tremours
-
భూకంపం ధాటికి.. బ్యాంకాక్‌లో ఎమర్జెన్సీ
బ్యాంకాక్: మయన్మార్ భారీ భూకంపం పొరుగున ఉన్న థాయ్లాండ్పైనా తీవ్ర ప్రభావం చూపెట్టింది. ఉత్తర భాగం.. ప్రత్యేకించి రాజధాని బ్యాంకాక్ భారీ ప్రకంపనతో వణికిపోయింది. రిక్టర్ స్కేల్‌పై 7.3 తీవ్రత నమోదైంది. వందల భవనాలు కుప్పకూలిపోవడంతో మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలో.. ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రస్తుతం సహాయక చర్యలను ఆమె దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. నేలమట్టమైన బహుళ అంతస్థుల శిథిలాల కింద ఎంత మంది చిక్కుకుని ఉంటారన్న దానిపై అంచనాకి రాలేకపోతున్నారు. మరోసారి భూకంపం వస్తుందన్న అంచనాలతో అధికారులు బ్యాంకాక్‌లో భవనాలను ఖాళీ చేయిన్నారు. మెట్రో, రైలు సేవలు నిలిపివేశారు. ఎయిర్‌పోర్టు దెబ్బ తినడంతో సర్వీసులను నిలిపివేసి లాక్డౌన్ ప్రకటించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భూకంపం ధాటికి విద్యుత్ సేవలకు, పలు చోట్ల ఇంటర్నెట్కు అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది. అయితే ప్రపంచ పర్యాటక నగరం కావడంతో అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని త్వరగతిన సహాయక చర్యలు కొనసాగిస్తున్నారని అక్కడ స్థిరపడ్డ తెలుగు వ్యాపారి ఒకరు చెబుతున్నారు. #แผ่นดินไหว#แผ่นดินไหว #bangkok #earthquake #Thailand #Myanmar #disaster pic.twitter.com/lwHeZYNNCo— Siu (@ItsSiuOfficial) March 28, 2025At the time of the #Earthquake, some people were on the MRT and luckily the swaying moment had already stopped at the station. So, everyone ran out quickly while the station floor was swinging. #Thailand #Bangkok #Myanmar #แผ่นดินไหว pic.twitter.com/1XlClCWkfH— कृतिका शर्मा (@Kriti_Sanatani) March 28, 2025Bangkok gempa bumi kuat. Received photos & videos from my brother. His office crack everywhere & heard ada building yang runtuh. Semoga dipermudahkan 🥺 #bangkok pic.twitter.com/L4jXpyRfSh— netaflutar (@Netaflutar) March 28, 2025 -
55 ఏళ్ల తర్వాత ఆ రేంజ్లో.. భయపెట్టిన భూకంపం!
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల వెన్నులో ఇవాళ(బుధవారం, డిసెంబర్ 4 2024) స్వల్ప భూకంపం వణుకు పుట్టించింది. ఉదయం ఏడు గంటల ప్రాంతంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు.. బయటకు పరుగులు తీశారు. మీడియా కథనాలతో తమవారి క్షేమసమాచారం గురించి.. ప్రకంపనల గురించి ఆరాలు తీస్తూ కనిపించారు. మరోపక్క.. మళ్లీ భూకంపం రావొచ్చన్న వదంతుల నడుమ చాలా గ్రామాల్లో ప్రజలు సాయంత్రం దాకా రోడ్ల మీదే గడుపుతూ కనిపించారు. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదైందని, తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు హైదరాబాద్‌లోని సీఎస్ఐఆర్-ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు వెల్లడించారు. భూకంప కేంద్రం నుంచి 225 కి.మీ పరిధిలో ఈ ప్రకంపనల ప్రభావం కనిపించిందన్నారు.ఆస్తి, ప్రాణ నష్టం నమోదు కాలేదని ప్రకటించారు.👉హైదరాబాద్ సహా ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, జనగామ జిల్లాల పరిధిలో ప్రకంపనలు వచ్చాయి. హైదరాబాద్ నగర పరిధిలోని వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేట, నందిగామ, ఏలూరు సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది.👉1969లో భద్రాచలం పరిసరాల్లో దాదాపు ఇదే తీవ్రతతో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. సుమారు 50 ఏళ్ల తర్వాత నేడు ఆ తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి పగుళ్లలో ఒత్తిడితో స్థానచలనం జరిగి ప్రకంపనలు వస్తుంటాయని తెలిపారు. 👉హైదరాబాద్, భద్రాచలం, ఏటూరు నాగారం, ములుగు తదితర ప్రాంతాలు జోన్-3లో ఉన్నాయన్నారు. కానీ, జోన్-5లో ఉన్న ఉత్తర భారతంలోని ప్రాంతాలతో పోలిస్తే మన దగ్గర తీవ్రత తక్కువగా ఉంటుందని చెప్పారు. దీంతో.. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు.👉ములుగు నుంచి 50 కిలోమీటర్లు ఈశాన్యం వైపు ఏటూరు నాగారం భూకంప కేంద్రంలో రిక్టర్ స్కేల్ పై 5 తీవ్రతగా భూకంపం నమోదైంది. గతంలో 1969, 2018లో కొత్తగూడెం, భద్రాచలంలో భూ ప్రకంపనలు వచ్చాయి.👉తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలపై తెలంగాణ విపత్తు నిర్వహణశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ములుగు జిల్లా మేడారం వద్ద భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు చెప్పారు. భూమికి 40 కి.మీ లోతులో ప్రకంపనలు వచ్చాయని తెలిపింది. భూకంప కేంద్రం ఎక్కువ లోతులో ఉన్నందున ప్రకంపనల తీవ్రత తక్కువగా ఉందని చెప్పారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు ఎలాంటి నష్టం జరగలేదని, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని, వదంతులు నమ్మొద్దని తెలిపింది. -
Jaipur: అరగంట గ్యాప్‌లో మూడు భూకంపాలు!
ఢిల్లీ: వరుస భూకంపాలతో రాజస్థాన్ రాజధాని, పింక్ సిటీ జైపూర్ ఉలిక్కిపడింది. పొద్దుపొద్దున్నే కేవలం అరగంట గ్యాప్‌లోనే మూడు భూకంపాలు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) వెల్లడించింది. శుక్రవారం వేకువ ఝామున జైపూర్ కేంద్రంగా.. 4.09ని ప్రాంతంలో పదికిలోమీటర్ల లోతున ఒకటి, . 4.22ని. ప్రాంతంలో 3.1 తీవ్రతతో ఐదు కిలోమీటర్ల లోతున ఇంకొకటి, 4.25 ప్రాంతంలో 3.4 తీవ్రతతో 10 కిలోమీటర్ల లోతున మరొకటి.. మొత్తం మూడుసార్లు భూమి కంపించింది. స్వల్ప ప్రకంపనలే అయినా.. ప్రజలు వణికిపోయారు. కొందరు నిద్ర నుంచి మేల్కొని భయటకు పరుగులు తీసినట్లు తెలుస్తోంది. ఇక ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. ప్రకంపనల విషయాన్ని రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే సైతం ట్విటర్ ద్వారా ధృవీకరించారు. ఇక భూకంపానికి సంబంధించిన వీడియోలు ట్విటర్లో పోస్ట్ అవుతున్నాయి. మరోవైపు మణిపూర్‌లోనూ భూమి కంపించినట్లు తెలుస్తోంది. What a scary day to witness such high magnitude #earthquake in #Jaipur. Please be safe! pic.twitter.com/hGDgfCHYtL — Jahnvi Sharma (@JahnviSharma01) July 20, 2023 #earthquake See the dogs on the street in deep sleep suddenly waking up #jaipur #भूकंप pic.twitter.com/oGYz942g9i — Rameshwar Singh (@RSingh6969a) July 20, 2023 जयपुर में तेज़ भूकंप के झटके महसूस किए गए हैं। I hope you all are safe! #Jaipur #earthquake pic.twitter.com/FWAEvBTw7A — Dr.Kirodi Lal Meena (@DrKirodilalBJP) July 20, 2023 -
నెల్లూరు జిల్లాలో భూప్రకంపనలు
-
నెల్లూరు జిల్లాలో భూప్రకంపనలు
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో సోమవారం తెల్లవారుజామున భూమి స్వల్పంగా కంపించింది. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో కొన్ని సెకన్లపాటూ భూమి కంపించింది. వింజమురు, దుత్తలురు మండలాల్లో ప్రకంపనలు సంభవించాయి. దీంతో భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. -
నెల్లూరు జిల్లాలో స్వల్ప భూకంపం
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో గురువారం ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. పొదలకురు, వింజమురు, ఆత్మకూరు, దుత్తలూరు, వరికుంటపాడు మండలాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. 3 సెకన్ల పాటూ భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలతో ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా తరచుగా నెల్లూరు జిల్లాలో భూమి కంపిస్తున్న విషయం తెలిసిందే. కొన్ని నెలల వ్యవధిలో ఇప్పటికే పలుమార్లు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నెల్లూరు జిల్లాలో భూప్రకంపనలు
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున భూమి స్వల్పంగా కంపించింది. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో 3 సెకన్లపాటూ భూమి కంపించింది. వింజమురు మండలం చాలికొండ, బత్తివారిపల్లెలో ప్రకంపనలు సంభవించాయి. దీంతో భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.