family Details
-
AP: పెళ్లయిన ఆ జంటలు.. ఇక ప్రత్యేక కుటుంబాలు
సాక్షి, అమరావతి: మా అబ్బాయికి ఉద్యోగం ఉందనో లేదంటే ఇన్‌కం టాక్స్ కడుతున్నారనో మాకు ప్రభుత్వ పథకాలు రావడం లేదు.. ఈ తరహా కారణంగా ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్న వారికి ప్రభుత్వం సంక్రాంతి కానుకను ప్రకటించింది ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటికీ ప్రాతిపదికగా తీసుకుంటున్న నవశకం సర్వే డేటాలోని కుటుంబ సభ్యుల డేటాలో మార్పులు, చేర్పులకు వీలు కల్పించింది. ఆ సర్వే డేటాలో.. పెళ్లైన రెండు మూడు జంటలు కూడా ఒకే కుటుంబంగా నమోదై ఉండి.. ప్రస్తుతం వారు వేర్వేరుగా నివాసముంటుంటే.. వారిని వేర్వేరు కుటుంబాలుగా వర్గీకరించేందుకు అవకాశం కల్పించింది. మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ సేవలను పొందొచ్చని గ్రామ, వార్డు సచివాలయ అధికారులు వెల్లడించారు. ఆ కారణంతో ప్రభుత్వ పథకాలకు పలువురు దూరం ప్రభుత్వం 2019 ఆగస్టులో గ్రామ, వార్డు వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశాక.. వలంటీర్ల ఆధ్వర్యంలో నవశకం సర్వే నిర్వహించింది. వలంటీర్లు తమ పరిధిలోని ఇంటింటికీ వెళ్లి, ఆ ఇంటి పెద్ద లేదా ఇతర కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఆ కుటుంబ వివరాలను నమోదు చేశారు. రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి మొత్తం 1.67 కోట్ల కుటుంబాలున్నట్టు ఆ సర్వే తేల్చింది. నవశకం పేరుతో జరిగిన ఆ సర్వే వివరాల డేటాను ఆన్లైన్లో నిక్షిప్తం చేశారు. ప్రభుత్వం నవరత్నాల పేరుతో అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల వివరాలను ఆ నవశకం డేటాలో పేర్కొన్న కుటుంబాల వారీగా సభ్యుల వివరాలతో అధికారులు పోల్చి చూస్తున్నారు. అయితే, అప్పట్లో ఒకే కుటుంబంగా తమ వివరాలను నమోదు చేసుకున్న వారు పలు చోట్ల ఇబ్బంది పడుతున్నారు. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారనో, లేదంటే ఇన్‌కం ట్యాక్స్ కడుతున్నారనో, లేదా కారు ఉందనో, లేదంటే వ్యక్తిగత పేరుతో ఎక్కువ ఆస్తి నమోదై ఉందనో.. ఇలా పలు కారణాల వల్ల ఆ కుటుంబంలోని మిగతా వారికి ప్రభుత్వ పథకాలు అందడం లేదు. దీంతో కుటుంబ సభ్యుల వివరాల విభజనకు అవకాశం కలి్పంచాలని వారు ప్రభుత్వానికి అర్జీలిస్తూ వస్తున్నారు. ఇలాంటి వినతులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రావడంతో ప్రభుత్వం నవశకం సర్వే డేటాలో కుటుంబ వివరాల్లో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించింది. ఆ ఆరింటిలో ఏదో ఒక ఆధారం తప్పనిసరి.. నవశకం సర్వే డేటాలోని కుటుంబ సభ్యుల వివరాల్లో మార్పులు, చేర్పులు చేసుకోదలచిన వారు ఆరు రకాల్లో ఏదో ఒక ధ్రువీకరణ పత్రాన్ని చూపించాల్సి ఉంటుంది. సర్వే డేటాలో.. ఇప్పుడు ఒకే కుటుంబంగా పేర్కొంటున్న వారిలో పెళ్లై వేరుగా ఉంటున్న వారు.. వివాహ ధ్రువీకరణ పత్రం, లేదంటే ఆధార్, బియ్యం కార్డు, ఆరోగ్య శ్రీకార్డు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, పాస్‌పోర్టుల్లో భర్త లేదా భార్య పేర్లు ధ్రువీకరించేలా ఉంటే.. ఆ కుటుంబ సభ్యులను మరో కుటుంబంగా గుర్తిస్తారు. అయితే, ఆయా ధ్రువీకరణ పత్రాలుండటంతో పాటు ఆ కుటుంబ సభ్యులు తప్పనిసరిగా వేరుగా నివాసం ఉండాలి. చదవండి: మోదీకి ఆ సలహా ఇచ్చింది నేనే.. జనం చెవుల్లో బాబు పువ్వులు ప్రయోగాత్మక పరిశీలన అనంతరం.. నవశకం సర్వే డేటాలో కుటుంబ సభ్యుల వర్గీకరణను ముందుగా గ్రామీణ ప్రాంతంలో ఒక మండలంలో, పట్టణ ప్రాంతంలో ఒక నగర కార్పొరేషన్ పరిధిలో ఈ నెల 9వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు ప్రయోగాత్మకం(పైలెట్)గా పరిశీలన పూర్తి చేశారు. విజయనగరం జిల్లా గరివిడి మండలం, వైఎస్సార్ జిల్లా కడప నగర కార్పొరేషన్‌ను ఇందుకు ఎంపిక చేశారు. మొదటి దశలో.. పెళ్లైన వారి వివరాల ప్రకారం మార్పులు చేర్పులకు అవకాశం కల్పించారు. మరో రెండు దశల్లో వితంతు, విడాకులు తీసుకున్న వారిని వేరే కుటుంబాలుగా గుర్తించే ప్రక్రియ కూడా ఈ రెండు ప్రాంతాల్లో శుక్రవారం నుంచే ప్రయోగాత్మకంగా కొనసాగుతోందని అధికారులు చెప్పారు. -
ఉక్రెనియన్ తల్లుల ఆవేదన...తమ పిల్లలైన బతికి ఉండాలని..
Ukrainian families who fear they will be killed by Russian Forces: ఉక్రెయిన్ పై రష్యా గత నెలరోజులకు దాడి కొనసాగిస్తోంది. ఉక్రెయిన్‌ని తలవంచకపోయేసరికి ఆగ్రహంతో రష్యా బలగాలు ఊహించని విధంగా పౌరులపై కాల్పుల జరిపి నరమేథానికి పాల్పడుతున్నాయి. ఇప్పటికే బుచా నగరాన్ని శవాల దిబ్బగా మార్చేసింది. అదీగాక రష్యా బలగాలు ఒక్కొక్క నగరాన్ని స్వాధీనం చేసుకుంటూ ఉక్రెయిన రాజధాని కైవ్‌కి సమీపంగా వచ్చేస్తున్నాయి. ఈ తరుణంలో ఉక్రెయిన్ కుటుంబాల్లో భయాలు మొదలయ్యాయి. తాము రష్యాన్ దళాల చేతిలో హతమైతే తమ పిల్లలు బతికి క్షేమంగా ఉండాలని వారి శరీరాలపై ఫోన్ నెంబర్లతో సహా కుటుంబ వివరాలను రాస్తున్నారు. ఆ ఘటనలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఉక్రెయిన్‌లోని ఒక బాలిక తల్లి సాషా మకోవియ్ ఇలానే తన కూతురు శరీరంపై కుటుంబ వివరాలను రాసిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అంతేకాదు తమకు ఏమైన అయితే తమ పాపను మంచిగా చూసుకోవాలనే ఆశతో ఇదంతా చేస్తున్నట్లు వివరించింది. అంతేగాదు గత నెలలో యుద్ధం మొదలైనప్పుడు వేలాది మంది పౌరులు ఉక్రెయిన్ సరిహద్దులకు దాటి వెళ్లారు. ఈ క్రమంలో ఒక పదేళ్ల బాలుడు తన తల్లి ఇచ్చిన చిన్న కాగితం ముక్కతో ఉక్రెయిన్ పొరుగు దేశమైన పోలాండ్ సరిహద్దుకు చేరిన ఉదంతం తెలిసిందే. రష్యన్ బలగాల దాడులకు భయపడి పారిపోతున్న పిల్లలను, పౌరులను మావన కవచాలుగా ఉపయోగిస్తున్నారని ఆరోపణ వెలువెత్తాయి. అంతేకాదు నోవీ బైకివ్ గ్రామంలో యుద్ధ ట్యాంకుల ముందు బస్సులలో పిల్లలను ఉంచుతున్నారని నివేదిక పేర్కొంది. పుతిన్ అరాచకాలకు అంతేలేకుండా పోతుందంటూ ప్రపంచ దేశాల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అంతేగాదు యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ ఈ దాడులన ఖండించడమే కాకుండా పుతిన్‌ని యుద్ధ నేరస్తుడిగా అభివర్ణించారు. Ukrainian mothers are writing their family contacts on the bodies of their children in case they get killed and the child survives. And Europe is still discussing gas. pic.twitter.com/sK26wnBOWj — Anastasiia Lapatina (@lapatina_) April 4, 2022 (చదవండి: యజమాని కోసం నిరీక్షిస్తున్న కుక్క!) -
కొత్త చిక్కుల్లో కరణం!
-
కరణం బండారాన్ని బయట పెట్టిన ఆమంచి
కరణం బలరాం.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్.. ఆయన ఏ పని చేసినా వివాదాస్పదమే.. తాజాగా బలరాం కొత్త చిక్కుల్లో ఇరుక్కున్నారు.. అందులోంచి ఎలా బయటపడాలో తెలియక విలవిల్లాడుతున్నారు.. ఇన్నాళ్లూ గుట్టుగా ఉంచిన వ్యవహారాన్ని ఆమంచి రట్టు చేసేశారు.. అంతటితో ఆగకుండా ఎమ్మెల్యేగా బలరాం ఎన్నిక చెల్లదంటూ ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఇప్పుడీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఎన్నికల అఫిడవిట్లో కరణం తన కుమార్తె అంబిక పేరును చూపకుండా దాచి పెట్టారంటూ ఆమంచి వేసిన పిటిషన్ జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందోనని చీరాల టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.. ఆమంచి ఆధారాలను బయటపెట్టడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మూడు రోజుల క్రితం ఆమంచి హైకోర్టులో పిటీషన్ వేసినా.. మంగళవారం విలేకర్ల సమావేశం పెట్టి మరీ బలరాం బండారాన్ని బయట పెట్టారు. ఇంత జరుగుతున్నా ఆ పెద్దాయన మాత్రం నోరు మెదపక పోవడంతో తప్పు చేయడం వల్లే మౌనంగా ఉన్నారనే ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి సమర్పించిన నామినేషన్ ప్రజాప్రాతినిధ్య చట్టం, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా లేదని, చట్టప్రకారం బహిర్గతం చేయాల్సిన వాస్తవాలను వెల్లడించలేదంటూ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అంబిక కృష్ణ అనే కుమార్తె ఉన్నప్పటికీ బలరాం తన నామినేషన్లో ఆమె వివరాలు పొందుపరచలేదని పిటిషన్లో పేర్కొనడంతో ఇప్పుడు ఈ వ్యవహారం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. కరణం బలరాం ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 7వ తేదీన ఆమంచి హైకోర్టులో ఎన్నికల పిటీషన్ (ఈపీ) దాఖలు చేయడంతో చీరాల టీడీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు, కార్యకర్తల్లో గత మూడు రోజులుగా ఇదే చర్చ కొనసాగుతోంది. అంబిక కృష్ణ ఆధార్ కార్డు, విద్యార్హత పత్రాల్లో తండ్రి పేరు కరణం బలరామకృష్ణమూర్తిగా నమోదైన దృశ్యాలు (సర్కిల్లో) హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయడమే కాకుండా ఆమంచి విజయవాడలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ఆధారాలు బయటపెట్టడంతో కరణం వర్గీయులు అంతర్మథనం చెందుతున్నారు. అంబిక తన కుమార్తె కాదని బలరాం అంటే ఏ పరీక్షకైనా అంబిక సిద్ధంగా ఉందని ఆమంచి సవాలు చేసినా కరణం బలరాం మాత్రం ఈ వ్యవహారంపై ఇంత వరకూ నోరు మెదప లేదు. చిన్న ఆరోపణ వస్తేనే అంతెత్తు ఎగిరిపడే తమ నాయకుడు మూడు రోజులుగా తీవ్ర ఆరోపణలు వ్యక్తమౌతున్నా మౌనంగా ఉండిపోవడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోన చెందుతున్నారు. మౌనం అర్ధాంగీకారమే కదా అనే చర్చా జిల్లాలో కొనసాగుతోంది. ఏదైనా రాజకీయపరమైన వివాదం అయితే పార్టీ తరఫున ఖండించే అవకాశమైనా పార్టీ నేతలకు ఉండేది. వ్యక్తిగతమైన వివాదం కావడంతో ఏం మాట్లాడితే ఏం జరుగుతుందోనని జిల్లా టీడీపీ నేతలు సైతం మిన్నకుండిపోతున్నారు. ఆమంచి ఆరోపణలు ఇవీ... ► కరణం బలరాంకు 1985లో ప్రసూన అనే మహిళతో శ్రీశైలంలో వివాహం జరిగింది. ► వీరిరువురికీ అంబిక కృష్ణ 1989లో హైదరాబాద్‌లోని సెయింట్ థెరిస్సా హాస్పిటల్లో జన్మించింది. ► అంబిక ఎస్ఎస్సీ సర్టిఫికెట్, ఆధార్‌కార్డులో తండ్రి పేరు కరణం బలరామకృష్ణ మూర్తి అని ఉంది. ► అంబిక అన్నప్రాసన, మొదటి పుట్టిన రోజు వేడుకలు, అక్షరాభ్యాస వేడుకలకు సంబంధించిన ఫొటోల్లోనూ బలరాం ఉన్నారు. ► బలరాం తన నామినేషన్లో ప్రసూన, అంబిక కృష్ణల వివరాలను పొందుపర్చకుండా దాచిపెట్టారు. ► ఎన్నికల చట్ట నింబంధన ప్రకారం కరణం నామినేషన్ చట్ట ఆమోదయోగ్యమైన నామినేషన్‌గా పరిగణించడానికి వీల్లేదు. ► బలరాం ఎన్నికను రద్దు చేయాలి.. అంతేకాకుండా చీరాల నియోజకవర్గం నుంచి తాను(ఆమంచి) ఎన్నికైనట్లు ప్రకటించాలి. ► తన తండ్రి ఎవరనేది ప్రపంచానికి చెప్పాలని అంబిక కోరిక.. ఆమెకు న్యాయం చెయ్యాలని నేను ప్రయత్నిస్తున్నా.. పదవుల కోసం కాదు. ► అంబిక తన కూతురు కాదని బలరాం అంటే కనుక ఫోరెన్సిక్, డీఎన్ఏ వంటి ఏ పరీక్షకైనా అంబిక సిద్ధంగా ఉన్నారు. ► కన్న కూతురు పేరు ఎన్నికల అఫిడవిట్లో పెట్టని కఠినమైన వ్యక్తి కరణం బలరాం. -
వివరాలు..ప్లీజ్!
సాక్షి, నల్లగొండ : మీ పేరు, ఊరు, కుటుంబ సభ్యుల వివరాలు... మీరు ఎప్పుడు ఉద్యోగంలో చేరారు.. రెగ్యులర్ ఎప్పుడైంది.. ఆధార్ నంబర్, స్థానికత వివరాలు.. మీరు బ్యాంకులో రుణం తీసుకున్నారా... తీసుకుంటే ఎంత.. ఎన్ని కిస్తీలు కట్టారు.. ఇంకా ఎన్ని కట్టాలి.. మీ భార్య/ భర్త ఏం చేస్తారు.. మీ పిల్లలేం చేస్తారు.. వారి మొబైల్ నంబర్.. మీ జీవిత భాగస్వామి వార్షిక ఆదాయం ఎంత.. ఇలా రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 31 అంశాలపై ఉద్యోగుల నుంచి వివరాలు సేకరించే కార్యక్రమాన్ని చేపట్టింది. అన్ని వివరాలు ఇవ్వాలని జిల్లాలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నాలుగు పేజీల ఫారాలను అందజేసింది. అంతేకాదు.. అడిగిన వివరాలన్నీ ఇస్తేనే మార్చి నెలలో వేతనం అందుకుంటారని సర్కారు స్పష్టం చేసింది. ఈ వివరాలను ఆన్లైన్లో ఇవ్వాలా.. లేదంటే మాన్యువల్‌గా ఇవ్వాలా.. అనే దానిపై ఉద్యోగుల్లో గందరగోళం నెలకొంది. ఎలా ఇవ్వాలన్నది పక్కనబెడితే అసలు ఇన్ని వివరాలు రాష్ట్ర ప్రభుత్వం తమను ఎందుకు అడుగుతోందనే దానిపై జిల్లా ఉద్యోగ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోంది. అసలెందుకు.. ప్రతి ఏటా ప్రభుత్వ ఉద్యోగులు.. ప్రభుత్వానికి కచ్చితంగా కొన్ని వివరాలు సమర్పించాలి. వారి ఇన్‌కంటాక్స్ రిటర్నులు కూడా సమర్పించాల్సి ఉంటుంది. గత ఏడాది కూడా ఈ ఫార్మాట్ తరహాలోనే కొన్ని వివరాలు సేకరించారు. ఈసారి మాత్రం పూర్తిస్థాయి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వివరాలన్నింటినీ ఎందుకు తీసుకుంటున్నారన్న చర్చ ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో సాగుతోంది. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఉద్యోగులకు శాశ్వత కేటాయింపులు జరిపేందుకు గాను వారి స్థానికత తదితర వివరాలు తీసుకుంటున్నారని, దీని ఆధారంగానే జిల్లాలకు ఉద్యోగులను బదిలీ చేస్తారనే చర్చ జరుగుతోంది. సర్వీసు రికార్డులో స్థానికత ఉంటుంది కనుక మళ్లీ ఇప్పుడు ఎందుకనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. మరోవైపు శాఖల బదలాయింపు కోసమనే వాదన కూడా వినిపిస్తోంది. జిల్లాల విభజన తర్వాత అనేక శాఖల విలీనం జరిగింది. కొన్ని శాఖలో పనిభారం ఎక్కువ ఉంటే కొన్ని చోట్ల తగ్గిపోయింది. కొన్ని శాఖల్లో ఉద్యోగులు అధికంగా ఉంటే మరికొన్ని శాఖల్లో కొరత ఉంది. ముఖ్యంగా కలెక్టరేట్లు, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా కార్యాలయాల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఈ నేపథ్యంలో పలు శాఖల్లో ఉద్యోగుల బదలాయింపులుంటాయని కొందరు భావిస్తున్నారు. అలాంటప్పుడు బ్యాంకుల్లో రుణాలు, జీవిత భాగస్వామి ఆదాయ వివరాలు ఎందుకని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం దగ్గర ఒక ఉద్యోగి పూర్తి వివరాలుండాలనే కోణంలో వివరాలను సేకరిస్తున్నా.. ఇప్పటికే ఉన్న సమాచారాన్ని కూడా ఎందుకు అడుగుతున్నారనే చర్చ జరుగుతోంది. మరోవైపు అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకున్న ప్రభుత్వ సిబ్బంది నిర్వాకాన్ని గుర్తించేందుకేనా అనే అనుమానం ఉన్నా.. తాజా ఉత్తర్వుల్లో అసలు ఆస్తుల వివరాలే అడగలేదు. గతంలో టీచర్లకు ఇలాంటి ఫారాలు ఇచ్చారు. వారి నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కు తీసుకున్నారు. 15 లోపు ఇస్తేనే వేతనాలు.. ఈ వివరాలన్నింటినీ ఈనెల 15లోపు కచ్చితంగా సమర్పిస్తేనే మార్చి నెలలో జీతం వస్తుందని కూడా స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. అయితే..ఈ వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలా లేదా మాన్యువల్‌గా ఇస్తే సరిపోతుందా అనే దానిపై స్పష్టత లేదు. దీనిపై ఉన్నతాధికారులను అడిగితే రెండు విధాలుగా వివరాలు ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు మాత్రం ఈ సమాచారం వెళ్లలేదు. కొందరు ఆన్లైన్లో చేస్తుండగా, మరికొందరు మాన్యువల్‌గా చేస్తున్నారు. మరో విశేషమేమిటంటే... ఈ వివరాలతో పాటు కొన్ని ధ్రువపత్రాలను కూడా సమర్పించాల్సి ఉండడం, గడువు చాలా దగ్గర ఉండడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతానికి వివరాలు ఇస్తే సరిపోతుందని, తర్వాత మరో గడువు లోపు సర్టిఫికెట్లు కూడా ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఏదిఏమైనా ఈ వివరాల సేకరణ విషయంలో జిల్లా ఉన్నతాధికారుల నుంచి కచ్చితమైన సమాచారం వస్తే బాగుంటుందని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. -
బొగ్గు ఉత్పత్తికి బ్రేక్
శ్రీరాంపూర్ : సమగ్ర కుటుంబ సర్వేతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి బ్రేక్ పడింది. సర్వే సందర్భంగా కార్మికులు ఇంటి వద్దే ఉండాలని యాజమాన్యం మంగళవారం వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది. దీంతో కార్మికులు విధులకు హాజరుకాకపోవడంతో మైనింగ్ ఆపరేషన్స్ నిలిచాయి. భూగర్భ గనులు, ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా ఆగిపోయింది. జిల్లా పరిధిలో బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ డివిజన్లు ఉన్నాయి. ఈ మూడింటిని కలిపి బెల్లంపల్లి రీజియన్ అంటారు. ఈ రీజియన్ పరిధిలో మొత్తం 15 భూగర్భ గనులు, 4 ఓసీపీలు ఉన్నాయి. ఇందులో సుమారు 23 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. రీజియన్‌లోని గనుల్లో ఒక్క రోజు బొగ్గు ఉత్పత్తి సుమారు 30 వేల టన్నులు ఉంటుంది. సమగ్ర కుటుంబ సర్వేతో ఈ ఉత్పత్తిని సింగరేణి నష్టపోయింది. తద్వారా సుమారు రూ.4.5 కోట్ల నష్టం వాటిల్లింది. వేతనంతో కూడిన సెలవు ఇవ్వడంతో కంపెనీపై రూ.3 కోట్ల వేతన భారం పడింది. కాగా, రీజియన్ నుంచి సుమారు 1500 మంది ఉద్యోగులను కంపెనీ ఎన్యూమరేటర్లుగా పంపింది. మొదటిసారి.. సింగరేణిలో మొదటి సారిగా కార్మికులకు వేతనంతో కూడిన సెలవును యాజమాన్యం ప్రకటించింది. పండుగ సందర్భంగా ఇచ్చే సెలవును యాజమాన్యం ప్రభుత్వ కార్యక్రమాల కోసం ఇవ్వడం ఇదే ప్రథమం. సర్వే కోసం కార్మికులు చాలా మంది ఇంటి వద్దే ఉన్నారు. ఇతర ప్రాంతాల కార్మికులు, అధికారులు స్వస్థలాలకు తరలివెళ్లారు. సమ్మె వాతావరణం.. కార్మికులు రాక గనులపై సమ్మె వాతావరణం కనిపిం చింది. మ్యాన్‌రైడింగ్, టబ్బులు, తట్టాచెమ్మస్ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. బొగ్గుపెళ్ల కూడా బయటికి రా లేదు. గనుల ముందు ఉన్న హోటళ్లూ మూసి ఉన్నా యి. సెక్యూరిటీ సిబ్బంది, పంప్ ఆపరేటర్లు వంటి అత్యవసర సిబ్బంది కొందరే విధుల్లో ఉన్నారు. ఓసీపీల్లోనూ ఓవర్‌బర్డెన్ మట్టి పనులు నిలిచిపోయాయి. సీహెచ్‌పీలు, డిపార్ట్మెంట్లు, వర్క్‌షాపుల్లోనూ ఇదే పరిస్థితి. దూర ప్రాంతాలకు బొగ్గు రవాణా చేసే లారీలు ఉత్పత్తి లేక యార్డుకే పరిమితమయ్యాయి. ఇబ్బంది పడ్డ కార్మికులు..... సర్వే సందర్భంగా కార్మికుల్లో కొందరు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అక్కడక్కడ కొందరు బినామీ పేర్లతో కంపెనీలో పనిచేస్తున్నారు. చాలా ఏళ్ల నుంచి పనిచేస్తున్నప్పటికీ ప్రస్తుత సర్వేలో ఏ పేరు చెప్పాలో తెలియక ఇబ్బంది పడ్డారు. గతంలో డిపెండెంట్ ఉద్యోగాలు కొ నుక్కొని చేస్తున్నవారు, వేరే కులంతో పనిచేస్తున్నవారు ఇక్కట్లకు గురయ్యారు. అంతేకాకుండా కొత్తగా క్వార్టర్లు వచ్చినవారు, క్వార్టర్లు మారినవారు పాత అడ్రస్ వద్దకు వెళ్లి సర్వేలో వివరాలు నమోదు చేసుకోవడం ఇబ్బందిగా మారింది. ఇంటి నంబర్ కుదరకపోవడం, ఎన్యూమరేటర్ల వద్ద పాత పేర్లు ఉండడంతో కొంత గందరగోళ పరిస్థితి తలెత్తింది. క్వార్టర్‌కు ఒకే నంబర్ ఇవ్వడం, ఇంటి మొత్తాన్ని ఒకే యూనిట్‌గా రాసుకోవడంతో పలువురు కార్మికులు ఇబ్బందులు పడ్డారు. -
సమగ్ర సర్వేకు సిద్ధంగా ఉండండి
-
సమగ్ర సర్వేకు సిద్ధంగా ఉండండి
నేడే తెలంగాణవ్యాప్తంగా ‘సమగ్ర కుటుంబ సర్వే’ సాక్షి, హైదరాబాద్:‘మీరు, మీ కుటుంబ సభ్యుల వివరాలు సిద్ధంగా ఉంచుకోండి.. ఇవ్వాలనుకున్న సమాచారాన్ని ముందే దగ్గర పెట్టుకోండి.. ఇంట్లో లేనివారి, ఇతర ప్రాంతాల్లో ఉన్నవారి రుజువులు తీసి పెట్టుకోండి.. ఎన్యూమరేటర్లు అడిగే వివరాలను వెల్లడించండి.. ఏదైనా సమాచారాన్ని ఇవ్వలేమనుకుంటే.. ఆ విషయాన్ని ఎన్యూమరేటర్‌కు చెప్పండి.. ఎలాంటి తప్పులూ లేకుండా సరిచూసుకోండి.. ‘సర్వే’లో మీ వివరాలు నమోదు చేసుకోండి’ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘సమగ్ర కుటుంబ సర్వే’కు సర్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు ఈ సర్వే జరగనుంది. కొంత ఆలస్యమైనా నిర్ధారిత పని పూర్తయ్యే వరకు సర్వే కొనసాగుతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో ఉన్న మొత్తం కుటుంబాల సంఖ్య 86,85,000 కాగా.. ప్రస్తుతం ఆ కుటుంబాల సంఖ్య 99,41,000గా ఉన్నట్లు అధికార గణం గుర్తించింది. ఈ కుటుంబాలు లక్ష్యంగా నిర్వహిస్తున్న సర్వేలో 3,69,729 ఎన్యూమరేటర్లు (సర్వే వివరాలు సేకరించేవారు) పాల్గొంటున్నారు. వివరాల సేకరణకుగాను 3,69,000 బుక్లెట్లను పంపిణీ చేశారు. ఎన్నికల సమయంలో మొత్తం ప్రభుత్వ యంత్రాంగం, టీచర్లు, ఇతర సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొనే తరహాలో... ప్రస్తుత సర్వేలో వారితో పాటు అదనంగా సింగరేణి ఉద్యోగులు, ప్రైవేట్ కాలేజీలు, స్కూళ్లలో పనిచేసే టీచర్లు, కాలేజీ విద్యార్థుల సేవలను కూడా వినియోగించుకుంటున్నారు. సొంత ఊళ్లకు జనం.. సర్వే నేపథ్యంలో రెండురోజులుగా ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు తమ గ్రామాలకు చేరుకుంటుండగా.. సోమవారం ఆ సంఖ్య మరింత పెరిగింది. తెలంగాణలోని పది జిల్లాలకు చెం దిన ప్రజలు విద్య, ఉద్యోగ, ఉపాధి, వ్యాపార ఇతర వ్యాపకాల కోసం గణనీయ సంఖ్యలోనే హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. వారంతా సర్వే నేపథ్యంలో జిల్లాలకు ప్రయాణమయ్యారు. రైళ్లు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు, సొంత వాహనాలు ఇలా అందుబాటులో ఉన్న అన్ని రవాణా సౌకర్యాలను వినియోగించుకుని ప్రజలు సొంత ఊళ్లకు పయనమయ్యారు. తమ కు తగినన్ని బస్సులు అందుబాటులో లేవనే ఫిర్యాదులు కూడా ప్రజల నుంచి వచ్చాయి. రాజధానిలో సవాలే! లక్షల సంఖ్యలో జనాభాతో కిక్కిరిసి ఉన్న హైదరాబాద్ మహానగరంలో సర్వేను నిర్వహించడం ఓ సవాలు కానుంది. ఆది, సోమవారాల్లో ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికి వచ్చి స్టిక్కర్లు అతికిస్తారని, చెక్‌లిస్ట్‌లను, నమూనాపత్రాలను అందిస్తారని అధికారులు ముందుగానే ప్రకటించారు. కానీ సోమవారం సాయంత్రానికి కూడా ఎన్యూమరేటర్లు తమ ఇళ్లకు రాలేదని చెబుతున్న వారు పెద్దసంఖ్యలోనే ఉన్నారు. సర్వే సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సెలవు ప్రకటించడం, ఆర్టీసీ బస్సులు నడపకపోవడం, పెట్రోల్‌బంక్‌లను మూసి ఉంచడం వంటి చర్యలు, విస్తృతంగా ప్రచారం కల్పించడం ద్వారా సర్వేలో ప్రజలంతా పాల్గొని తమ వివరాల నమోదుకు సహకరిస్తారని ప్రభుత్వం అభిప్రాయ పడుతోంది. అర్హుల గుర్తింపు కోసమే గత ప్రభుత్వాల్లోని వివిధ శాఖలు పథకాలు/ కార్యక్రమాలకు సంబంధించి ఇంతకుముందు ఇంటింటి సర్వేలు చేసినా.. అవి అసమగ్రంగా, తప్పుల తడకగా ఉన్నందున ‘సమగ్ర కుటుంబ సర్వే’ను చేపడుతున్నట్లు సర్కారు ప్రకటించింది. నూతన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మలుచుకునేందుకు తోడ్పడేలా మొత్తం కుటుంబాల సమగ్ర సామాజిక, ఆర్థిక వివరాలను సేకరించడానికే సర్వే చేపడుతున్నట్లు తెలిపింది. వివిధ సంక్షేమ పథకాలను సక్రమంగా అమలుచేసేందుకు అర్హులైన పేదలను ఏ ఒక్కరినీ విడిచిపెట్టకుండా సమాచారాన్ని సేకరించడమే లక్ష్యమని పేర్కొంది. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి సర్వేను చేపట్టలేదని ప్రభుత్వం చెబుతోంది. ప్రతి ఇంటికి సంబంధించిన నమ్మకమైన డాటాబేస్‌ను తయారుచేసుకోవడం, సులువుగా ధ్రువీకరణ పత్రాల మంజూరుకు వివరాలన్నింటినీ ఎమ్మార్వో కార్యాలయాల్లో అందుబాటులో ఉంచేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. -
లెక్కలోకి వద్దాం..
- 19న ఇంటింటి సర్వే - ఇవీ సర్వే అంశాలు.. కరీంనగర్: ‘‘ఈ నెల 19న ఇంటింటి సర్వేలో అందరూ అందుబాటులో ఉండాలె. ఆ రోజు లేనోడు లెక్కకు రాడు.. ఆ రోజు నేను కూడా ఇంట్లోనే ఉంటా..’’ ఇవీ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యలు. దీన్నిబట్టే తెలుస్తోంది ప్రభుత్వం ఇంటింటి సర్వేను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందనేది. అధికారులు ఇంటికి వచ్చి కుటుంబ వివరాలు సేకరిస్తారు. ఓపిగ్గా వారు అడిగిన వాటికి సమాధానం చెప్పాలి. చెప్పే అంశాలపై వారికి ఏవైనా అనుమానాలుంటే నివృత్తి చేయాలి. సంబంధిత వివరాలతో ఉన్నటువంటి ధ్రువపత్రాలు చూపించాలి. ఒక్కసారి కుటుంబ వివరాలు ప్రభుత్వ రికార్డుల్లో నమోదైతే జీవితాంతం ఉంటాయి. పెద్దలు, పిల్లల భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడేలా ఈ నెల 19న ప్రభుత్వం చేపట్టిన సర్వేను సద్వినియోగం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో సర్వే అంశాలు ఏమిటి, ఏమేం అడుగుతారు, ఏ వివరాలు సేకరిస్తారనే దానిపై చాలామంది ప్రజల్లో సందేహాలున్నాయి. సమగ్ర కుటుంబ సర్వే వివరాలపై కథనం.. గుర్తింపు వివరాలు : విభాగం-ఏ 1. జిల్లా : 2. మండలం : 3. గ్రామపంచాయతీ/మున్సిపాలిటీ : 4. రెవెన్యూ డివిజన్ : 5. నివాసం డివిజన్/వార్డు నెంబరు : 6. నివసిస్తున్న కాలనీ పేరు : 7. ఇంటి నంబరు : 8. ఇంటిలోని కుటుంబ సభ్యుల సంఖ్య : కుటుంబ వివరాలు : విభాగం-బీ 1. ఇంటిపేరు : 2. కుటుంబ యజమాని పూర్తి పేరు : 3. తండ్రి/భర్త పేరు : 4. మతం : 5. కుటుంబ సభ్యుల సంఖ్య : 6. కులం : 7. గ్యాస్ కనెక్షన్ వివరాలు : 8. మొబైల్ ఫోన్ నెంబరు : 9. ఆదాయపు పన్ను వివరాలు : అనాథల వివరాలు.. 1. అనాథలు ఎక్కడ నివసిస్తున్నారు : 2. అనాథ ఆశ్రమం పేరు : 3. ఆశ్రమం ఉన్న గ్రామం పేరు : 4. ఆశ్రమం ఉన్న మండలం పేరు : 5. అనాథ పిల్లల స్థితి(తల్లిదండ్రులు, తోబుట్టువులు, కొడుకులు, కూతుళ్లు ఉన్నరా? లేదా? ఉంటే ఎక్కడ, వారి వివరాలు) విభాగం-సీ 1. క్ర మసంఖ్య : 2. వ్యక్తి పేరు : కుటుంబ యజమానితో కలుపుకుని 3. కుటుంబ యజమానితో గల సంబంధం 4. ఆడ/ మగ : 5. పుట్టినతేదీ/వయస్సు : 6. వైవాహిక స్థితి : 7. విద్యార్హత : 8. బ్యాంకు/పోస్టాఫీసు వివరాలు : 9. ఉద్యోగం ఉన్నదా? లేదా? : 10. ఉద్యోగం పేరు.వివరాలు : 11. పింఛన్‌దారులైతే వివరాలు : 12. ప్రధానమైన వృత్తి : 13. ఆధార్ కార్డు నెంబరు : విభాగం-డీ 1. క్రమ సంఖ్య : 2. వికలాంగుని పేరు : 3. ఎలాంటి వైకల్యం : 4. సర్టిఫికె ట్ వివరాలు : 5. వైకల్యం శాతం సర్టిఫికెట్ : 6. వైకల్యం సర్టిఫికెట్ ఉంటే ఐడీ నెంబర్ : దీర్ఘకాలిక వ్యాధులు : విభాగం-ఈ 1. క్రమసంఖ్య : 2. వ్యాధికిగురైన వ్యక్తి పేరు : 3. వ్యాధి రకం : ఇంటి వివరములు : విభాగం-ఎఫ్ 1. నివాసం- సొంతం/అద్దె : 2. ఇంటి రకం : 3. గదుల సంఖ్య (వంట గది కాకుండా) : 4. కిరాయి, తాత్కాలిక ఇంట్లో ఉంటున్న వారికి ఇంకా ఎక్కడైనా సొంత ఇల్లు ఉందా ? : 5. కిరాయి, అద్దె ఇంట్లో ఉంటున్న వారికి సంబంధించి ఇంటి స్థలం ఉందా? లేదా : 6. మీరు ఎప్పుడైనా ప్రభుత్వ ఇంటిని లబ్ధి పొందారా? అవును/కాదు : 7. మరుగుదొడ్డి, విద్యుత్ మీటరు ఉందా? లేదా? విభాగం-జీ, హెచ్ వ్యవసాయం, పశు సంపదకు సంబంధించిన వివరాలు కుటుంబ సొంత చరాస్తుల వివరాలు : విభాగం-ఐ 1. ద్విచక్ర వాహనం : 2. ఆటో : 3. కారు/జీపు/ఇతర భారీ వాహనాల వివరాలు : 4. ట్రాక్టర్/ వ్యవసాయ యంత్రాలు : 5. ఎయిర్ కండిషన్ వివరాలు : (పైవాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ వివరాలు తెలియజేయాలి) 6. తాత్కాలిక సంచార కుటుంబాలు/ శాశ్వత నివాసం/ఎంతకాలం నుంచి ఉంటున్నారో వారి వివరాలు : 7. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి వివరాలు/ ఎంత కాలం నుంచి నివసిస్తున్నారు/ ఏ రాష్ట్రం నుంచి వచ్చారు/ మాట్లాడే భాష/వచ్చిన సంవత్సరం ధ్రువీకరణ పైన తెలిపిన సమాచారం వాస్తవమని, యధార్థమని నేను ధ్రువీకరించుచున్నాను. పై సమాచారం అవాస్తవమని తేలినచో ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలకు అనర్హుడుగా ప్రకటించగలరు. ఈ విషయాలను దైవసాక్షిగా ధ్రువీకరిస్తున్నాను. 1. కుటుంబ యజమాని/సభ్యుల సంతకం లేదా వేలి ముద్ర 2. ఎన్యుమరేటర్ సంతకం... వివరాలు 3. పర్యవేక్ష క అధికారి సంతకం... వివరాలు