
మస్కట్ నుంచి నెల్లూరు చేరుకున్న మస్తానమ్మ
నెల్లూరు(పొగతోట): ఉపాధి కోసం మస్కట్‌కు వెళ్లి చిక్కుకుపోయిన ఓ మహిళకు కలెక్టర్ ముత్యాలరాజు చొరవతో విముక్తి లభించింది. నగరంలోని ఎన్టీఆర్‌నగర్‌కు చెందిన ఎస్‌కే రహంతుల్లా, మస్తానమ్మ దంపతులు. టైలర్‌గా రహంతుల్లా సంపాదనతో కుటుంబం గడవకపోవడంతో మస్తానమ్మ మస్కట్‌కు వెళ్లింది. అక్కడ ఓ ఇంట్లో కూలీ పనికి చేరింది. ఇంటి యజమాని వేధించడంతో పాటు తనకు విష పదార్థాలు ఇచ్చి చంపేందుకు ప్రయత్నిస్తున్నాడని, తనను స్వస్థలానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని ఈ ఏడాది జూన్ 8న మస్తానమ్మ కలెక్టర్‌కు అర్జీ పెట్టుకుంది. స్పందించిన కలెక్టర్ ఎంబీసీ వారితో చర్చించారు. ఆమెపై కేసులు పెట్టకుండా నెల్లూరుకు పంపేలా చర్యలు తీసుకున్నారు. దీంతో మస్తానమ్మ మస్కట్ నుంచి బయలుదేరి మంగళవారం రాత్రి నెల్లూరుకు క్షేమంగా చేరుకుందని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment