7.3 తీవత్రతో భూకంపం, సునామీ హెచ్చరిక | Earthquake Hits Papua New Guinea, warning of Tsunami Waves issued | Sakshi
Sakshi News home page

7.3 తీవత్రతో భూకంపం, సునామీ హెచ్చరిక

Published Fri, Jul 17 2020 10:44 AM | Last Updated on Fri, Jul 17 2020 12:59 PM

Earthquake Hits Papua New Guinea, warning of Tsunami Waves issued - Sakshi

పోర్టు మోర్స్‌బే: పాపువా న్యూ గినియా ఈశాన్యంలో  ఉన్న వావు తీర ప్రాంతంతో సునామీ సంభవించవచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు యూఎస్‌ పసిఫిక్‌ సునామీ  కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. స్థానిక సమయం ప్రకారం మధ్యాహ్నం 12:50 గంటలకు అక్కడ భూకంపం సంభవించింది. రిక్టార్‌ స్కేల్‌పై దీని తీవ్రత 7.3 గా నమోదయ్యింది. సునామీ హెచ్చరిక జారీ చేసిన గంట తరువాత ఈ భూకంపం సంభవించినట్లు  తెలుస్తోంది. ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం గురించి ఇంకా ఎలాంటి సమాచారం లేదు. వావు పట్టణం బంగారు మైనింగ్‌కు ప్రసిద్ధి. ఈ పట్టణంలో 5,000 మంది జనాభా నివసిస్తున్నారు. భూకంపం అనేది అక్కడ సర్వసాధారణమైన విషయమని అక్కడున్నవారు చెబుతున్నారు.  
చదవండి: భూకంపంలోనూ నడిచే బుల్లెట్‌ ట్రైన్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement