నాలుగేళ్లుగా జీవచ్ఛవంలా పడి ఉన్న భర్తకు విముక్తి కల్పించాలనుకుంది.. ఆయనను చంపేసి బాధల నుంచి తప్పించాలనుకుంది.. ఆయనతోపాటు తానూ తనువు చాలించాలని నిర్ణయించుకుంది.. ఎటూ కదలలేని స్థితిలో ఉన్న భర్త తలపై రోకలి బండతో మోదింది.. ఆయన చనిపోయాడనుకుని 13వ అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది.. ఐదు పదులు దాటిన దాంపత్య జీవితంలో చోటుచేసుకున్న ఈ విషాదకర ఉదంతం మంగళవారం హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఉన్న మైహోం జ్యువెల్స్ అపార్ట్‌మెంట్‌లో ఈ విషాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆమె భర్త ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు