరు యజమానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.