Three Back-To-Back Earthquakes Hit Jaipur In Span Of Half An Hour - Sakshi
Sakshi News home page

వీడియో: పొద్దుపొద్దున్నే అరగంట గ్యాప్‌లో.. జైపూర్‌లో మూడుసార్లు కంపించిన భూమి

Published Fri, Jul 21 2023 8:04 AM | Last Updated on Fri, Jul 21 2023 8:37 AM

Three Back To Back Earthquakes Hit Jaipur In Half An Hour - Sakshi

పింక్‌ సిటీలో అర్థగంట గ్యాప్‌లో మూడుసార్లు భూమి కంపించడంతో.. 

ఢిల్లీ: వరుస భూకంపాలతో రాజస్థాన్‌ రాజధాని, పింక్‌ సిటీ జైపూర్‌ ఉలిక్కిపడింది.  పొద్దుపొద్దున్నే కేవలం అరగంట గ్యాప్‌లోనే మూడు భూకంపాలు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) వెల్లడించింది. 

శుక్రవారం వేకువ ఝామున జైపూర్‌ కేంద్రంగా..  4.09ని ప్రాంతంలో పదికిలోమీటర్ల లోతున ఒకటి, . 4.22ని. ప్రాంతంలో 3.1 తీవ్రతతో ఐదు కిలోమీటర్ల లోతున ఇంకొకటి,  4.25 ప్రాంతంలో 3.4 తీవ్రతతో 10 కిలోమీటర్ల లోతున మరొకటి.. మొత్తం మూడుసార్లు భూమి కంపించింది. 

స్వల్ప ప్రకంపనలే అయినా.. ప్రజలు వణికిపోయారు. కొందరు నిద్ర నుంచి మేల్కొని భయటకు పరుగులు తీసినట్లు తెలుస్తోంది. ఇక ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. 

ప్రకంపనల విషయాన్ని రాజస్థాన్‌ మాజీ సీఎం వసుంధర రాజే సైతం ట్విటర్‌ ద్వారా ధృవీకరించారు. ఇక భూకంపానికి సంబంధించిన వీడియోలు ట్విటర్‌లో పోస్ట్‌ అవుతున్నాయి. మరోవైపు మణిపూర్‌లోనూ భూమి కంపించినట్లు తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement