Mother's Day: AI Company Launches Programme to Support New Moms - Sakshi
Sakshi News home page

Mothersday 2023: మాతృమూర్తుల కోసం 24/7 బడ్డీ ప్రోగ్రాం 

Published Sat, May 13 2023 3:20 PM | Last Updated on Sat, May 13 2023 3:30 PM

Mothersday AI company launches programme to support new moms - Sakshi

హైదరాబాద్‌: మెటర్నిటీ లీవులో ఉన్న ఉద్యోగినుల కోసం మదర్స్‌ డే సందర్భంగా ప్రత్యేక బడ్డీ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించినట్లు 24/7 డాట్‌ఏఐ వెల్లడించింది. ఉద్యోగ విధులకు దూరంగా ఉన్నప్పటికీ సంస్థలో చోటుచేసుకునే పరిణామాల గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపింది.

ఇలా అప్‌డేట్‌గా ఉంచేందుకు సూపర్‌వైజర్‌ సూచించిన వారిని లేదా తమకు నచ్చిన వ్యక్తిని సదరు ఉద్యోగిని తమ బడ్డీగా (స్నేహితులు) ఎంచుకోవచ్చని పేర్కొంది. ఇప్పటికే బేబీ అలవెన్సులు, గిఫ్ట్‌ ఆఫ్‌ టైమ్, ప్రెగ్నెన్సీ సమయంలో ప్రత్యేక క్యాబ్‌లు తదితర సదుపాయాలను కల్పిస్తున్నట్లు సంస్థ తెలిపింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement