న్యూజిలాండ్‌లో భూకంపం: తీవ్రత 7.2 గా నమోదు
న్యూజిలాండ్: న్యూజిలాండ్ తీర ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.2 గా నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. 159 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించగా.. స్థానిక కాలమానం ప్రకారం.. గురువారం సాయంత్రం 4.37 గంటల ప్రాంతంలో భూమి కంపించింది.
ఒక్కసారిగా భూమి కంపించడంతో తీర పరిసరప్రాంత వాసులంతా భయభ్రాంతులకు లోనైయ్యారు. నిన్న (బుధవారం) పసిఫిక్ ఐలాండ్‌లో భూకంపం సంభవించగా, రిక్టర స్కేలుపై దాని తీవ్రత 6.8 గా నమోదైంది. గతవారం ఇటలీలో భారీ భూకంపం (6.2) సంభవించడంతో దాదాపు 247 మంది మృత్యువాతపడిన సంగతి విధితమే.