బాల కార్మికులకు విముక్తి
-
ఆపరేషన్ ముస్కాన్ బృందం దాడులు
-
చిల్డ్రన్ హోంకు చిన్నారుల తరలింపు
హుస్నాబాద్‌రూరల్ : హుస్నాబాద్ సర్కిల్‌లోని వ్యాపార సముదాయాల్లో పనిచేస్తున్న ఎనిమిది మంది బాలకార్మికులకు ముస్కాన్ ఆపరేషన్ టీం శుక్రవారం విముక్తి కల్పించింది. టీం అధ్వర్యంలో కోహెడ, భీమదేవరపల్లి, హుస్నాబాద్ మండలాల్లోని దుకాణాలపై దాడులు నిర్వహించారు. ఎనిమిది మంది బాల కార్మికులను గుర్తించారు. చత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వీరిని కరీంనగర్‌లోని చిల్డ్రన్ హోంకు తరలిస్తామని హుస్నాబాద్ సీఐ దాసరి భూమయ్య తెలిపారు. మళ్లీ బాలలతో పనిచేయిస్తే బాల కార్మిక చట్టం ప్రకారం యజమానులను శిక్షిస్తామని హెచ్చరించారు. దాడుల్లో ఎస్సై కిరణ్, వంగర ఎస్సై హరిప్రసాద్, ముస్కాన్ టీం సభ్యులు రమేశ్, అర్చన తదితరులు పాల్గొన్నారు.