టోక్యో: జపాన్‌లో భారీ భూకంపం చోటు చేసుకుంది. ఈశాన్య జపాన్‌లోని మియాగి ప్రిఫెక్చర్ తీరంలో 7.2 తీవ్రతతో శనివారం భూకంపం సంభవించినట్లు జపాన్ వాతావరణ సంస్థ పేర్కొంది. ఈ భూకంపం తీర ప్రాంతంలో 37 మైళ్ల లోతులో చోటుచేసుకున్నట్లు తెలిపింది.
ఈ భూకంపం తీరం ప్రాంతాల్లో సుమారు ఒక మీటరు దూరంలో తీవ్రమైన సునామిగా మారనున్నట్లు వాతావరణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక, 2011లో సంభవించిన భూకంపం జపాన్‌ను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment