Tsunami alert
-
జపాన్‌లో భారీ భూకంపం..సునామీ హెచ్చరిక జారీ
టోక్యో:జపాన్(Japan)లో సోమవారం(జనవరి13) భారీ భూకంపం(EarthQuake) సంభవించింది. క్యుషు ప్రాంతంలో వచ్చిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.9గా నమోదైంది. 37 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు యురోపియన్ భూకంప పరిశోధనా కేంద్రం తెలిపింది. ఈ భూకంపం ధాటికి ఎలాంటి పప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించలేదని సమాచారం. అయితే ముందు జాగ్రత్తగా కొన్ని తీర ప్రాంతాలకు సునామీ(Tsunami) హెచ్చరికలు జారీ చేశారు. గతేడాది ఆగస్టు 8న క్యుషు ప్రాంతంలో రెండు భారీ భూకంపాలు రాగా జనవరి 1 2024న 7.6 తీవ్రతతో సుజు,వజీమాలో భారీ భూకంపం సంభవించింది.ఈ భూకంపం ధాటికి ఏకంగా 300 మంది ప్రాణాలు కోల్పోయారు. పలు టెక్టానిక్ ప్లేట్లు కలిసే రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో జపాన్ ఉండడంతో ఇక్కడ తరచు భూకంపాలు వస్తుంటాయి. -
సునామీ @20 ఏళ్లు: అలా జరిగి ఉంటే పెను విధ్వంసం తప్పేది!
ప్రశాంత సాగర తీరంలో ఒక్కసారిగా చెలరేగిన అలజడి.. హహాకారాలతో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగులు పెడుతూ చెల్లాచెదురైన జనం.. రెప్పపాటులో వాళ్లను ముంచేసిన రాకాసి అలలు.. నేలకూలిన భవనాలు-ముక్కలైన జీవనాధారాలు.. వెతికేకొద్దీ బయటపడ్డ శవాలు.. వెరసి ఎటుచూసినా కన్నీళ్లే!. సరిగ్గా.. 20 ఏళ్ల క్రితం సునామీ(Tsunami) సృష్టించిన విధ్వంసపు జ్ఞాపకాలివి. అప్పటిదాకా సాగర ఆటుపోట్లను ఆహ్లాదంగా భావించిన తీర ప్రాంత ప్రజలు.. ఘోర విపత్తును చూసింది మాత్రం అదే తొలిసారి!. ఇంతకీ ఆరోజు అసలేం జరిగింది? వేలు, లక్షల సంఖ్యలో ప్రాణాలను బలిగొనే విలయాన్ని పసిగట్టడంలో శాస్త్రవేత్తలు, అధికారుల అంచనాలు ఎక్కడ తప్పాయి?.డిసెంబర్ 26, 2004.. సమయం ఉదయం 7.58నిమిషాలు. ఇండోనేషియాలోని సుమత్రా ఉత్తర వైపున్న సముద్రంలో ఒక్కసారిగా అలజడి రేగింది. ప్రపంచంలోనే అత్యధికంగా భూకంపాలు సంభవించే.. ‘రింగ్ ఆఫ్ ఫైర్’(పసిఫిక్ మహాసముద్రం) ప్రాంతమది. దీంతో అగ్నిపర్వతాలు బద్దలవడం, భూకంపాలు, వరదలు షరామాములుగా మారిందక్కడ. ఆ పూట సంభవించిన వాటిని కూడా తేలికపాటి ప్రకంపనలుగానే అధికారులు భావించి తేలికగా తీసుకున్నారు. కానీ, ఆ ప్రకంపనలు ఒక ప్రళయాన్నే తీసుకొచ్చాయి. 🌊తీవ్ర భూకంప ప్రభావంతో.. సముద్రంలో 50 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడ్డాయి అలలు. ఆ అలలు తీర ప్రాంతం నుంచి ఐదు కి.మీ పాటు భూభాగంలోకి చొచ్చుకొచ్చేశాయి.ఇండోనేషియా.. అచె ప్రాంతంలోనే లక్షా యాభై వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.శ్రీలంక.. సుమత్రాకు 1,700 కిలోమీటర్ల దూరంలోని శ్రీలంక తీర ప్రాంతాల్లో ఊహకందని నష్టం వాటిల్లింది. వివిధ తీర ప్రాంతాల్లో రాకాసి అలల ధాటికి 35 వేల మంది మరణించారు.భారత్.. తమిళనాడు తీవ్రంగా నష్టపోయింది. ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్లోనూ నష్టం జరిగింది. కేరళకు స్వల్ప నష్టం వాటిల్లింది. మొత్తంగా 16, 389 మంది మరణించారు.థాయ్‌లాండ్.. భూకంప కేంద్రానికి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖావో లాక్‌లో తీవ్ర నష్టం వాటిల్లింది. 8 వేలమంది మరణించారు. వీళ్లలో క్రిస్మస్, న్యూఇయర్ సెలవులకు వచ్చిన టూరిస్టులే అధికంగా ఉన్నారు.🌊2004 హిందూ మహాసముద్రంలో ఏర్పడిన సునామీ కారణంగా.. మొత్తంగా రెండున్నర లక్షల మంది ప్రాణాలు విడిచారు. చెల్లాచెదురైనవాళ్లు లెక్కలేనంత మంది. నిరాశ్రయులైనవాళ్లు ఇంకొందరైతే.. జీవనాధారాలను కోల్పోయారు మరికొందరు. ప్రాణ నష్టంతో పాటు తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లింది. ఆయా దేశాల పర్యాటక రంగం కుదేలు కావడమే కాకుండా.. ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపెట్టింది. ఏకంగా 10 బిలియన్ డాలర్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లింది. మానవతా ధృక్పథంతో ప్రపంచవ్యాప్తంగా అందించిన సాయం.. చరిత్రలోనే అతిపెద్ద సాయంగా నిలిచిపోయింది. అయినప్పటికీ.. తీర ప్రాంతాలు, మానసికంగా అక్కడి ప్రజలు కోలుకోవడానికి ఏళ్ల సమయం పట్టింది.10 నిమిషాల భూకంపం!రిక్టర్ స్కేల్‌పై 9.1-9.3 మధ్య తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. సముద్ర గర్భంలో భూమి పది నిమిషాలపాటు కంపిస్తూనే ఉంది. ఆ కారణంతోనే సముద్రపు అలలు రాకాసి రూపం సంతరించుకున్నాయి. తీర ప్రాంతాలను క్షణాల్లో చుట్టుముట్టాయి. ఇండోనేషియా, శ్రీలంక, భారత్, థాయ్‌లాండ్, మాల్దీవులు.. ఇలా 14 దేశాలను సముద్రపు అలలు ముంచెత్తాయి. అమెరికా, యూకే, అంటార్కిటికా తదితర ప్రాంతాల్లో కూడా అలలు ఎగిసిపడ్డాయి. ఎక్కడో 9వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికా స్టేట్ ఓక్లాహామాలోనూ దీని ప్రభావం కనిపించిందంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు. సునామీ అనే పేరు మనవాళ్లు విన్నది అప్పుడే తొలిసారి!.ఆసియాలో అత్యంత శక్తివంతమైన భూకంపంగా రికార్డు21వ శతాబ్దంలో అత్యంత శక్తివంతమైన భూకంపంప్రపంచంలో ఇప్పటిదాకా సంభవించిన భూకంపాల్లో మూడో శక్తివంతమైందిఈ భూకంపం 23 వేల ఆటంబాంబుల పేలుళ్లతో సమానం!2004 సునామీ 21వ శతాబ్దంలో సంభవించిన అత్యంత ఘోరమైన విపత్తుగా చరిత్రకెక్కింది*భూకంపాల కొలమానం.. సిస్మోగ్రఫీ అనేది 1900 సంవత్సరం నుంచి ప్రారంభమైంది. చదవండి: ఆధునిక చరిత్రలోనే అత్యంత భీకర సునామీ ఏదో తెలుసా?. 🌊సునామీ.. మనిషి నిలువరించలేని ఓ ప్రకృతి విపత్తు!. తక్షణ స్పందన, సహాయక చర్యలతో ఈ విపత్తుల వల్ల కలిగే నష్టాలను, పర్యవసాలను కొంతవరకు తగ్గించవచ్చు. అలాగే సునామీని ముందుగానే గుర్తించగలిగే గ్లోబల్ వార్నింగ్ వ్యవస్థ మాత్రం ఒకటి ఉంది. సముద్ర భూగర్భంలో చెలరేగే అలజడులు.. అలల తీవ్రత ఆధారంగా సునామీ హెచ్చరికలు జారీ చేస్తుంటారు. ఇందుకోసం ‘సునామీ వార్నింగ్ సిస్టమ్’(TWS) పని చేస్తుంది. 🌊ప్రపంచంలోనే తొలి సునామీ హెచ్చరికల వ్యవస్థ.. 1920లో హవాయ్లో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సంభవించిన విపత్తుల ఆధారంగా దానిని ఆధునీకరించుకుంటూ వచ్చారు. ఫసిఫిక్ సముద్రం, నార్త్ అమెరికా సంబంధిత వ్యవస్థలు తర్వాతి కాలంలో ఏర్పాటయ్యాయి. కానీ.. 2004 దాకా హిందూ మహాసముద్రంలో సునామీల హెచ్చరికలకు సంబంధించి ఇలాంటి వ్యవస్థ లేదు. అలాంటి వ్యవస్థ లేకపోవడం.. ఇంతటి విషాదానికి కారణమైందన్న వాదన ఇప్పటికీ వినిపిస్తుంటుంది.🌊2004 బాక్సింగ్ డే సునామీ తర్వాత.. ఆ మరుసటి ఏడాది IOTWMSను యునెస్కో ఏర్పాటు చేసింది. భారత్ తరఫున Indian Tsunami Early Warning Centre (ITEWC), ఈ IOTWMSతో సమన్వయం జరుపుతోంది. హైదరాబాద్‌లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్‌లో ITEWCను 2007లో ఏర్పాటు చేశారు. సముద్ర గర్భంలో చోటు చేసుకునే మార్పులు, సునామీల మీద అధ్యయనాలు.. పరిశోధనలు జరుగుతున్నాయి ఇక్కడ. 🌊ప్రపంచంలో.. దాదాపు అన్ని సముద్ర రీజియన్లలో ఇలాంటి వ్యవస్థలను ఏర్పాటు చేశారు. అయితే ఇలాంటి వ్యవస్థలు కచ్చితత్వం విషయంలోనూ కొన్ని లోపాలు బయటపడ్డాయి. దీంతో విపత్తులకు తగ్గట్లుగా మార్పులు చేస్తూ వస్తున్నారు. 2018 డిసెంబర్లో అగ్నిపర్వతం బద్ధలై సునామీ ముంచెత్తింది. దీంతో.. ఆ గ్యాప్‌ను భర్తీ చేయడానికి సముద్ర మట్టం స్థాయికి సెన్సార్లను ఏర్పాటు చేశారు. అలా.. అప్పటినుంచి సునామీ హెచ్చరికలు తరచూ జారీ అవుతుండడం చూస్తున్నాం. అయితే ఇలాంటి వ్యవస్థ 20 ఏళ్ల కిందట ఉండి ఉంటే.. ఆనాడు అంతటి విధ్వంసం తప్పేది ఏమో!.🌊సునామీ అంటే?.. Tsunami అనే పదం Tsu(Harbour), nami(waves) అనే జపాన్ పదాల కలయిక. తీరపు అల(రాకాసి అల) అని దీనర్థం. సముద్రపు అడుగు భాగంలో భూకంపాలు సంభవించడం, అగ్ని పర్వతాల ఉద్భేదనం, భూతాపాల వల్ల ఏర్పడిన అధిక శక్తి కలిగిన సముద్ర కెరటాలు తీరాన్ని చేరడాన్ని 'సునామీ'అంటారు. ఈ కెరటాలకు తరంగ దైర్ఘ్యం ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల అధిక మొత్తంలో నీరు తీరాన్ని తాకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. సాధారణంగా.. భూకంప తీవ్రత 6.5 కంటే అధికంగా ఉంటే సునామీ వచ్చే ప్రమాదం ఉంది. సునామీ వేగం నీటి లోతును బట్టి ఉంటుంది. 4 వేల మీటర్ల లోతులో అయితే దీని వేగం గంటకు 500- 700 కి.మీ ఉంటుంది. అదే 10 మీటర్ల నీటి లోతులో దీని వేగం గంటకు 36 కి.మీ.కు తగ్గుతుంది. సాధారణంగా సునామీలు అలల లాగే కన్పిస్తాయి. కానీ సునామీకి సాధారణ కెరటాలకు చాలా తేడా ఉంది. కెరటాలు గాలి వల్ల లేచి 5 నుంచి 20 సెకన్లలో పూర్తవుతాయి. అయితే సునామీ అలా కాదు. 5 నిమిషాల నుంచి దాదాపు గంటన్నర వరకు ఉంటుంది. ఈ రాకాసి అలలు కలిగించే నష్టం కూడా తీవ్రస్థాయిలో ఉంటాయి.. 2004, 2011లో వచ్చిన సునామీల వల్ల వాటిల్లిన విధ్వంసమే ఇందుకు ఉదాహరణ.:::సాక్షి వెబ్‌డెస్క్ -
చరిత్రలో అత్యంత భీకర సునామీ ఏదో తెలుసా?
అనూహ్యంగా విజృంభించే ప్రకృతి ప్రళయాల నుంచి తప్పించుకోవడం మానవాళికి అసాధ్యం!. హిందూ మహాసముద్ర తీర ప్రాంతంలో 2004 డిసెంబర్ 26వ తేదీన సునామీ విధ్వంసం సృష్టించే వరకు సునామీ అనే ఓ విపత్తు గురించి సామాన్య ప్రజలకు పెద్దగా తెలియదు. తాజాగా జపాన్‌లో.. అదీ కొత్త సంవత్సరం నాడే సునామీ అలజడి రేగింది. ఈ నేపథ్యంలో చరిత్రలో ఇప్పటిదాకా నమోదు అయిన అత్యంత భీకర సునామీలను.. అవి కలగజేసిన నష్టాల్ని ఓసారి తిరగేద్దాం. 🌊ఎన్షునాడా సముద్రం, జపాన్, 1498 రిక్టర్ స్కేల్‌పై 8.3 తీవ్రతతో కూడిన భూకంపం దెబ్బకు సంభవించిన ఈ సునామీ జపాన్‌లోని పలు తీర ప్రాంతాల్ని ముంచెత్తింది. సుమారు 31 వేల మందిని బలితీసుకుంది. 🌊ఐస్ బే జపాన్, 1586 రిక్టర్ స్కేల్‌పై 8.2 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం వల్ల ఏర్పడిన ఈ సునామీలో సముద్ర అలలు 6 మీటర్ల ఎత్తుమేర ఎగిసిపడి పలు పట్టణాల్ని ధ్వంసం చేశాయి. బివా అనే సముద్రం ఐస్ బే పట్టణం ఆనవాళ్లు కనిపించనంత స్థాయిలో ముంచెత్తింది. ఇందులో 8 వేల మంది మరణించారు. 🌊నాంకైడో, జపాన్, 1707 8.4 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల ఏర్పడిన సునామీ దెబ్బకు సముద్ర అలలు 25 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడ్డాయి. ఇందులో సుమారు 30 వేల మంది చనిపోగా, భారత్‌లోని కొచ్చిలో బలమైన సముద్ర అలలు తీరాన్ని దాటుకుని చొచ్చుకొచ్చాయి. 🌊లిస్బన్, పోర్చుగల్, 1755 8.5 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి పోర్చుగల్ పశ్చిమ తీరం, స్పెయిన్ దక్షిణ తీరాల్లో సునామీ వచ్చింది. కొన్నిచోట్ల సముద్ర అలలు 30 మీటర్ల ఎత్తుకు లేచాయి. పోర్చుగల్, మొరాకో, స్పెయిల్ దేశాల్లో సుమారు 60 వేల మంది చనిపోయారు. 🌊రైకూ దీవులు, జపాన్, 1771 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపంతో ఏర్పడిన సునామీ వల్ల ఈ ప్రాంతంలోని పలు దీవులు దెబ్బతిన్నాయి. ఇషిగాకి దీవిలో 85.4 ఎత్తు మేర అలలు ఎగిసిపడ్డాయి. ఇందులో సుమారు 3 వేల ఇళ్లు ధ్వంసం కాగా, 12 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. సునామీ అనేది జపనీస్ భాషకు చెందింది. దానికి అర్థం హార్బర్ కెరటం. సునామీలు ఏర్పడినప్పుడు రాకాసి అలలు 100 అడుగుల ఎత్తు వరకు వెళతాయి.సునామీ అలలు గంటకి 805 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఒక జెట్ విమానం స్పీడ్‌తో ఇది సమానం.ప్రపంచంలో జపాన్ తర్వాత అమెరికాలోని హవాయి, అలస్కా, వాషింగ్టన్, ఒరెగాన్, కాలిఫోర్నియాకు సునామీ ముప్పు ఎక్కువ. అందులో హవాయి దీవులకి ఉన్న ముప్పుమరెక్కడా లేదు. ప్రతీ ఏడాది అక్కడ సునామీ సంభవిస్తుంది. ప్రతీ ఏడేళ్లకి తీవ్రమైన సునామీ ముంచేస్తుంది. పసిఫిక్ మహాసముద్రంలో రింగ్ ఆఫ్ ఫైర్ కారణంగానే 80 శాతానికి పైగా సునామీలు సంభవిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 5వ తేదీన సునామీ అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. 🌊ఉత్తర చిలీ, 1868 8.5 తీవ్రతతో సంభవించిన రెండు వేర్వేరు భూకంపాల వల్ల ఈ సునామీ ఏర్పడింది. 21 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడిన అలల మూడు రోజుల పాటు విధ్వంసం సృష్టించాయి. ఇందులో సుమారు పాతిక వేల మంది చనిపోగా, 300 మిలియన్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లింది. 🌊క్రకటోవా, ఇండోనేసియా, 1883 క్రకటోవా అగ్నిపర్వతం బద్దలవడం వల్ల ఈ సునామీ సంభవించింది. 37 మీటర్ల ఎత్తులో ఎగిసిపడిన అలలు అంజీర్, మెరాక్ పట్టణాల్లో విధ్వంసం సృష్టించాయి. బాంబేలో తీరం నుంచి సముద్రం వెనక్కిపోయినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ సునామీలో సుమారు 36 వేల మంది చనిపోయారు. 🌊సాంక్రికు, జపాన్, 1896 జపాన్‌లోని సాంక్రికు తీరంలో సంభవించిన భూకంపం దెబ్బకు ఏర్పడిన సునామీ వల్ల 38.2 మీటర్ల ఎత్తు మేర సముద్ర అలలు ఎగిసిపడ్డాయి. ఇందులో 11 వేల ఇళ్లు నేలమట్టం కాగా, సుమారు 22 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో చైనాలో సంభవించిన సునామీలో 4 వేల మంది చనిపోయారు. 🌊సుమత్రా, ఇండోనేసియా, 2004 9.1 తీవ్రతతో కూడిన భూకంపం కారణంగా సంభవించిన ఈ సునామీ ఇండోనేసియాతో పాటు శ్రీలంక, భారత్ తీర ప్రాంతాల్లో పెను ప్రళయం సృష్టించింది. 50 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడిన సముద్ర అలలు తీర ప్రాంతం నుంచి 5 కి.మీ దూరం వరకు చొచ్చుకొచ్చాయి. సుమారు 2 లక్షల మంది మృత్యువాత పడగా, 10 బిలియన్ డాలర్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లింది. ఇప్పటి వరకు తెలిసిన అత్యంత భీకర సునామీ ఇదేనని భావిస్తున్నారు. దీని ప్రభావంతో అమెరికా, యూకే, అంటార్కిటికా తదితర ప్రాంతాల్లో కూడా అలలు ఎగిసిపడ్డాయి. ఈ భూకంపం 23 వేల ఆటంబాంబుల పేలుళ్లతో సమానం. 🌊ఉత్తర పసిఫిక్ తీరం, జపాన్, 2011 పది మీటర్లకు పైగా ఎగిసిపడిన రాకాసి అలలు 18 వేల మందిని బలిగొన్నాయి. అంతకుముందు, 24.4 తీవ్రతతో సంభవించిన భూకంపం ఇప్పటి వరకు వచ్చిన నాలుగో అతి పెద్దదని భావిస్తున్నారు. ఈ దెబ్బకు సుమారు 4.50 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. భూ ప్రకంపనలకు ఫుకుషిమా దైచీ అణు విద్యుత్ కేంద్రం నుంచి రేడియోధార్మిక వాయువులు లీకు కావడంతో భారీగా నష్టం వాటిల్లింది. ఈ నష్టాన్ని అధిగమించడానికి జపాన్‌కు ఐదేళ్లు పట్టింది. -
రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ..
ద్వీపకల్ప దేశం సొలోమన్ ఐలాండ్స్‌లో మంగళవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.0గా నమోదైంది. సోలోమన్ తీరానానికి 300 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూకంపం ధాటికి 20 సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇళ్లు కదిలి, ఇంట్లోని టీవీ, ఇతర సామాన్లు కిందపడిపోయినట్లు పేర్కొన్నారు. ప్రజలు భయంతో ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీసినట్ల వివరించారు. భూకంపం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే మొదట 7.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు తెలిపిన అధికారులు ఆ తర్వాత దాన్ని 7.0గా సవరించారు. మొదట సునామీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కాసేపటి తర్వాత.. ముప్పు తప్పిందని నిర్ధరించుకున్నాక ఆదేశాలు ఉపసంహరించుకున్నారు. చదవండి: ఇండోనేషియాలో భారీ భూకంపం.. 162 మంది దుర్మరణం -
జపాన్‌లో భారీ భూకంపం… సునామీ హెచ్చరికలు జారీ
టోక్యో: జపాన్‌లో బుధవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.3గా నమోదైనట్లు ఆ దేశ వాతావరణ సంస్థ ప్రకటించింది. ఉత్తర జపాన్‌లోని ఫుకుషిమా తీర ప్రాంతంలో భూకంపం కేంద్రీకృతమైందని తెలుస్తోంది. భూకంపం నేపథ్యంలో జపాన్‌లో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈశాన్య తీరంలో అలలు మీటర్ ఎత్తు వరకు ఎగసిపడవచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు భూకంపం ధాటికి సుమారు 20 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ పేర్కొంది. కాగా, 2011లో కూడా ఉత్తర జపాన్‌లో 9 తీవ్రతతో భూకంపం సంభవించింది. అప్పుడు ఉద్భవించిన సునామీ అణు విపత్తుకు కారణమైంది. చదవండి: కిల్లింగ్ స్టోన్: ఆ రాయిని తాకిన అందరూ చనిపోయారు.. ఈ మధ్యే.. -
ముందుకొస్తున్న పసిఫిక్.. పలు దేశాలు గజగజ
పసిఫిక్ మహాసముద్రం దక్షిణ భాగంలో టోంగా దగ్గర అగ్నిపర్వతం భారీ శబ్ధంతో శనివారం బద్ధలైన సంగతి తెలిసిందే. ఆ ధాటికి భారీ ఎత్తున అలలు ఎగసి పడుతుండడంతో తీర ప్రాంతాలు అప్రమత్తం అవుతున్నాయి. చాలా చోట్ల సముద్ర జలాలు ముందుకు దూసుకురావడంతో.. అల్లకల్లోలం నెలకొంది. Tsunami Warning For Some Pacific Coastal Countries: ఈ పరిణామంతో టోంగాతో పాటు అమెరికన్ సమోవా, న్యూజిలాండ్, ఫిజీ, వనువాటు, చిలీ, ఆస్ట్రేలియా.. సునామీ హెచ్చరికలు జారీ చేశాయి. నాలుగు అడుగుల ఎత్తుతో అలలు ఎగసిపడగా.. టోంగా రాజధాని నుకువాలోఫా ప్రజలు వణికిపోయారు. భారీ శబ్ధంతో భూమీ కంపించడంతో పాటు సముద్రపు నీరు నగరంలోకి చొచ్చుకుని వచ్చిందని ఆస్ట్రేలియా బ్యూరో ఆఫ్ మెటియోరాలజీ ప్రకటించింది. టోంగా రాజు ప్యాలెస్ నుంచి ఇప్పటికే సురకక్షిత ప్రాంతానికి తరలిపోగా.. తన పౌరులను అప్రమత్తంగా ఉండాలంటూ పిలుపు ఇచ్చాడు. నష్టం వివరాలు అందాల్సి ఉంది. మరోవైపు అలలు ఎగసిపడే అవకాశం ఉన్నందున అమెరికా, జపాన్, సైతం ఇప్పుడు సునామీ హెచ్చరికలతో అప్రమత్తం అయ్యాయి. జపాన్ తీర ప్రాంతం వెంబడి 11 అడుగుల మేర అలలు ఎగసిపడే అవకాశం ఉందని భావిస్తోంది వాతావరణ సంస్థ. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచిస్తోంది. మరోవైపు అమామీ ఒషీమా ద్వీపంలోకి 1.2 మీటర్ ఎత్తుతో అలలు ఎగసిపడినట్లు తెలుస్తోంది. అమెరికా, కెనడా పశ్చిమ తీరం వెంట సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. కాలిఫోర్నియా, అలస్కా వెంట చిన్నపాటి వరదల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హవాయ్ అప్రమత్తం అయ్యింది. ఓరేగావ్ తీరం వెంట సముద్రపు అలలు ముందుకు వస్తున్నాయి. So this happened in Tonga today! Massive Underwater volcanic eruption sending shockwave across South Pacific as captured by Himawari Satellite! Tsunami just hit Tonga and some region of Fiji Island! Prayers for people there!#Tsunami pic.twitter.com/7Q4mRhNcVQ — Vishal Verma (@VishalVerma_9) January 15, 2022 Stay safe everyone 🇹🇴 pic.twitter.com/OhrrxJmXAW — Dr Faka’iloatonga Taumoefolau (@sakakimoana) January 15, 2022 వీడియో: టోంగా దగ్గర పేలిన అగ్నిపర్వతం -
పసిఫిక్‌లో అల్లకల్లోలం.. భారీ శబ్ధాలతో సునామీ హెచ్చరికలు
పసిఫిక్ మహాసముద్రంలోని టోంగా సమీపంలో భారీ అగ్నిపర్వతం బద్ధలైంది. ఈ ప్రభావంతో తీర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బూడిద ఆవరించింది. ఆకాశంలో 20 కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద మేఘాలు అలుముకున్నాయి. భారీ ప్రకంపనల కారణంగా.. సముద్ర జలాలు ముందుకు చొచ్చుకునిరాగా.. కొన్ని దేశాలు సునామీ హెచ్చరికలు జారీ చేశాయి. టోంగా జియోలాజికల్ సర్వీసెస్ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. పసిఫిక్‌లో అనేక ద్వీపదేశాలు.. మహాసముద్ర అంతర్భాగంలో అనేక అగ్నిపర్వతాలు ఉన్నాయి. టోంగాకు సమీపాన అగ్నిపర్వతం హుంగా టోంగా-హుంగా హాపై హఠాత్తుగా బద్దలైంది. ది హుంగా టోంగా హాపై అగ్నిపర్వతం.. టోంగాన్ రాజధాని నుకువాలోఫాకు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. విస్ఫోటనం తాలూకు శబ్దాలు 8 నిమిషాల పాటు కొనసాగాయి. విస్ఫోటనం తీవ్రత ఎంతగా ఉందంటే, అక్కడికి 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫిజీ దీవుల్లోనూ శబ్దాలు వినిపించాయట!. Stay safe everyone 🇹🇴 pic.twitter.com/OhrrxJmXAW — Dr Faka’iloatonga Taumoefolau (@sakakimoana) January 15, 2022 కాగా సముద్రంలో అగ్నిపర్వతం పేలుడును పలు శాటిలైట్లు చిత్రీకరించాయి. హిమావరీ శాటిలైట్ చిత్రీకరించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ అగ్నిపర్వతం పేలుడు ధాటికి న్యూజిలాండ్, టోంగా, ఫిజీ వంటి దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. సముద్ర తీర ప్రాంతాల వాసులు తమ నివాసాలను వదిలి వెళ్లాలని, ఎత్తయిన ప్రదేశాలకు చేరుకోవాలని పలు దేశాల్లో అప్రమత్తం చేస్తున్నాయి. శుక్రవారం సునామీ హెచ్చరికలు వెనక్కి తీసుకున్న కొన్ని గంటలకే.. ఈ పరిణామంతో మళ్లీ హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. మరోవైపు కొన్ని పాత, ఫేక్ వీడియోలు సైతం సునామీ పేరిట వైరల్ అవుతున్నాయి. The volcanic eruption in Tonga captured by #Himawari satellite.. Massive!😳 pic.twitter.com/1qy4FJgpvM — Raj Bhagat P #Mapper4Life (@rajbhagatt) January 15, 2022 A second tsunami event near Tonga has triggering warnings for Australia, Fiji, New Zealand, Vanuatu, Samoa, Lord Howe and Norkfolk Island. https://t.co/j72Me4KLjv pic.twitter.com/JrnMkKH6wX — The Australian (@australian) January 15, 2022 -
భారీ భూకంపం.. సునామీ అలెర్ట్
జకార్తా: సునామీ అలెర్ట్‌తో ఇండోనేషియా తీర ప్రాంతం గజగజలాడింది. మంగళవారం ఫ్లోర్స్ ద్వీపానికి సమీపంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో భూకంపం చోటుచేసుకోవటంతో ఇండోనేషియా సునామీ హెచ్చరికలను జారీ చేసింది. ఈ ఏడాది మే నెలలో కూడా సుమత్రా ద్వీపం వాయువ్య తీరంలో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం చోటు చేసుకున్న భారీ భూకంపంతో ఇండోనేషియా ప్రజలు వణికిపోతున్నారు. చదవండి: దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి కోవిడ్ పాజిటివ్ గతంలో 26 డిసెంబర్ 2004లో ఇండోనేషియా సముద్రతీరంలో వచ్చిన భూకంపం.. సునామీగా మారటంతో దేశం అల్లకలోక్లమైన విషయం తెలిసిందే. వాయువ్య సుమత్రా తీరంలో 9.1 తీవ్రతతో సంభవించిన భూకంపం ఇండోనేషియా, శ్రీలంక, భారతదేశం, థాయ్‌లాండ్ మరో తొమ్మిది దేశాల్లో బీభత్సం సృష్టించింది. అప్పటి సునామి పలు దేశాల్లో వేల మందిని పొట్టనబెట్టుకుంది. ప్రస్తుతం చోటు చేసుకున్న భారీ భూకంపం 2004 సునామీని రిపీట్ చేస్తుందా? అనే ఆందోళనలో ఇండోనేషియా ప్రజలు భయపడిపోతున్నారు. -
జపాన్‌లో భారీ భూకంపం.. సునామి హెచ్చరికలు జారీ
-
జపాన్‌లో భారీ భూకంపం.. సునామి హెచ్చరికలు జారీ
టోక్యో: జపాన్‌లో భారీ భూకంపం చోటు చేసుకుంది. ఈశాన్య జపాన్‌లోని మియాగి ప్రిఫెక్చర్ తీరంలో 7.2 తీవ్రతతో శనివారం భూకంపం సంభవించినట్లు జపాన్ వాతావరణ సంస్థ పేర్కొంది. ఈ భూకంపం తీర ప్రాంతంలో 37 మైళ్ల లోతులో చోటుచేసుకున్నట్లు తెలిపింది. ఈ భూకంపం తీరం ప్రాంతాల్లో సుమారు ఒక మీటరు దూరంలో తీవ్రమైన సునామిగా మారనున్నట్లు వాతావరణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక, 2011లో సంభవించిన భూకంపం జపాన్ను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. -
నిట్ట నిలువునా కూలిన అపార్ట్మెంట్
ఇస్తాంబుల్: టర్కీ, గ్రీస్ దేశాల్లో శుక్రవారం సంభవించిన భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. టర్కీ పశ్చిమ తీరం, గ్రీస్ ద్వీపం సామోస్‌ల మధ్య ఏజియన్ సముద్రంలో సంభవించిన పెను భూకంపం ధాటికి రెండు దేశాల్లోని తీర ప్రాంత నగరాలు, పట్టణాలు చిగురుటాకుల్లా వణికాయి. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టారు. భారీగా దూసుకొచ్చిన రాకాసి అలలు తీరప్రాంతాలను ముంచెత్తాయి. ఇక్కడి విషాదాన్ని కళ్లకి కట్టే వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ‘ప్రే ఫర్ టర్కీ’ పేరుతో పోస్ట్ చేసిన ఈ వీడియోలు అక్కడి విధ్వంసాన్ని కళ్లకి కడుతున్నాయి. ఇక టర్కీ ఏజీయన్ సిటీ ఇజ్మీర్‌లో అపార నష్టం వాటిల్లింది. ఇక్కడ సుమారు 30 లక్షల మంది నివాసం ఉంటున్నారు. ఈ నగరం ఎత్తైన అపార్ట్మెంట్లను కలిగి ఉంది. ఓ సీసీటీవీ వీడియోలో భూకంపం ధాటికి ఓ రెస్టారెంట్ కిచెన్ కంపించడం.. సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీయడం చూడవచ్చు. అలానే ఇజ్మీర్ సమీపంలోని ఒక పట్టణంలోకి సముద్రపు ఉప్పెన నీరు దూసుకువచ్చింది. వీధులన్ని జలమయమయ్యాయి. బహుళ అంతస్థుల భవనాలు క్షణాల్లో కుప్పకూలిపోయాయి. ఆ ప్రాంతాల్లో దటమైన తెల్లటి పొగ రావడం వీడియోలో చూడవచ్చు. ఈ భూకంపం కారణంగా టర్కీ, గ్రీస్‌ల్లో మొత్తం 14 మంది మరణించారు. టర్కీలో 12 మంది చనిపోయారని, అందులో ఒకరు నీళ్లలో మునిగి చనిపోయారని, 419 మంది గాయపడ్డారని అధికారులు ప్రకటించారు. సామోస్ ద్వీపంలో గోడ కూలి ఒక యువతి, ఒక యువకుడు చనిపోయారని అధికారులు వెల్లడించారు. (చదవండి: టర్కీ, గ్రీస్‌లో భారీ భూకంపం) ఇక ప్రపంచవ్యాప్తంగా తీవ్ర నష్టం కలిగించిన భూకంపాల్లో కొన్ని టర్కీ, గ్రీస్‌లో సంభవించాయి. వీటిలో 1999లో 7.4 తీవ్రతతో టర్కీ వాయువ్య దిశలో సంభవించిన భూకంపం ఒకటి. ఈ ఘటనలో ఇస్తాంబుల్‌లో 1000 మంది సహా 17 వేల మందికి పైగా మరణించారు. గ్రీస్‌లో 2017లో భయంకరమైన భూకంపం నమోదయ్యింది. సమోస్ సమీపంలో సంభవించిన ఈ భూకంపంలో ఇద్దరు మరణించారు. -
భారీ భూకంపం
-
టర్కీ, గ్రీస్‌ల్లో భారీ భూకంపం
ఇస్తాంబుల్: భారీ భూకంపం టర్కీ, గ్రీస్ దేశాల్లో విధ్వంసం సృష్టించింది. టర్కీ పశ్చిమ తీరం, గ్రీస్ ద్వీపం సామోస్‌ల మధ్య ఏజియన్ సముద్రంలో సంభవించిన పెను భూకంపం ధాటికి రెండు దేశాల్లోని తీర ప్రాంత నగరాలు, పట్టణాలు చిగురుటాకుల్లా వణికాయి. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టారు. భారీగా దూసుకొచ్చిన రాకాసి అలలు తీరప్రాంతాలను ముంచెత్తాయి. ఈ భూకంపం కారణంగా టర్కీ, గ్రీస్‌ల్లో మొత్తం 14 మంది మరణించారు. టర్కీలో 12 మంది చనిపోయారని, అందులో ఒకరు నీళ్లలో మునిగి చనిపోయారని, 419 మంది గాయపడ్డారని అధికారులు ప్రకటించారు. సామోస్ ద్వీపంలో గోడ కూలి ఒక యువతి, ఒక యువకుడు చనిపోయారని అధికారులు వెల్లడించారు. భూకంపం ప్రభావం పశ్చిమ టర్కీలోని ఇజ్మిర్ పట్టణంపై భారీగా పడింది. అక్కడ పలు భవనాలు నేల కూలాయి. విద్యుత్, సమాచార వ్యవస్థలు స్తంభించాయి. మృతుల సంఖ్య కూడా ఇక్కడ ఎక్కువగా ఉంది. భవన శిధిలాల కింద మరికొంత మంది చిక్కుకుని ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. కుప్పకూలిన భవనాల శిధిలాల నుంచి 70 మందిని రక్షించామన్నారు. భూమి 25 నుంచి 30 సెకన్ల పాటు కంపించిందని స్థానికుడొకరు తెలిపారు. 7.0 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం కారణంగా టర్కీలోని సెఫారిసర్‌లో స్వల్ప స్థాయిలో సునామీ వచ్చింది. గ్రీస్ ద్వీపం సామోస్‌లో సునామీ హెచ్చరిక జారీ చేశారు. సముద్ర జలాలు వీధులను ముంచెత్తాయి. భవనాలు, రహదారులు ధ్వంసమయ్యాయి. భారీ విధ్వంసం టర్కీలోని మూడో అతిపెద్ద నగరం ఇజ్మిర్. ఇక్కడే భూకంపం ఎక్కువ విధ్వంసం సృష్టించింది. ఇక్కడ 10కి పైగా భవనాలు పూర్తిగా కూలిపోయాయని, చాలా భవనాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయని ఇజ్మిర్ గవర్నర్ యువుజ్ సెలిమ్ కోస్గర్ తెలిపారు. సుమారు 12 భవనాల వద్ద సహాయ చర్యలు కొనసాగుతున్నాయన్నారు. 38 అంబులెన్స్‌లు, రెండు హెలీకాప్టర్లు, 35 మెడికల్ టీమ్స్ సహాయ చర్యల్లో పాలు పంచుకుంటున్నాయన్నారు. సెఫారిసర్‌లో వరదలు వచ్చిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సామోస్ ద్వీపానికి ఉత్తర, ఈశాన్య ఉత్తరంగా 13 కిలోమీటర్ల దూరంలో ఏజియన్ సముద్రంలో భూకంప కేంద్రాన్ని గుర్తించామని యూరోపియన్–మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ ప్రకటించింది. భూకంప తీవ్రతను భూకంప లేఖినిపై ప్రాథమికంగా 6.9 గా నిర్ధారించింది. అయితే, అమెరికా జియోలాజికల్ సర్వే మాత్రం భూకంప తీవ్రతను 7.0 గా పేర్కొంది. 10 కిమీల లోతున మాత్రమే భూకంపం సంభవించినందున ప్రధాన భూకంపం అనంతర ప్రకంపనలు మరికొన్ని వారాల పాటు కొనసాగవచ్చని గ్రీక్‌కు చెందిన భూకంప నిపుణుడు ఎకిస్ సెలెంటిస్ హెచ్చరించారు. వాటిలో కొన్ని శక్తిమంతమైన భూకంపాలు కూడా ఉండవచ్చని అంచనా వేశారు. భూకంప ప్రకంపనలు గ్రీస్ రాజధాని ఏథెన్స్‌తో పాటు బల్గేరియా వరకు విస్తరించాయి. టర్కీలో ఇస్తాంబుల్, మర్మరా, ఏజియన్ ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. -
7.3 తీవత్రతో భూకంపం, సునామీ హెచ్చరిక
పోర్టు మోర్స్‌బే: పాపువా న్యూ గినియా ఈశాన్యంలో ఉన్న వావు తీర ప్రాంతంతో సునామీ సంభవించవచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు యూఎస్ పసిఫిక్ సునామీ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. స్థానిక సమయం ప్రకారం మధ్యాహ్నం 12:50 గంటలకు అక్కడ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్‌పై దీని తీవ్రత 7.3 గా నమోదయ్యింది. సునామీ హెచ్చరిక జారీ చేసిన గంట తరువాత ఈ భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం గురించి ఇంకా ఎలాంటి సమాచారం లేదు. వావు పట్టణం బంగారు మైనింగ్‌కు ప్రసిద్ధి. ఈ పట్టణంలో 5,000 మంది జనాభా నివసిస్తున్నారు. భూకంపం అనేది అక్కడ సర్వసాధారణమైన విషయమని అక్కడున్నవారు చెబుతున్నారు. చదవండి: భూకంపంలోనూ నడిచే బుల్లెట్ ట్రైన్! -
అండమాన్‌లో భూకంపం.. సునామీ హెచ్చరికలు
జకార్త: భారీ భూకంపం ఇండోనేషియాను మరోసారి వణికించింది. సముద్ర తీరంలోని మొలక్కో ప్రాంతంలో గురువారం అర్థరాత్రి సమయంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.2గా నమోదయింది. ఈ మేరకు జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండోనేషియా ఓ ప్రకటన విడుదల చేసింది. తీవ్రత ఎక్కువగా ఉండటంతో ముందస్తు జాగ్రత్తగా సునామీ హెచ్చరికలు జారీచేశారు. ఇండోనేషియా భూకంప తాకిడి భారత్‌లోని అండమాన్ నికోబార్ దీవులనూ తాకింది. గురువారం అర్థరాత్రి నికోబార్ దీవుల్లోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.2గా నమోదయిందని అధికారులు తెలిపారు. భూ ప్రకంపనలతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పలు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. -
28 దేశాలకు హైదరాబాద్ నుంచే సునామీ హెచ్చరికలు
హిందూ మహాసముద్రంతో అనుబంధంగా ఉన్న 28 దేశాలకు సునామీ హెచ్చరికలు మన హైదరాబాద్ నుంచే వెళ్తుంటాయని మీకు తెలుసా? సముద్రాల్లో ఏర్పడే భూప్రకంపనల నుంచి సునామీ రాక.. సముద్రపు అలల ఎత్తు.. వేగం.. వాటి తీవ్రత ఏమేర ఉంటుందో నిమిషాల్లో భారత్‌తో పాటు ఆయా దేశాలకు చేరవేసే ‘విజ్ఞాన వాహిని’ భాగ్యనగర సొంతమనే విషయం తెలుసా? ఔను ఇది నిజం. నగర కీర్తి కెరటంగా ‘ఇంకాయిస్’ (భారత జాతీయ మహా సముద్ర సమాచార సేవా కేంద్రం) పరిఢవిల్లుతోంది. ప్రపంచంలో మూడు దేశాల్లో సునామీ హెచ్చరిక కేంద్రాలు ఉంటే అందులో హైదరాబాద్‌లోని ఇంకాయిస్ ఒకటి. మిగతా రెండు ఇండోనేషియా, ఆస్ట్రేలియా దేశాల్లో ఉన్నాయి. నేడు ‘ప్రపంచ సునామీ అవేర్నెస్ డే’ సందర్భంగా ఇంకాయిస్ అందిస్తున్న సేవలపై ప్రత్యేక కథనం. మత్స్యకారులకు ఉపయోగకర సేవల కోసం 1999లో ప్రగతినగర్ సమీపంలో పొటెన్షియల్ ఫిషింగ్ జోన్ (పీఎఫ్జెడ్)గా ఇంకాయిస్ ఆవిర్భవించింది. సముద్రంలో చేపలు ఎక్కువగా లభ్యమయ్యే ప్రాంతాలను గుర్తించి వారికి చేరవేసే కేంద్రంగా మాత్రమే ఉండేది. ఆ తర్వాత కొద్ది కాలానికి ఓషియన్ స్టేట్ పోర్కాస్ట్ సేవలను ప్రారంభించింది. సముద్ర భాగంలో వాయు దిశ, అలల వేగం, వాటి ఎత్తు, ఉష్ణోగ్రత వివరాలను అందించే సేవలకు అంకురార్పణ చేసింది. 2004లో వచ్చిన సునామీతో వార్నింగ్ సెంటర్‌గా ఇది అవతరించింది. మృత్యు సునామీ.. 2004లో వచ్చిన సునామీతో సుమారు 2,40,000 మంది వరకు అసువులు బాశారు. మరో 48,000 మంది కనిపించకుండాపోయిన విషయం విదితమే. దాదాపు 14 దేశాలపై సునామీ ప్రభావం కనిపించింది. ఆ సమయంలోనే సునామీ అనే పదం అందరికీ పరిచయమైంది. అప్పటివరకు సునామీపై ముందస్తు సమాచారం అందించే కేంద్రం ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేదు. దీంతో భారత ప్రభుత్వం కూడా తేరుకుని సునామీ హెచ్చరిక కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు అప్పటికే ఇంకాయిస్ ద్వారా మహా సముద్ర సమాచార సేవలు అందుతుండడంతో దీనికి అనుబంధంగానే సునామీ హెచ్చరిక కేంద్రం నెలకొల్పింది. 2005 నుంచి 2007 వరకు ఆపరేషన్ ప్రక్రియ కొనసాగింది. 2007లో పూర్తి స్థాయిలో ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సిస్టం కేంద్రంగా అవతరించింది. సునామీఅవేర్నెస్ డే వచ్చిందిలా.. జపాన్‌కు చెందిన గోహి అనే రైతు 1985లో సముద్రం వెనక్కి వెళ్లడాన్ని గుర్తించాడు. శబ్ద తరంగాల్లో మార్పును గమనించాడు. దీంతో సునామీ రాబోతుందని గుర్తించాడు. తమ ఊరిలో ప్రతిఒక్కరికీ ఈ సమాచారం చెప్పే సమయం లేదు. దీంతో ఆయనకు ఓ ఐడియా వచ్చింది. తన పంట పొలాన్ని తగులబెట్టేశాడు. జనాలు ఏం జరుగుతుందోనని అక్కడికి చేరుకున్నారు. అందరూ ఎత్తు ప్రాంతానికి వెళ్లంది అని సైగలతో చెప్పాడు. ఆ సమయంలో వచ్చిన సునామీ నుంచి 400 మందిని గోహి కాపాడాడు. ఇలా ఆయన ప్రేరణతో వరల్డ్ సునామీ అవేర్నెస్ డే వచ్చింది. ఇంకాయిస్ సమాచారం.. సునామీకి ముందు మొదట సముద్రంలో భూమి కంపిస్తుంది. అలా భూప్రకంపనలు జరిగిన 5–6 నిమిషాలకు ఇంకాయిస్‌కు సమాచారం అందుతుంది. సముద్ర భూభాగంలో అమర్చిన సిస్మో మీటర్ల ఆధారంగా శాటిలైట్ ద్వారా భూకంపనలు జరిగిన సమాచారం ఇంకాయిస్‌కు చేరుతుంది. ఆ తర్వాత భూకంపం ప్రభావంతో సునామీ ఉత్పన్నమయ్యే అవకాశం ఉందా? లేదా? అనే దానిపై దృష్టి సారిస్తారు. సముద్ర జలాలకు కొద్ది కి.మీ దూరంలో ఏర్పాటుచేసిన ‘సునామీ బోయ్ నెట్వర్క్’ పరికరాల ఆధారంగా కెరటాల ఎత్తు, వాయు దిశను పరిశీలించి సునామీని గుర్తిస్తారు. గుర్తిస్తారు ఇలా.. సముద్రంలో భూకంపాలు, ల్యాండ్‌స్లైడ్స్ (అగ్ని పర్వతాలు బద్దలవ్వడం), ల్యాండ్ స్లైడ్స్ (కొండ చరియలు విరిగిపడడం), మెటీరాయిడ్ వంటి కారణాలతో సునామీలు ఉత్పన్నమవుతాయి. ఎక్కువ శాతం భూకంపాల ద్వారానే సునామీలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. సునామీ సమయంలో సముద్రం మధ్య భాగంలో వాయువేగం గంటకు 800 కి.మీ, కెరటాల ఎత్తు ఒక మీటరు కంటే తక్కువగా ఉంటాయి. అదే తీర ప్రాంతాన్ని తాకే సమయంలో వాయువేగం గంటకు 30 కి.మీ పడిపోయి అలల ఎత్తు మాత్రం 30 మీటర్లకు పెరిగిపోతుంది. భూమి కంపించడం ద్వారా కూడా సునామీ వచ్చే అవకాశాన్ని అంచనా వేయవచ్చు. విస్తృత అవగాహన.. సునామీ, సముద్ర విపత్తులపై ఇంకాయిస్ విస్తృతమైన అవగాహన కల్పిస్తోంది. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో సునామీ మాక్ డ్రిల్స్‌ను నిర్వహిస్తున్నారు. సునామీ వచ్చేసమయంలో సంకేతాలు ఏవిధంగా ఉంటాయి, ప్రకృతిపరంగా జరిగే మార్పులు, ప్రమాదం నుంచి బయటపడేందుకు అనుసరించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తోంది. నిమిషాల వ్యవధిలోనే.. ఆయా ఆధునిక పరికరాల ద్వారా సునామీ రాకను గుర్తించడమే కాకుండా తీరాన్ని ఎంత సమయంలో చేరుకుంటుంది, ఎంత ఎత్తులో కెరటాలు వస్తాయి, దాని తీవ్రత ఏమేర ఉంటుందో ఇంకాయిస్ అంచనా వేస్తుంది. అలా సేకరించిన సమాచారాన్ని జిల్లా స్థాయిలో ఉండే డిస్ట్రిక్ ఎమర్జెన్సీ సెంటర్లు, రాష్ట్ర స్థాయిలో ఉండే ఎస్ఈఓసీ (స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్), జాతీయ స్థాయిలో ఉండే ఎన్డీఎంఏ (నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ), ఎంహెచ్ఏ (మినిస్ట్రీ ఆఫ్ హోం సైన్సెస్)లకు వెబ్సైట్, మెయిల్, ఎస్ఎంఎస్ల ద్వారా కేవలం పది నిమిషాల లోపే చేరవేస్తుంది. మూడు స్థాయిల్లో ఇంకాయిస్ సమాచారం అందిస్తుంది. వార్నింగ్, అలర్ట్, వాచ్ స్థాయిల్లో సందేశం పంపుతుంది. -
పపువా న్యూగినియాలో భారీ భూకంపం
పోర్ట్ మోర్స్‌బై : సరిగ్గా ఓ వారం రోజుల గడిచాయో లేదో పపువా న్యూగినియా దేశంలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 7.5గా నమోదైంది. మంగళవారం రాబౌల్ నగరంలో ఈ భూకంపం చోటు చేసుకుంది. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం సునామీ వచ్చే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు కూడా జారీ చేసింది. న్యూ బ్రిటెయిన్ ప్రాంతంలోని పపువా న్యూగినియా దీవిలో తూర్పు రాబౌల్‌కి 50 కిలో మీటర్ల దూరంలో ఈ భూకంపం కేంద్రీకృతమై ఉందని అమెరికా జియోలాజికల్ సర్వే విభాగం పేర్కొంది. అయితే, భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని ఆ దేశ అధికార వర్గాలు వెల్లడించాయి. గత మంగళవారం వచ్చిన భూకంప తీవ్రత కన్నా.. ఈ సారి సంభవించిన భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. అలాగే భూకంప ప్రభావానికి సంబంధించి ఇప్పటి వరకు తమకు పూర్తి సమాచారం లేదని, పరిస్థితిని ఇంకా అంచనా వేస్తున్నామని రాబౌల్ పోలీస్ స్టేషన్ కమాండర్ తెలిపారు. -
సునామీలు రావడానికి గల 4 కారణాలు!
వేలు, లక్షల సంఖ్యలో ప్రాణాలను బలిగొనే సునామీలు రావడానికి ప్రధానంగా నాలుగు కారణాలుంటాయి. భూకంపాలు: ఎక్కుసార్లు సునామీలు సముద్రంలో భూకంపాల వల్లే వస్తాయి. రిక్టర్ స్కేల్‌పై 7.5 లేదా అంతకన్నా ఎక్కువ తీవ్రతతో సముద్రంలో సంభవించే భూకంపాల వల్ల సముద్రం అడుగున ఉన్న భూ ఫలకాల్లో కదలికలు సంభవిస్తుంటాయి. అప్పుడు ఆ భాగంలో ఉన్న నీరు అస్థిరతకు లోనై, ఆ తర్వాత భూమ్యాకర్షణ శక్తి వల్ల ఆ నీరంతా మళ్లీ కిందకు రావడం తదితర కారణాలతో సునామీలు సంభవిస్తాయి. మంచుపర్వతాలు విరగడం సముద్రం మధ్యలో ఉండే కొండచరియలు విరిగిపడటం, భారీ మంచుపర్వతాలు పర్వతాలు విరిగిపోవడం వల్ల కూడా భూకంపాలు వస్తాయి. 1980ల్లో ఫ్రాన్స్‌లో సముద్ర తీరంలో రన్‌వే నిర్మిస్తుండగా, సముద్రంలో మంచుపర్వతం విరిగింది. దీంతో థేబ్స్ నౌకాశ్రయం సమీపంలో సునామీ సంభవించింది. అగ్నిపర్వతాలు పేలడం సముద్రంలోని అగ్నిపర్వతాలు పేలినప్పుడు భారీ మొత్తంలో నీరు స్థానభ్రంశం చెంది సునామీ అలలు ఏర్పడతాయి. అలాగే అగ్నిపర్వతం పైభాగం విరిగి సముద్రంలోకి పడినప్పుడు భారీ మొత్తంలో నీరు అగ్నిపర్వంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు ఏర్పడే అలజడుల కారణంగా కూడా సునామీలు వస్తాయి. గ్రహశకలాలు పడటం అప్పుడప్పుడు భూమిపైకి గ్రహశకలాలు, ఉల్కలు రావడం తెలిసిందే. అయితే వీటిలో అత్యధిక శాతం భూ వాతావరణంలోకి ప్రవేశించగానే ఆకాశంలో మండి బూడిదవుతాయి. అలాకాకుండా భారీ ఆకారంలో ఉండే గ్రహశకలాలు, ఉల్కలు సముద్రంలో కూలినా సునామీ అలలు వస్తాయి. ఇలా జరగడం అత్యంత అరుదు. సముద్రం వెనక్కు ఎందుకు వెళ్తుంది? సునామీకి ముందు కొన్నిసార్లు సముద్రం కొన్ని వందల మీటర్లు వెనక్కు వెళ్తుంది. అయితే సునామీ వచ్చే ప్రతీసారీ ఇలాగే జరగదు. ప్రతీ అలకూ రెండు దశలుంటాయి. ఒకటి ముందుకు రావడం, రెండోది వెనక్కు వెళ్లడం. సునామీ అలా ఎక్కడో తీరానికి దూరంలో, సముద్రం మధ్యలో ముందుగా మెల్లగా మొదలవుతుంది. ఆ తర్వాత అది దశలవారీగా పరిమాణం పెంచుకుంటూ తీరంపై భారీ ఎత్తున ఎగసిపడుతుంది. తీరానికి వచ్చే అల ముందుగా ముందుకు వచ్చి తర్వాత వెనక్కు వెళ్లేది అయితే సముద్రం వెనక్కు వెళ్లదు. ఒక్కసారిగా సునామీ వచ్చి మీదపడుతుంది. అదే తీరానికి వచ్చే అలా ముందు వెనక్కు వెళ్లి తర్వాత ముందుకు వచ్చేది అయితే సముద్రం సాధారణం కన్నా బాగా వెనక్కు వెళ్లి మళ్లీ పెద్ద అలగా వస్తుంది. ఎప్పుడైనా సముద్రం ఎక్కువ దూరం వెనక్కు వెళ్లడాన్ని గమనిస్తే అక్కడే చూస్తూ నిల్చోకుండా వెంటనే పరుగెత్తుతూ వెనక్కు వచ్చేయాలి. అక్కడే ఎందుకు ? జకార్తా: ఇండోనేసియాలో తరచుగా అగ్నిపర్వతాలు బద్దలవడం, భూకంపాలు, వరదలు, సునామీలు సంభవిస్తుంటాయి. ప్రపంచంలోనే భూకంపాలు ఎక్కవగా సంభవించే పసిఫిక్ మహాసముద్రంలోని ‘రింగ్ ఆఫ్ ఫైర్’ ప్రాంతంలో ఇండోనేసియా ఉండటం ఇందుకు ప్రధాన కారణం. దీనికితోడు వాతావరణ మార్పులతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమవుతోంది. కరువు కాటకాలు, ఆర్థిక వనరుల కొరత, అవినీతి వల్ల ప్రకృతి విపత్తుల్ని తట్టుకునేలా మౌలిక వసతుల నిర్మాణం అక్కడ జరగడం లేదు. అంతేకాకుండా పోడు వ్యవసాయానికి తోడు ఇండోనేసియాలో విస్తారంగా అడవులను నరికివేస్తున్నారు. దీంతో సునామీ లేదా భూకంపం వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రాణ, ఆస్తి నష్టం విపరీతంగా ఉంటోంది. అంతేకాకుండా ఇండోనేసియాలో ప్రపంచంలోనే అత్యధికంగా 129 క్రీయాశీలక అగ్నిపర్వతాలు ఉన్నాయి. యురేసియన్ ప్లేట్, పసిఫిక్ ప్లేట్, ఇండో–ఆస్ట్రేలియన్ ప్లేట్ల మధ్య రాపిడి కారణంగా ఇక్కడి భూపొరల్లో ఒత్తిడి పెరిగి తరచూ అగ్నిపర్వతాలు బద్దలవుతూ ఉంటాయి. అంతేకాకుండా ఇండోనేసియాలో 50 లక్షల మంది ప్రజలు అగ్నిపర్వతాల ‘డేంజర్ జోన్’లో ఉంటున్నారు. 10 అత్యంత భీకర సునామీలు సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందినా అనూహ్యంగా విజృంభించే ప్రకృతి ప్రళయాల నుంచి తప్పించుకోవడం మానవాళికి అసాధ్యమేనని ఇండోనేసియా సునామీ మరోసారి రుజువు చేసింది. 2004 డిసెంబర్ 26న హిందూ మహాసముద్ర తీర ప్రాంతంలో సునామీ విధ్వంసం సృష్టించే వరకు ఈ విపత్తు గురించి సామాన్య ప్రజలకు పెద్దగా తెలియదు. వాటిల్లిన ఆస్తి, ప్రాణ నష్టం ఆధారంగా చరిత్రలో నమోదైన 10 అత్యంత భీకర సునామీల వివరాలిలా ఉన్నాయి. 1. సుమత్రా, ఇండోనేసియా, 2004 9.1 తీవ్రతతో కూడిన భూకంపం కారణంగా సంభవించిన ఈ సునామీ ఇండోనేసియాతో పాటు శ్రీలంక, భారత్ తీర ప్రాంతాల్లో పెను ప్రళయం సృష్టించింది. 50 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడిన సముద్ర అలలు తీర ప్రాంతం నుంచి 5 కి.మీ దూరం వరకు చొచ్చుకొచ్చాయి. సుమారు 2 లక్షల మంది మృత్యువాత పడగా, 10 బిలియన్ డాలర్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లింది. ఇప్పటి వరకు తెలిసిన అత్యంత భీకర సునామీ ఇదేనని భావిస్తున్నారు. దీని ప్రభావంతో అమెరికా, యూకే, అంటార్కిటికా తదితర ప్రాంతాల్లో కూడా అలలు ఎగిసిపడ్డాయి. 2.ఉత్తర పసిఫిక్ తీరం, జపాన్, 2011 పది మీటర్లకు పైగా ఎగిసిపడిన రాకాసి అలలు 18 వేల మందిని బలిగొన్నాయి. అంతకుముందు, 24.4 తీవ్రతతో సంభవించిన భూకంపం ఇప్పటి వరకు వచ్చిన నాలుగో అతి పెద్దదని భావిస్తున్నారు. ఈ దెబ్బకు సుమారు 4.50 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. భూ ప్రకంపనలకు ఫుకుషిమా దైచీ అణు విద్యుత్ కేంద్రం నుంచి రేడియోధార్మిక వాయువులు లీకు కావడంతో భారీగా నష్టం వాటిల్లింది. ఈ నష్టాన్ని అధిగమించడానికి జపాన్‌కు ఐదేళ్లు పడుతుందని అప్పట్లో ప్రపంచ బ్యాంక్ అంచనావేసింది. 3.లిస్బన్, పోర్చుగల్, 1755 8.5 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి పోర్చుగల్ పశ్చిమ తీరం, స్పెయిన్ దక్షిణ తీరాల్లో సునామీ వచ్చింది. కొన్నిచోట్ల సముద్ర అలలు 30 మీటర్ల ఎత్తుకు లేచాయి. పోర్చుగల్, మొరాకో, స్పెయిల్ దేశాల్లో సుమారు 60 వేల మంది చనిపోయారు. 4. క్రకటోవా, ఇండోనేసియా, 1883 క్రకటోవా అగ్నిపర్వతం బద్దలవడం వల్ల ఈ సునామీ సంభవించింది. 37 మీటర్ల ఎత్తులో ఎగిసిపడిన అలలు అంజీర్, మెరాక్ పట్టణాల్లో విధ్వంసం సృష్టించాయి. బాంబేలో తీరం నుంచి సముద్రం వెనక్కిపోయినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ సునామీలో సుమారు 36 వేల మంది చనిపోయారు. 5.ఎన్షునాడా సముద్రం, జపాన్, 1498 8.3 తీవ్రతతో కూడిన భూకంపం దెబ్బకు సంభవించిన ఈ సునామీ జపాన్‌లోని పలు తీర ప్రాంతాల్ని ముంచెత్తింది. సుమారు 31 వేల మందిని బలితీసుకుంది. 6.నాంకైడో, జపాన్, 1707 8.4 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల ఏర్పడిన సునామీ దెబ్బకు సముద్ర అలలు 25 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడ్డాయి. ఇందులో సుమారు 30 వేల మంది చనిపోగా, భారత్‌లోని కొచ్చిలో బలమైన సముద్ర అలలు తీరాన్ని దాటుకుని చొచ్చుకొచ్చాయి. 7.సాంక్రికు, జపాన్, 1896 జపాన్‌లోని సాంక్రికు తీరంలో సంభవించిన భూకంపం దెబ్బకు ఏర్పడిన సునామీ వల్ల 38.2 మీటర్ల ఎత్తు మేర సముద్ర అలలు ఎగిసిపడ్డాయి. ఇందులో 11 వేల ఇళ్లు నేలమట్టం కాగా, సుమారు 22 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో చైనాలో సంభవించిన సునామీలో 4 వేల మంది చనిపోయారు. 8.ఉత్తర చిలీ, 1868 8.5 తీవ్రతతో సంభవించిన రెండు వేర్వేరు భూకంపాల వల్ల ఈ సునామీ ఏర్పడింది. 21 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడిన అలల మూడు రోజుల పాటు విధ్వంసం సృష్టించాయి. ఇందులో సుమారు పాతిక వేల మంది చనిపోగా, 300 మిలియన్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లింది. 9.రైకూ దీవులు, జపాన్, 1771 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపంతో ఏర్పడిన సునామీ వల్ల ఈ ప్రాంతంలోని పలు దీవులు దెబ్బతిన్నాయి. ఇషిగాకి దీవిలో 85.4 ఎత్తు మేర అలలు ఎగిసిపడ్డాయి. ఇందులో సుమారు 3 వేల ఇళ్లు ధ్వంసం కాగా, 12 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 10. ఐస్ బే జపాన్, 1586 రిక్టర్ స్కేల్‌పై 8.2 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం వల్ల ఏర్పడిన ఈ సునామీలో సముద్ర అలలు 6 మీటర్ల ఎత్తుమేర ఎగిసిపడి పలు పట్టణాల్ని ధ్వంసం చేశాయి. బివా అనే సముద్రం ఐస్ బే పట్టణం ఆనవాళ్లు కనిపించనంత స్థాయిలో ముంచెత్తింది. ఇందులో 8 వేల మంది మరణించారు. సునామీ నుంచి ఇలా తప్పించుకోవచ్చు! సునామీల సందర్భంగా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చని సెంట్రల్ అమెరికా సెస్మలాజికల్ సెంటర్ శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. సునామీ వచ్చేముందు ఏర్పడే పరిస్థితులపై తీరప్రాంత ప్రజలు అవగాహన కలిగిఉండాలని వ్యాఖ్యానించారు. సాధారణంగా తీరప్రాంతాల్లో భూకంపాలు సంభవించినప్పుడు భారీ రాకాసి అలలతో సునామీలు విరుచుకుపడతాయని వెల్లడించారు. అలాగే సునామీ వచ్చేముందు సముద్రంలో నీరు బాగా వెనక్కి వెళ్లిపోతుందని పేర్కొన్నారు. ఒకవేళ మీరు తీరప్రాంతంలో ఉన్నప్పుడు భూకంపం వస్తే ముఖ్యంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. è భూకంపం రాగానే కంగారుపడకుండా సురక్షితంగా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ► అధికారులు సునామీ హెచ్చరికలు జారీచేస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఎత్తైన ప్రాంతం, లేదా ఎత్తైన భవనం పైకి చేరుకోండి. ఈ ప్రాంతం లేదా భవనం సముద్రమట్టం కంటే 30 మీటర్ల ఎత్తులో ఉండేలా చూసుకోండి. ► సముద్రంలో నీరు వెనక్కు వెళుతున్నట్లు గమనిస్తే వెంటనే అక్కడి నుంచి వీలైనంత దూరంగా వచ్చేయండి. ► ఒకవేళ తీరప్రాంతాల్లో ఎత్తైన భవనాలు లేకుంటే అటవీ ప్రాంతంలోకి వెళ్లాలి. ► సునామీల ప్రభావంతో నదులు సైతం కొన్ని కిలోమీటర్ల మేర ► వెనక్కు చొచ్చుకొస్తాయి. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో వాగులు, వంకలకు దూరంగా ఉండండి. ► అధికారులు చెప్పేవరకూ తిరిగి ప్రభావిత ప్రాంతాలకు రాకండి. ఇది క్రకటోవా పిల్లనే... జకర్తా: ఇండోనేసియన్ భాషలో ఆనక్ అంటే బిడ్డ, శిశువు అని అర్థం. క్రకటోవా అనే మరో అగ్నిపర్వతం నుండి ఏర్పడింది కాబట్టి దీనిని ఆనక్ క్రకటోవా అని పిలుస్తారు. సుండా జలసంధిలోనే క్రకటోవా అగ్నిపర్వతం ఉండేది. 1883లో అది పేలి ఏకంగా 36 వేల మంది చనిపోయారు. ఆ అగ్నిపర్వతం అవశేషాల నుంచే మళ్లీ 1928లో ఆనక్ క్రకటోవా ఏర్పడింది. అందుకే దీనిని పిల్ల క్రకటోవా అంటారు. ఇక్కడ మనుషులెవరూ నివసించకపోయినప్పటికీ ఇదో ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం. ‘ఆనక్ క్రకటోవా అగ్నిపర్వతంలో మార్పుల కారణంగానే సముద్రంలో భూ పొరలు స్థానభ్రంశం చెందాయి. ఇది సరిగ్గా పున్నమి నాడు జరగడంతో ఈ భారీ విధ్వంసం సంభవించింది’ అని ఇండోనేసియా జాతీయ విపత్తు స్పందన దళం అధికార ప్రతినిధి సుటొపో పుర్వో నుగ్రోహో చెప్పారు. ఈ ఏడాది జూన్ నుంచే అగ్నిపర్వతం అప్పుడుప్పుడు లావాను, బూడిదను వెదజల్లుతోంది. భారీ మొత్తంలో బూడిద ఆకాశంలోకి వెళ్లడం కనిపిస్తుండేది. అక్టోబర్ నెలలో లావా ఎగిరొచ్చి ఓ టూరిస్ట్ బోట్‌కు అతి సమీపంలో పడింది. అగ్నిపర్వతం తీరానికి సమీపంలోనే ఉండటంతో ఇప్పుడు చాలా తొందరగా అలలు వచ్చి తీరప్రాంతాలపై విరుచుకుపడ్డాయని ‘ది ఓపెన్ యూ నివర్సిటీ’ ప్రొఫెసర్ డేవిడ్ రోథరీ తెలిపారు. తీరానికి దగ్గర్లో ఉన్నందునే సునామీ ప్రమాదాలపై హెచ్చరికలు జారీ చేసే పరికరాలు సముద్రంలో ఉంటాయనీ, ఇలాంటి పరికరం అగ్ని పర్వతం సమీపంలోనే ఉన్నప్పటికీ.. అగ్నిపర్వతం కూడా తీరానికి దగ్గర్లోనే ఉండటంతో పరికరం నుంచి వచ్చిన సంకేతాలను అందుకునేలోపే భారీ అలలు ఎగసిపడ్డాయని డేవిడ్ వివరించారు. రెండు మూడేళ్లకోసారి ఈ అగ్నిపర్వతం అప్పుడప్పుడూ చిన్నగా పేలుతూనే ఉందని ఆస్ట్రేలియాలోని మోనాష్ వర్సిటీ ప్రొఫెసర్ తెలిపారు. ఇప్పుడు కూడా అగ్నిపర్వతం పేలుడు తీవ్రత చాలా తక్కువగానే ఉంటుందనీ, అయితే అప్పుడే భూ ఫలకలు కదలడం వంటి చర్యల కారణంగా సునామీ సంభవించి ఉండొచ్చని ఆయన చెప్పారు. ఇండోనేసియాలో దాదాపు 130 వరకు క్రియాశీలకంగా ఉన్న అగ్నిపర్వతాలు ఉన్నాయి. అందుకే దీన్ని పసిఫిక్‌లో ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అని పిలుస్తారు. -
వణికిపోయిన జపాన్.. భారీగా క్షతగాత్రులు
టోక్యో: భారీ ప్రకంపనలు జపాన్ను ఒక్కసారిగా వణికించాయి. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం పశ్చిమ జపాన్ కేంద్రంగా భూకంపం సంభవించింది. ఈ విపత్తులో ఇప్పటిదాకా ముగ్గురు మరణించగా, 240 మందికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు ప్రకటించారు. ఒసాకా పట్టణ కేంద్రంగా రిక్చర్ స్కేల్‌పై 6.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని వాతావారణ శాఖ తెలిపింది. తీవ్రత తక్కువదే అయినప్పటికీ.. భూకంపం శక్తివంతమైనదిగా శాస్త్రవేత్తలు తేల్చారు. అయితే సునామీ అలర్ట్ మాత్రం ప్రకటించలేదు. ఆఫీస్‌లకు వెళ్లే సమయంలో ప్రకంపనలు సంభవించటంతో ప్రజలు ఒక్కసారిగా పరుగులు తీశారు. వేల సంఖ్యలో ప్రజలు ఇళ్లు వదిలి భయంతో రోడ్ల మీదే గడిపారు. ఒసాకాతోపాటు రాజధాని టోక్యో, క్యోటో, ఇషాకా... ఇలా జపాన్‌లోని పలు ప్రాంతాల్లో కూడా అదే సమయంలో ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు చెబుతున్నారు. మృతుల్లో 9 ఏళ్ల చిన్నారి ఉందని, ప్రస్తుతం విద్యుత్ సరఫరాను నిలిపేసి సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు సహాయక సిబ్బంది తెలిపారు. క్షతగాత్రుల సంఖ్య, మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని వారంటున్నారు. 1995లో 6.9 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం 6 వేల మందికి పైగా బలి తీసుకుంది. ఆ తర్వాత అంతటి స్థాయిలో కాకపోయినా.. తరచూ భూకంపాలు, సునామీలు జపాన్ను వణికిస్తూ వస్తున్నాయి. తాజా భూకంపానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కడలి అలజడి.. అసలేం జరిగింది?
సాక్షి, విశాఖపట్నం: కడలిలో అకస్మాత్తుగా అలజడి రేగింది. ఒకపక్క పెనుగాలులతో కూడిన వర్షం, మరోపక్క ఎగసిపడుతున్న సముద్ర కెరటాలను చూసి జనం ఆందోళన చెందారు. మళ్లీ సునామీ వచ్చేస్తోందంటూ పుకార్లు షికార్లు చేశాయి. కానీ ఇదంతా ప్రచారమేనని వాతావరణ శాఖ స్పష్టం చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అసలేం జరిగిందంటే..? సోమవారం అర్థరాత్రి నుంచి సముద్రంలో కెరటాల ఉధృతి మొదలైంది. మంగళవారం ఉదయానికి వాటి తీవ్రత మరింత పెరిగింది. హిందూ మహాసముద్రానికి (భూమధ్యరేఖకు) బాగా దిగువన మడగాస్కర్ ప్రాంతంలో గాలుల వేగం ఎక్కువగా ఉంటోంది. ఫలితంగా అలలు సుమారు 2 మీటర్లకు పైగా ఎగసిపడుతున్నాయి. ఈ ప్రభావం మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని తీరప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. మన రాష్ట్రంలో ఉత్తర కోస్తాలో దీని ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. సముద్రం ముందుకు చొచ్చుకు రావడంతో పాటు అలలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. తీరప్రాంతంలో గంటకు 45 నుంచి 50 కి.మీ. వేగంతో నైరుతి దిశ నుంచి బలంగా గాలులు వీస్తున్నాయి. అప్రమత్తం చేసిన ఇన్కాయిస్.. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఇన్కాయిస్) ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీరంలో లంగరేసిన బోట్లు దెబ్బతినకుండా దూరంగా ఉండేలా చూసుకోవాలని మత్స్యకారులకు సూచించింది. బుధవారం అర్ధరాత్రి వరకు ఈ పరిస్థితి కొనసాగుతుందని స్పష్టం చేసింది. సునామీ ప్రచారం నమ్మొద్దు.. ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడం, అలలు ఎగసి పడడంతో మీడియా, సోషల్ మీడియాలో సునామీ రాబోతోందంటూ మంగళవారం విపరీతమైన ప్రచారం జరిగింది. కొన్ని టీవీ చానళ్లలోనూ ఈ అంశాన్నే ప్రముఖంగా ప్రసారం చేశాయి. అయితే సముద్రంలో భూకంపాలు సంభవించినప్పుడు మాత్రమే సునామీ వస్తుంది తప్ప కెరటాలు ఎగసిపడినా, అకాల వర్షాలు కురిసినా సునామీ రాదని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు మంగళవారం రాత్రి ‘సాక్షి’కి చెప్పారు. -
అర్ధరాత్రి భారీ భూకంపం
జకర్త : ఫసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌గా పేరొందిన ఇండోనేషియాను మరోసారి భారీ భూకంపం కుదిపేసింది. భారత కాలమాన ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక జావా తీర ప్రాంతంలో భూమి భారీగా ప్రకంపించింది. రిక్చర్ స్కేల్ పై దాని తీవ్రత 6.5గా ఉన్నట్లు నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఏజెన్సీ వెల్లడించింది. పంగందరన్, తసిక్‌మలయా, కియామిస్, బంజర్, గౌరత్, కెబుమెన్, బన్యుమస్ నగరాలు భూకంపం దాటికి వణికిపోయాయి. అర్ధరాత్రి ఘటన చోటుచేసుకోవటంతో ఇళ్లలోంచి ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. జావాకు పశ్చిమాన ఉన్న తసిక్‌మాల్యాకు నైరుతి ప్రాంతంలో భూమికి 92 కిలో మీటర్ల లోతులో భూకంపం కేంద్రం నమోదయినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. సుమారు నిమిషానికి పైగా భూమి కంపించగా.. కొన్ని ప్రాంతాల్లో తీవ్రత అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. భూకంపం దాటికి ఇళ్లకు పగుళ్లు వచ్చేశాయ్. అలల తీవ్రతతో తీర ప్రాంత ఇళ్లలోకి నీళ్లు రావటంతో సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసి.. కొన్ని గంటల తర్వాత ఉపసంహరించుకున్నారు. ఘటనలో 40 ఇళ్లులు కుప్పకూలిపోగా.. 65 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటిదాకా ఇద్దరు చనిపోయినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ.. ఆ సంఖ్య భారీగానే ఉండొచ్చని తెలుస్తోంది. కుప్పకూలిన ఇంటిలో సహాయక చర్యల్లో భద్రతా సిబ్బంది భూకంపం అనంతరం బైకులపై సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్న ప్రజలు -
భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక
పోర్ట్ మోర్స్‌బై: పపువా న్యూ గినియా తీర ప్రాంతంలో ఆదివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 8గా నమోదైంది. సునామీ వచ్చే అవకాశముందని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం ప్రకటించింది. పన్‌గున ఐలాండ్‌లో, బౌగన్‌విల్లే ఐలాండ్‌లో కొన్ని ప్రాంతాల్లో న్యూగినియాకు పశ్చిమాన 40 కిలోమీటర్ల దూరంలో భూ ప్రకంపనలు చోటుచేసున్నాయి. పపువా న్యూ గునియా తీరంలో, సోలమన్ ఐలాండ్, నౌరు, కోస్రే, వనౌతు, ఇండోనేషియాలపై ఈ భూకంప ప్రభావం ఉంటుందని అమెరికా జియోలాజికల్ సర్వే అధికారులు చెబుతున్నారు. ఆస్ట్రేలియాకు మాత్రం ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. 95.5 మైళ్లు లోతున సముద్రంలో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. రింగ్ ఆఫ్ ఫైర్ జోన్లో ఈ దీవులు ఉండటంతో తరచుగా ఇక్కడ భూకంపాలు సంభవిస్తాయన్న విషయం తెలిసిందే. జియోలాజికల్ సర్వే సునామీ వార్నింగ్‌తో న్యూ గినియా అధికారులు అప్రమత్తమయ్యారు. చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. -
పపువా న్యూ గునియాలో భారీ భూకంపం
టరోన్: పపువా న్యూ గునియా తీర ప్రాంతంలో శనివారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 8గా నమోదైంది. సునామీ వచ్చే అవకాశముందని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది. పపువాలోని టరోన్కు తూర్పున 46 కిలో మీటర్ల దూరంలో, 103 కిలో మీటర్ల లోతున సముద్రంలో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. పపువా న్యూ గునియా సమీప ప్రాంతాల్లో సునామీ రావచ్చని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం అప్రమత్తం చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. -
చిలీ భూకంపంలో 10 మంది మృతి
శాండియాగో: చిలీలో సంభవించిన భూకంపంలో ఇప్పటి వరకు 10 మంది మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. రిక్టర్ స్కేలుపై 8.3 తీవ్రతతో నమోదైన చిలీ భూకంప ప్రభావం ప్రపంచంలోని మిగతా ప్రాంతాలని కూడా తాకింది. గురువారం న్యూజిలాండ్‌లో సునామీ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే..అయితే జపాన్ కూడా సునామీ దాడి చేసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే 30సెం.మీ ఎత్తున్న అలలు జపాన్ దక్షిణ తీరాన్ని తాకాయని అధికారులు తెలిపారు. వీటి ప్రభావం అంతగా ఉండకపోయినా తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంతో ఉండాలని సూచించారు. తీరం వెంబడి నివాసముంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. -
ఇండోనేషియాలో భూకంపం
జకార్తా: ఇండోనేషియాలోని మొలుక్కా సముద్రంలో మంగళవారం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.6 నమోదు అయిందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అయితే సునామీ వచ్చే అవకాశాలు లేవని తెలిపింది. భూకంపం వల్ల సముద్ర గర్భంలో పలకల మధ్య తీవ్ర ఒత్తిడి ఏర్పడి ఉండవచ్చని పేర్కొంది. 2004లో పశ్చి సుమిత్ర ద్వీపంలోని అచీ ప్రావెన్స్ సముద్ర గర్భంలో వచ్చిన భూకంపం వల్ల ఏర్పడిన సునామీతో దాదాపు రెండు లక్షల మంది మరణించిన సంగతి తెలిసిందే.