ఐజ్వాల్ : ఈశాన్య భారతంలో 12 గంటల వ్యవధిలోనే రెండవ భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున 4:10 గంటలకు మిజోరంలో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3 గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ( (ఎన్‌సిఎస్ )పేర్కొంది. దీని ప్రభావం ఎక్కువగా ఛంపాయ్ జిల్లాలో నమోదైందని దాదాపు 27 కిలోమీటర్ల లోతు వరకు భూమి కంపించినట్లు తెలిపింది. అయితే దీని ద్వారా ఎటువంటి ప్రాణనష్టం జరగలేని అధికారులు వెల్లడించారు. వరుస భూకంపాల వల్ల రాష్ర్టంలోని పలు చోట్ల ఇళ్లు ధ్వంసం అవడంతో పాటు రోడ్లపై పగుళ్లు ఏర్పడ్డాయి. ఆదివారం 4:16 గంటలకు మణిపూర్‌లో భూకంపం సంభవించగా, రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైనట్లు మణిపూర్ విశ్వవిద్యాలయానికి చెందిన ఎర్త్ సైన్స్ విభాగం వెల్లడించిన సంగతి తెలిసిందే. (ముంబైకి మరో ముప్పు )
జూన్ 18న ఐదు ఈశాన్య రాష్ర్టాల్లో భూకంపం సంభవించింది. ఛంపాయ్, షిల్లాంగ్ సహా ఐదు ప్రధాన నగరాల్లో భూకంపం భూ ప్రకంనలు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. వరుస భూకంపాలపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆందోళన వ్యక్తం చేశారు . ప్రభుత్వానికి అన్నివిధాలా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీనిపై స్పందించిన మిజోరాం ముఖ్యమంత్రి జొరామ్‌తంగా కృతఙ్ఞతలు తెలిపారు. ఇప్పటివరకు అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగకున్నా ఆస్తినష్టం జరిగిందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
(రైతు వేషంలో మంత్రి: సినిమా సీన్‌ను తలపించేలా.. )
Comments
Please login to add a commentAdd a comment