
జకార్త: భారీ భూకంపం ఇండోనేషియాను మరోసారి వణికించింది. సముద్ర తీరంలోని మొలక్కో ప్రాంతంలో గురువారం అర్థరాత్రి సమయంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.2గా నమోదయింది. ఈ మేరకు జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండోనేషియా ఓ ప్రకటన విడుదల చేసింది. తీవ్రత ఎక్కువగా ఉండటంతో ముందస్తు జాగ్రత్తగా సునామీ హెచ్చరికలు జారీచేశారు. ఇండోనేషియా భూకంప తాకిడి భారత్‌లోని అండమాన్ నికోబార్ దీవులనూ తాకింది. గురువారం అర్థరాత్రి నికోబార్ దీవుల్లోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.2గా నమోదయిందని అధికారులు తెలిపారు. భూ ప్రకంపనలతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పలు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment