చిలీ భూకంపంలో 10 మంది మృతి
Published Fri, Sep 18 2015 7:15 AM | Last Updated on Sun, Sep 3 2017 9:35 AM
శాండియాగో: చిలీలో సంభవించిన భూకంపంలో ఇప్పటి వరకు 10 మంది మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. రిక్టర్ స్కేలుపై 8.3 తీవ్రతతో నమోదైన చిలీ భూకంప ప్రభావం ప్రపంచంలోని మిగతా ప్రాంతాలని కూడా తాకింది. గురువారం న్యూజిలాండ్లో సునామీ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే..అయితే జపాన్ కూడా సునామీ దాడి చేసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
ఇప్పటికే 30సెం.మీ ఎత్తున్న అలలు జపాన్ దక్షిణ తీరాన్ని తాకాయని అధికారులు తెలిపారు. వీటి ప్రభావం అంతగా ఉండకపోయినా తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంతో ఉండాలని సూచించారు. తీరం వెంబడి నివాసముంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Advertisement