మాట్లాడుతున్న బృంద సభ్యులు
ఆపరేషన్ ముస్కాన్–2కు సహకరించండి
Published Thu, Jul 28 2016 1:14 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM
ఇచ్ఛాపురం(కంచిలి): ఆపరేషన్ ముస్కాన్–2 కార్యక్రమానికి అందరి సహకారం అవసరమని మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం ఎస్‌ఐ ఎం.లక్ష్మయ్య అన్నారు. సమగ్ర బాలల పరిరక్షణ పథకంలో భాగంగా మంగళవారం ఇచ్ఛాపురం, సోంపేట పట్టణాల్లో ఆపరేషన్ ముస్కాన్ పేరిట తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ ప్రదేశాల్లో 23 మంది బాల కార్మికులు, అనాథలను గుర్తించినట్లు తెలిపారు. వీరిని బాలల సంక్షేమ సమితి ముందు హాజరు పరిచి పునరావాసం కల్పిస్తామన్నారు. ఈ నెల 1 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 218 మంది బాలబాలికలను గుర్తించామని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా సమగ్ర బాలల పరిరక్షణ పథకం ప్రాజెక్టు అధికారి ఎం.మల్లేశ్వరరావు, చైల్డ్‌లైన్ కో–ఆర్డినేటర్ ఆర్.జాస్మిన్‌కుమారి, ఎం.స్వాతి, జగదీశ్వర రావు, ఎం.బాలకృష్ణ పాల్గొన్నారు.
Advertisement
Advertisement