హైదరాబాద్: బిహార్ నుంచి బాల కార్మికులను తీసుకువచ్చి, వారితో వెట్టి చాకిరీ చేయించుకుంటున్న ఇద్దరిని మొఘల్‌పురా పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గౌలిపురా మీర్‌కా దయారా ప్రాంతానికి చెందిన మహ్మద్ నజీముద్దీన్ (35), సుల్తాన్‌షాహి ప్రాంతానికి చెందిన మహ్మద్ అర్షద్‌లు చెప్పుల వ్యాపారులు. కాగా, కొన్ని నెలలుగా బిహార్ రాష్ట్రంలో గయా, ధన్వాడ, షాదీపూర్ జిల్లాలకు చెందిన బాలురను నగరానికి అక్రమ మార్గాల్లో తీసుకొచ్చి చెప్పుల ఫ్యాక్టరీలో పని చేయిస్తున్నారు. ఈనెల 2వ తేదీ రాత్రి పోలీసులు నిర్వహించిన కార్డ్డాన్ సెర్చ్‌లో ఈవిషయం బయటపడింది.
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నజీముద్దీన్, అర్షద్‌లపై చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. మెజిస్ట్రేట్ ఆదేశానుసారం అరెస్ట్ చేసి, ఇద్దరినీ రిమాండ్‌కు తరలించారు. ఇంకా, ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.