
జైపూర్ : రాజస్తాన్‌లో గురువారం తెల్లవారుజామున 4.10 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.5గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ అధికారులు తెలిపారు. రాజస్థాన్ బికనేర్ నగరానికి 669 కిలోమీటర్ల దూరంలో భూకంప తీవ్రతను గుర్తించారు. భూకంప ఉపరితలానికి దాదాపు 30 కిలోమీటర్ల లోతులో భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు. గత వారంలోనూ రాజస్థాన్‌లో భకంపం సంభవించిన సంగతి తెలిసిందే. వరుస భూ ప్రకంపనలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
राजस्थान के बीकानेर में महसूस हुए भूकंप के झटके, रिक्टर स्केल पर इतनी थी तीव्रता#Rajasthan #Earthquake #Bikaner https://t.co/kW54UJFNMn
— ABP News (@ABPNews) August 13, 2020