న్యూజిలాండ్‌లో భూకంపం: తీవ్రత 7.2 గా నమోదు | Powerful 7.2 magnitude earthquake jolts New Zealand | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్‌లో భూకంపం: తీవ్రత 7.2 గా నమోదు

Published Thu, Sep 1 2016 11:05 PM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM

Powerful 7.2 magnitude earthquake jolts New Zealand

న్యూజిలాండ్‌: న్యూజిలాండ్‌ తీర ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 7.2 గా నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. 159 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించగా.. స్థానిక కాలమానం ప్రకారం.. గురువారం సాయంత్రం 4.37 గంటల ప్రాంతంలో భూమి కంపించింది.

ఒక్కసారిగా భూమి కంపించడంతో తీర పరిసరప్రాంత వాసులంతా భయభ్రాంతులకు లోనైయ్యారు. నిన్న (బుధవారం) పసిఫిక్‌ ఐలాండ్‌లో భూకంపం సంభవించగా, రిక్టర స్కేలుపై దాని తీవ్రత 6.8 గా నమోదైంది. గతవారం ఇటలీలో భారీ భూకంపం (6.2) సంభవించడంతో దాదాపు 247 మంది మృత్యువాతపడిన సంగతి విధితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement