మిస్‌ యూఎస్‌ఏ విజేతల వరుస రాజీనామాలు! రీజన్‌ ఏంటో చెప్పిన తల్లులు | Mom Of Former Miss USA Winner Breaks Silence On Sudden Resignation, Says She Was Abused | Sakshi
Sakshi News home page

మిస్‌ యూఎస్‌ఏ విజేతల వరుస రాజీనామాలు! రీజన్‌ ఏంటో చెప్పిన తల్లులు

Published Wed, May 15 2024 4:50 PM | Last Updated on Wed, May 15 2024 6:17 PM

Mom Of Former Miss USA Breaks Silence On Sudden

మిస్‌ యూఎస్‌ విజేతల వరుస రాజీనామాలు అమెరికాను షాక్‌ గురి చేసింది. అదీకూడా రెండు మూడు రోజుల వ్యవధిలోనే జరగడం పలు రకాల అనుమానాలకు లెవనెత్తింది. అయితే ఆ మోడల్స్‌ ఇద్దరిలో ముందుగా తన స్థానం నుంచి తప్పకుంటున్నట్లు ప్రకటించిన మిస్‌ యూఎస్‌ఏ 2023 నోలియా వోగ్ట్‌ తన మానసిక ఆరోగ్య నిమిత్త రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగా, మరో మోడల్‌ మిస్‌ టీన్‌ యూఎస్‌ఏ 2023 తన వ్యక్తిగత విలువలు సంస్థతో సరిపోవడం లేదని చెబుతూ తప్పుకుంటున్నట్ల ‍ప్రకటించింది. 

అయితే అసలు ఎందుకు ఆ ఇరువురు అందాల భామలు సడెన్‌గా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటూ రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఎట్టకేలకు వాటికి ఆ విజేతల తల్లులు వివరణతో తెరపడింది. ఆ బ్యూటీ క్వీన్స్‌ తల్లులైన బార్బరా, జాక్‌లైన్‌ వోగ్ట్‌, తమ కుమార్తెలు మిస్‌ యూఎస్‌ఏ ఆర్గనైజేషన్‌లో చాలా చేదు అనుభవాలను ఎదుర్కొన్నారని చెప్పారు. వారు సంస్థకు సంబంధించిన నాన్‌ డిస్‌క్లోజర్‌ ఒప్పందాల(ఎన్‌డీఏ) కారణంగా వారు ఎదుర్కొన్న భయానక అనుభవాల గురించి పెదవి విప్పడం లేదని చెప్పారు. 

తమ కుమార్తెలు సంస్థకు సంబంధించిన కొందరి వ్యక్తుల నుంచి లైంగిక వేధింపులను కూడా ఎదుర్కొన్నారని తెలిపారు. విజేతలుగా కిరీటాన్ని గెలుచుకున్నప్పటికీ వాళ్లు ఏం పొందలేదన్నది చెప్పాలనుకోవడం లేదని అన్నారు. వాళ్లు అక్కడ పలు దుర్భాషలకు, బెదిరింపులకు గురయ్యారు. తాము ఇలా బయటకొచ్చి చెప్పడానికి ‍ప్రధాన కారణం ప్రధాన పోటీల్లో ఉండే వాస్తవాల గురించి మిగతా తల్లిదండ్రులు కూడా తెలసుకోవాలనే ఉద్దేశ్యంతోనేననిన్నారు. కాగా, మిస్‌ యూఎస్‌ఏ పోటీలు ఇటీవలి సంవత్సరాలలో అనేక వివాదాలు, కుంభ కోణాల్లో చిక్కుకుంది. అలాగే కొంతమంది పోటీదారులకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు  పలు ఆరోపణలు కూడా వచ్చాయి.

(చదవండి: డీజిల్‌తో పరాటా చేయడమా? చివరికి యజమాని..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement