
పాలకులకు ఏమైంది?
టీఆర్‌ఎస్.. అధికారంలోకి రాగానే ఎందుకు మౌనంగా ఉందని డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి ప్రశ్నించారు.
- విమోచనను ఎందుకు నిర్వహించరు?
- డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి
- సంగారెడ్డి జాతీయ జెండా ఆవిష్కరణ
సంగారెడ్డి మున్సిపాలిటీ: తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని గతంలో ఉద్యమించిన టీఆర్‌ఎస్.. అధికారంలోకి రాగానే ఎందుకు మౌనంగా ఉందని డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి ప్రశ్నించారు. శనివారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం ఎదుట విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను ఎగురవేశారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంత అభివృద్ధిని కాంక్షించే యూపీఏ సర్కార్ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ సర్కార్ ఈ ప్రాంత అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు.
రజాకార్ల చెర నుంచి తెలంగాణ ప్రాతాన్ని విముక్తి కల్గించేందుకు ఎందరో ప్రాణాలు బలి ఇచ్చిరన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, పార్లమెంట్ ఇన్‌చార్జి శ్రవణ్‌కుమార్‌రెడ్డి, జెడ్పీటీసీలు అంజయ్య, ప్ర«భాకర్‌రెడ్డి, పటాన్‌చెరు కార్పొరేటర్ శంకర్‌యాదవ్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు సాబేర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోపాజి అనంతకిషన్, కౌన్సిలర్ కసిని రాజు, నాయకులు సంతోష్, సంజీవ్‌కుమార్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.