జపాన్‌లో భారీ భూకంపం..సునామీ హెచ్చరిక జారీ | Earth Quake In Japan Tsunami Warning Issued | Sakshi
Sakshi News home page

జపాన్‌లో భారీ భూకంపం..సునామీ హెచ్చరిక జారీ

Published Mon, Jan 13 2025 7:11 PM | Last Updated on Mon, Jan 13 2025 8:04 PM

Earth Quake In Japan Tsunami Warning Issued

టోక్యో:జపాన్‌(Japan)లో సోమవారం(జనవరి13) భారీ భూకంపం(EarthQuake) సంభవించింది. క్యుషు ప్రాంతంలో వచ్చిన ఈ భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.9గా నమోదైంది. 37 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు యురోపియన్‌ భూకంప పరిశోధనా కేంద్రం తెలిపింది. ఈ భూకంపం ధాటికి ఎలాంటి పప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించలేదని సమాచారం. 

అయితే ముందు జాగ్రత్తగా కొన్ని తీర ప్రాంతాలకు సునామీ(Tsunami) హెచ్చరికలు జారీ చేశారు. గతేడాది ఆగస్టు 8న క్యుషు ప్రాంతంలో రెండు భారీ భూకంపాలు రాగా జనవరి 1 2024న 7.6 తీవ్రతతో సుజు,వజీమాలో భారీ భూకంపం సంభవించింది.

ఈ భూకంపం ధాటికి ఏకంగా 300 మంది ప్రాణాలు కోల్పోయారు. పలు టెక్టానిక్‌ ప్లేట్లు కలిసే రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ ప్రాంతంలో జపాన్‌ ఉండడంతో ఇక్కడ తరచు భూకంపాలు వస్తుంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement