sudden
-
మిస్ యూఎస్ఏ విజేతల వరుస రాజీనామాలు! రీజన్ ఏంటో చెప్పిన తల్లులు
మిస్ యూఎస్ విజేతల వరుస రాజీనామాలు అమెరికాను షాక్ గురి చేసింది. అదీకూడా రెండు మూడు రోజుల వ్యవధిలోనే జరగడం పలు రకాల అనుమానాలకు లెవనెత్తింది. అయితే ఆ మోడల్స్ ఇద్దరిలో ముందుగా తన స్థానం నుంచి తప్పకుంటున్నట్లు ప్రకటించిన మిస్ యూఎస్ఏ 2023 నోలియా వోగ్ట్ తన మానసిక ఆరోగ్య నిమిత్త రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగా, మరో మోడల్ మిస్ టీన్ యూఎస్ఏ 2023 తన వ్యక్తిగత విలువలు సంస్థతో సరిపోవడం లేదని చెబుతూ తప్పుకుంటున్నట్ల ప్రకటించింది. అయితే అసలు ఎందుకు ఆ ఇరువురు అందాల భామలు సడెన్‌గా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటూ రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఎట్టకేలకు వాటికి ఆ విజేతల తల్లులు వివరణతో తెరపడింది. ఆ బ్యూటీ క్వీన్స్ తల్లులైన బార్బరా, జాక్లైన్ వోగ్ట్, తమ కుమార్తెలు మిస్ యూఎస్ఏ ఆర్గనైజేషన్‌లో చాలా చేదు అనుభవాలను ఎదుర్కొన్నారని చెప్పారు. వారు సంస్థకు సంబంధించిన నాన్ డిస్క్లోజర్ ఒప్పందాల(ఎన్డీఏ) కారణంగా వారు ఎదుర్కొన్న భయానక అనుభవాల గురించి పెదవి విప్పడం లేదని చెప్పారు. తమ కుమార్తెలు సంస్థకు సంబంధించిన కొందరి వ్యక్తుల నుంచి లైంగిక వేధింపులను కూడా ఎదుర్కొన్నారని తెలిపారు. విజేతలుగా కిరీటాన్ని గెలుచుకున్నప్పటికీ వాళ్లు ఏం పొందలేదన్నది చెప్పాలనుకోవడం లేదని అన్నారు. వాళ్లు అక్కడ పలు దుర్భాషలకు, బెదిరింపులకు గురయ్యారు. తాము ఇలా బయటకొచ్చి చెప్పడానికి ప్రధాన కారణం ప్రధాన పోటీల్లో ఉండే వాస్తవాల గురించి మిగతా తల్లిదండ్రులు కూడా తెలసుకోవాలనే ఉద్దేశ్యంతోనేననిన్నారు. కాగా, మిస్ యూఎస్ఏ పోటీలు ఇటీవలి సంవత్సరాలలో అనేక వివాదాలు, కుంభ కోణాల్లో చిక్కుకుంది. అలాగే కొంతమంది పోటీదారులకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు పలు ఆరోపణలు కూడా వచ్చాయి.(చదవండి: డీజిల్‌తో పరాటా చేయడమా? చివరికి యజమాని..) -
ఇండోనేసియాలో వరదలు.. 37 మంది మృతి
జకార్తా: ఇండోనేసియాలోని సుమత్రా దీవిలో ఆకస్మికంగా కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా 37 మంది మృతి చెందగా మరో 18 మంది వరకు కనిపించకుండా పోయారు. మరాపి అగ్నిపర్వతం నుంచి రాళ్లు, లావా కలిసి కొండచరియలు విరిగిపడ్డాయి. దీనికి తోడు, శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలతో ఎగువ నుంచి వచ్చిన బురద ప్రవాహం నాలుగు జిల్లాల పరిధిలోని నివాసప్రాంతాలను తుడిచిపెట్టింది. వందకు పైగా నివాసాలు, భవనాలు వరదలో మునిగిపోయాయి. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను చేపట్టినట్లు అధికార యంత్రాంగం తెలిపింది. -
అఫ్గాన్‌లో ఆకస్మిక వరదలు.. 300 మందికి పైగా మృతి
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్ ఉత్తరప్రాంతంలో శుక్రవారం రాత్రి ఆకస్మికంగా కురిసిన భారీ వర్షాలు, వరదలతో 300 మందికి పైగా ప్రజలు మృతి చెందినట్లు ఐరాస ఆహారం విభాగం తెలిపింది. వెయ్యి వరకు నివాసాలు ధ్వంసం కాగా వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారని పేర్కొంది. బాధితులకు ఆహారం అందజేస్తున్నట్లు శనివారం తెలిపింది. బఘ్లాన్, బాదాక్షాన్, ఘోర్, హెరాట్, టఖార్ ప్రావిన్స్‌ల్లో ఎక్కువ నష్టం సంభవించినట్లు తాలిబన్ ప్రభుత్వం తెలిపింది. బఘ్లాన్‌లో 131 మంది, టఖార్లో 20 మంది మరణించారని వెల్లడించింది. డజన్ల కొద్దీ గల్లంతయ్యారని కూడా తెలిపింది. బఘ్లాన్‌లో వరదల్లో చిక్కుకుపోయిన వారిని వైమానిక దళం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోందని తెలిపింది. 100 మందికి పైగా క్షతగాత్రులను సైనిక ఆస్పత్రులకు తరలించినట్లు రక్షణ శాఖ వివరించింది. -
చిరు జల్లులు.. చినుకుల్లో తడిచిన జనం (ఫోటోలు)
-
ఆకస్మిక మరణాలకు.. టీకాకు సంబంధం లేదు!
అకస్మాత్తుగా తీవ్రస్థాయి వ్యాయామంతో ముప్పు.. పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ.. కుప్పకూలిన 22 ఏళ్ల యువకుడు!.. వ్యాయామం చేస్తూండగా గుండెపోటు.. 42 ఏళ్ల యాక్టర్ మృతి.. పాతికేళ్లకే గుండెపోటు.. ఆకస్మిక మరణం!.. ఇలాంటి శీర్షికలు వార్తాపత్రికల్లో మీరూ చూసే ఉంటారు. కోవిడ్ తరువాత ఇలాంటి ఆకస్మిక మరణాలు మరీ ముఖ్యంగా తక్కువ వయసు వారిలో ఎక్కువయ్యాయి అన్న చర్చ కూడా జరిగే ఉంటుంది. అయితే ఇందులో వాస్తవం లేదంటోంది భారత వైద్య పరిశోధన సమాఖ్య (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, క్లుప్తంగా ఐసీఎంఆర్). కోవిడ్ టీకాలతోనే గుండె జబ్బుల ముప్పు పెరిగిందన్నది ప్రజల్లో ఉన్న అపోహ మాత్రమేనని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు అధ్యయన పూర్వకంగా స్పష్టం చేస్తున్నారు. కోవిడ్ కంటే ముందు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకోవడం మొదలుకొని కుటుంబ ఆరోగ్య చరిత్ర, మితిమీరిన మద్యపానం, అలవాటు లేని తీవ్రమైన పనులు కొనసాగించడం వంటివి యువత ఆకస్మిక మరణాలకు కారణాలు కావచ్చునని వీరు అంటున్నారు. కోవిడ్ తరువాత యువకులు ఆకస్మికంగా గుండెజబ్బుల కారణంగా మరణిస్తున్నారన్న వదంతులు ప్రబలుతున్న సమయంలో ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు దేశవ్యాప్తంగా ఒక అధ్యయనం చేపట్టారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 47 టెరిటరీ ఆసుపత్రుల్లో నిర్వహించిన ఈ అధ్యయనం ద్వారా అసలు సమస్య ఏమిటన్నది తెలుసుకునే ప్రయత్నం జరిగింది. ఈ అధ్యయనంలో 18 - 45 మధ్య వయస్కుల ఆకస్మిక మరణాల కారణాలను విశ్లేషించారు. ఈ మరణాల్లో కొంతమంది సెలబ్రిటీలూ ఉండటం గమనార్హం. ‘‘కోవిడ్ వ్యాధి, టీకాలకు ఈ మరణాలకు సంబంధం ఉందన్న ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో అసలు కారణాలేమిటో తెలుసుకునేందుకు ఈ అధ్యయనం చేపట్టాం’’ అని ఐసీఎంఆర్ ఒక ప్రకటనలో తెలిపింది. 3645 మంది వివరాలతో... ఐసీఎంఆర్ అధ్యయనంలో భాగంగా మొత్తం 3645 మంది వివరాలను విశ్లేషించారు. ఇందులో కోవిడ్ కారణంగా ఆసుపత్రుల్లో చేరి ఆ తరువాత 24 గంటల్లోనే మరణించిన వారు కూడా ఉన్నారు. వీరందరూ 18 - 45 మధ్య వయస్కులే. ఆకస్మిక మరణానికి కారణం కాగల వ్యాధులు, సమస్యలు ఏవీ లేనివారే. అక్టోబరు 2021 - మార్చి 2023 మధ్యకాలంలో వీరు ఆకస్మికంగా మరణించారు. ఆకస్మిక మరణాలకు గుండె సంబంధిత సమస్యలే కారణమైనప్పటికీ అన్నీ కార్డియాక్ అరెస్ట్ (అకస్మాత్తుగా గుండె పనిచేయకుండా పోవడం) ఫలితంగానూ జరగలేదని ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడియమాలజీ డైరెక్టర్ శాస్త్రవేత్త మనోజ్ ముర్హేకర్ తెలిపారు. మరణించిన వారి సమచారాన్ని, కోవిడ్ బాధితులను పోల్చి చూసినప్పుడు టీకాలే మరణానికి కారణమని సూచించే ఏ అంశమూ బయటపడలేదని ఆయన స్పష్టం చేశారు. ‘‘వాస్తవానికి టీకాలు మరణాలను అడ్డుకుంది. ఆకస్మిక మరణాలకు ఇతర కారణాలు ఉండి ఉండవచ్చు’’ అని ఆయన వివరించారు. కోవిడ్ -19 టీకాలు, వ్యాధి, చికిత్స తరువాత ఆరోగ్యం వంటి విషయాలపై తాము కొంతమందిని ఇంటర్వ్యూ చేశామని, కుటుంబంలో ఆకస్మిక మరణాల చరిత్ర ఏమైనా ఉందా? అన్నదీ పరిశీలించామని, ధూమపానం, మత్తుముందుల వాడకం, మద్యపానం ఎంత తరచుగా చేస్తారు? మరణానికి రెండు రోజుల ముందు అతిగా శ్రమించారా? వంటి వివరాలు అడిగి తెలుసుకున్నామని... ఇలాంటి కారణాల వల్లనే చాలామంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసిందని మనోజ్ ముర్హేకర్ తెలిపారు. ‘‘మద్యపానం ఎంత తరచుగా తీసుకుంటూంటే ఆకస్మిక మరణానికి అవకాశాలు అంత ఎక్కువగా పెరిగాయి’’ అని వివరించారు. రెండు డోసుల టీకాతో రక్షణ... కోవిడ్ వ్యాధి నివారణకు రెండు డోసుల టీకాలు వేసుకున్న వారు ఆకస్మిక మరణానికి గురయ్యే అవకాశాలు తక్కువైనట్లు తమ అధ్యయనంలో తేలిందని ఐసీఎంఆర్ చెబుతోంది. అయితే కోవిడ్-19 కారణంగా మరణాలు ఎలా సంభవిస్తాయన్న అంశం ప్రస్తుతానికి పూర్తిగా అర్థం కావడం లేదని తెలిపింది. అయితే సార్స్ కోవ్-2 వ్యాధి వల్ల గుండెజబ్బు, గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువవుతుందని మాత్రం ఈ అధ్యయనం అంగీకరించడం గమనార్హం. ఆకస్మిక మరణాలకూ కారణమవుతుందా? అన్న విషయంపై మాత్రం తగినంత సమాచారం లేదని ఐసీఎంఆర్ చెబుతోంది. కోవిడ్ టీకాల కారణంగా ఆకస్మిక మరణాలు పెరిగాయని కొంతమంది తగిన సాక్ష్యాధారాల్లేకుండా మాట్లాడుతున్రాను. వ్యాక్సీన్లతో మరణాలు తగ్గాయని చెప్పేందుకు రుజువులు ఉన్నాయి. ముప్ఫై ఏళ్ల పైబడ్డ వారు.. అప్పటివరకూ తరచూ వ్యాయామం చేయకుండా.. అకస్మాత్తుగా తీవ్రస్థాయిలో శ్రమించడం మొదలుపెడితే వారిలో ఆకస్మిక మరణాలు సంభవించే అవకాశాలు ఎక్కువ అవుతాయి. ఆకస్మాత్తుగా తీవ్రస్థాయిలో శ్రమించడం వల్ల గుండె రక్తనాళాల్లో అప్పటివరకూ పేరుకుపోయిన గార లాంటి పదార్థం ముక్కలై గుండెపోటుకు దారితీయవచ్చు’’ అని వైద్య నిపుణులు కొందరు చెబుతున్నారు. చదవండి: డయాబెటిస్ పేషెంట్స్.. ఇకపై ఆ బాధ తీరినట్లే -
కేటీఆర్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం
ఆర్మూర్/సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్రమంత్రి కె.తారకరామారావుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ప్రచారరథం రెయిలింగ్ విరిగిపోవడంతో వాహనంపైనున్న ఆయన కిందికి జారారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో గురువారం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో కేటీఆర్ పాల్గొన్నారు. పట్టణశివారులోని ధోబీఘాట్ నుంచి కిందిబజార్, గోల్‌బంగ్లా మీదుగా తహసీల్దార్ కార్యాలయానికి ర్యాలీ బయలుదేరింది. ప్రచారరథంపై కేటీఆర్, జీవన్‌రెడ్డి, ఎంపీ కేఆర్ సురేశ్‌రెడ్డి, ఇతర నేతలు నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. మార్గమధ్యంలో ఓ చోట విద్యుత్ వైర్లు కొద్దిగా కిందికి వేలాడుతుండటంతో అప్రమత్తమైన ప్రచారరథం డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయగా వాహనం రెయిలింగ్ విరిగిపోయింది. దీంతో రెయిలింగ్ పట్టుకొని నిలబడి ఉన్న కేటీఆర్, జీవన్‌రెడ్డి కిందికి జారారు. రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్‌రెడ్డి మాత్రం అదుపు తప్పి వాహనం పైనుంచి కింద పడిపోయారు. ఆయనకు స్వల్పగాయాలు కావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత నామినేషన్ కేంద్రానికి వెళ్లకుండానే కేటీఆర్ కొడంగల్ రోడ్ షోలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లిపోయారు. నాకేమీ కాలేదు: కేటీఆర్ ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి తరఫున ప్రచారానికి వెళ్లినప్పుడు చిన్న ప్రమాదం జరిగిందని, తనకేమీ కాలేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి కేటీఆర్ ‘ఎక్స్’(ట్విట్టర్)లో స్పష్టం చేశారు. ప్రమాదంపై ఆందోళన చెందిన, తన గురించి వాకబు చేసిన వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. -
Mahabubabad: రేఖా నాయక్ అల్డుడి ఆకస్మిక బదిలీ
సాక్షి, హైదరాబాద్/సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ బదిలీ అయ్యారు. ఆయనను తెలంగాణ పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎస్పీగా పనిచేస్తున్న చంద్రమోహన్ గుండేటిని నియమిస్తూ సీఎస్ శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆకస్మికంగా జరిగిన ఎస్పీ బదిలీపై సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నాయకులు ఏరికోరి తెచ్చుకున్న ఎస్పీ ఎన్నికల వరకు ఉంటారని అందరూ భావించగా.. ఊహించని విధంగా బదిలీ కావడానికి ‘రేఖా నాయక్ ఎఫెక్ట్’ఉందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ Ajmeera Rekha Nayak ఎస్పీకి స్వయాన బిడ్డను ఇచ్చిన అత్తగారు. ఈసారి ఆమెకు టికెట్ రాకపోగా, ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. రేఖా నాయక్‌పై కోపంతో ఆమె అల్లుడిని ప్రాధాన్యత లేని పోస్టుకు బదిలీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ మారతానని ప్రకటించిన గంటల్లోనే ఈ ఆదేశాలు వెలువడడం గమనార్హం. -
అత్తమీద కోపం.. అల్లుడిపై ప్రతాపం
సాక్షి, మహబూబాబాద్: జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్‌ను రాష్ట్ర పోలీస్ అకాడమికి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో డీజీపీ కార్యాలయంలోని మల్టీ ఏజెన్సీ ఆపరేషన్ సెంటర్లో ఎస్పీగా పనిచేస్తున్న చంద్రమోహన్‌ను బదిలీపై జిల్లాకు పంపారు. ఈ మేరకు మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆకస్మిక బదిలీపై సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం జరుగుతోంది. 2021 డిసెంబర్ 26న జిల్లా ఎస్పీగా ఆయన బాధ్యతలు చేపట్టారు. బీఆర్ఎస్ నాయకులు ఏరికోరి తెచ్చుకున్న ఎస్పీ.. ఎన్నికల వరకు ఉంటారని అందరూ భావించారు. అయితే ఎవరు ఊహించని విధంగా 20 నెలల్లో బదిలీ కావడం.. దీని వెనుక ఏం జరిగింది అనేది అటు అధికారులు.. ఇటు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఆకస్మిక బదిలీతో షాక్.. జిల్లా పోలీస్‌బాస్ ఆకస్మిక బదిలీతో ఆశాఖ అధికారులు విస్మయానికి గురయ్యారు. ఎన్నికల బదిలీల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఐపీఎస్ అధికారులను ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడు జిల్లా ఎస్పీని బదిలీ చేయలేదు. దీంతో ఆయన ఎన్నికల వరకు ఉంటారని అందరు భావించారు. అయితే కుటుంబ సభ్యుల్లో జరిగిన రాజకీయ పరిణామాలే ఆయన బదిలీకి కారణం అని కొందరు చెబుతుండగా.. ఎస్పీపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో శాఖ తీసుకున్న నిర్ణయం అని మరికొందరు చెబుతున్నారు. కుటుంబ రాజకీయ పరిణామాలే కారణమైతే ఎస్పీ బదిలీతోనే ఆగిపోతుంది. అలా కాకుంటే ఎస్పీతో పాటు మరికొందరిపై బదిలీ వేటు పడే అవకాశం ఉందని పలువురు సీనియర్ పోలీస్ అధికారులు చెబుతున్నారు. దీంతో ఎస్పీ బదిలీ వార్తతో ఆయనకు అనుకూలంగా ఉండే అధికారులు మాత్రం ఆందోళనగానే ఉన్నట్లు సమాచారం. ఆ కోపమేనా..? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ తన బిడ్డను ఎస్పీ శరత్చంద్ర పవార్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. కాగా అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న ఆమెకు ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వడం లేదు. ఇటీవల విడుదల చేసిన జాబితాలో కూడా ఆమె పేరు లేదు. దీంతో ఆమె మనస్తాపం చెందిగా.. భర్త శ్యాం నాయక్ ఉద్యోగం వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈమేరకు నేడో రేపో రేఖానాయక్ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆమె పార్టీ మారకుండా ఉండేందుకు పలువురు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించారు. అయినా చర్చలు ఫలించలేదు. దీంతో రేఖానాయక్‌పై కోపంతో ఆమె అల్లుడు ఎస్పీ శరత్ చంద్రపవార్‌ను ప్రాధాన్యత లేని పోస్టుకు బదిలీ చేసినట్లు మానుకోటలో ప్రచారం జరుగుతోంది. -
రాహుల్‌కి ఢిల్లీ యూనివర్సిటీ నోటీసులు: ఇది మీ హోదాకి తగ్గ పని కాదు!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఢిల్లీ యూనివర్సిటీలో ఆకస్మికంగా పర్యటించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఢిల్లీ యూనివర్సిటీ కూడా ప్రోటోకాల్ పాటించకుండా ఇలా సడెన్‌గా యూనివర్సిటీలో పర్యటించడం కరెక్ట్ కాదని నోటీసులు పంపుతామని హెచ్చరింది. అన్నట్లుగానే ఢిల్లీ యూనివర్సిటీ రాహుల్ గాంధీకి బుధవారం నోటీసులు పంపించింది. జెడ్‌ప్లస్ భద్రతతో ఓ జాతీయ పార్టీ నాయకుడి హోదాలో ఉన్న రాహుల్‌కి ఇది తన స్థాయికి తగ్గ పని కాదని చురకలంటిస్తూ..రెండు పేజీల నోటీసులు జారీ చేసింది. ఈ సంఘటనను అతిక్రమణ, బాధ్యతరాహిత్యమైన ప్రవర్తనగా పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించింది. ఆ నోటీసులో హాస్టల్ ప్రవేశ నిర్దేశిత నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంది. ఏ నాయకుడు యూనివర్సిటీలో మూడు వాహానాలతో యూనివర్సిటీలోకి ప్రవేశించేటప్పుడు ఆ నిబంధనలను అనుసరించాలని తెలిపింది. అలాగే హాస్టల్ ప్రాంగణంలో అకడమిక్ అండ్ రెసిడెంట్స్ కౌన్సిల్ కార్యకలాపాల్లో తప్ప మరే ఏ ఇతర కార్యకలాపాల్లో పాల్లొనకూడదని పేర్కొంది. హాస్టల్ యూనివర్సిట్ ఆఫ్ ఢిల్లీ చట్టం ప్రకారం కొన్ని కార్యకలాపాల్లో పాల్గొనేందుకు దానికంటూ కొన్ని నియమ, నిబంధనలు ఉంటాయని తెలిపింది. నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా జరిగే ఏ కార్యక్రమాన్నైనా ఆపే హక్కు మాకు ఉందన్నారు. ఇది హాస్టల్ హ్యాండ్ బుక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రూల్కి సంబంధించిన క్రమశిక్షణలో భాగమని తెలిపారు. హాస్టల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్, ఇతర సభ్యులు దీన్ని బాధ్యతరాహిత్యమైన చర్యగా పేర్కొంటూ తీవ్రంగా ఖండిస్తున్నామని నోటీసులో పేర్కొంది. అలాగే ఇలాంటి చర్య హాస్టలోని విద్యార్థుల భద్రతకు ప్రమాదం కలిగిస్తుందని, అందువల్ల ఇలాంటి ఆకస్మిక చర్యలను మానుకోవాలని రాహుల్‌కి సూచిస్తూ యూనివర్సిటీ నోటీసులో పేర్కొంది. ఇదిలా ఉండగా గత శుక్రవారం రాహుల్ గాంధీ ఢిల్లీ యూనివర్సిటీలో మెన్స్ పురుషుల హాస్టల్‌ని సందర్శించి..అక్కడ వారితో సంభాషించడమే గాక కలిసి భోజనం చేశారు. ఇదికాస్త సీరియస్ అంశంగా మారీ డీల్లీ యూనివర్సిటీ అధికారులు ఫైర్ అవ్వుతూ నోటీసులు పంపేందుకు దారితీసింది. (చదవండి: ఢిల్లీ యూనివర్సిటీలో రాహుల్ ఆకస్మిక పర్యటన! నోటీసులు పంపుతామని వార్నింగ్) -
ఢిల్లీ యూనివర్సిటీలో రాహుల్ సడెన్ ఎంట్రీ! నోటీసులు పంపుతామని వార్నింగ్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం ఢిల్లీ యూనివర్సిటీలో ఆకస్మికంగా పర్యటించారు. అక్కడ క్యాంటిన్లోని విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. దీంతో మండిపడ్డ ఢిల్లీ యూనివర్సిటీ ఆయనకు నోటీసులు పంపుతామని హెచ్చరించింది. ఈ మేరకు ఓ సీనియర్ అధికారి రాహుల్ గాంధీకి ఈ విషయమై మంగళవారం లేదా బుధవారం నోటీసులు పంపనున్నట్లు తెలిపారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్న మెన్స్ హాస్టల్‌ను రాహుల్ శుక్రవారం సందర్శించి, అక్కడ కొంతమంది విద్యార్థులతో ముచ్చటించారు. అక్కడే వారితోపాటు ఆయన భోజనం కూడా చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ దీన్ని సహించం.. అంటూ రాహుల్‌కి నోటీసులు పంపుతామని చెప్పారు. ఆయన క్యాంపస్‌లో అనధికారికంగా పర్యటించారని, ఆయన లోపలికి ప్రవేశించేటప్పుడూ చాలామంది విద్యార్థులు భోజనం చేస్తున్నారని యూనివర్సిటీ రిజిస్ట్రార్ అన్నారు. ఇలాంటి ఘటనను పునరావృతం చేయకుండా ఉండాలని, అలాగే విద్యార్థుల భద్రతకు భంగం కలిగించొద్దని చెప్పారు. నిజానికి ఈ ఘటన విద్యార్థుల భద్రతకు ప్రమాదం కలిగిస్తుందని, ఇలాంటి విషయాల్లో నాయకులు కచ్చితంగా ప్రోటోకాల్ అనుసరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇదిలాఉండగా రాహుల్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం యూనివర్సిటీపై ఒత్తిడి తెచ్చిందని కాంగ్రెస్ విద్యార్థి విభాగం స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) ఆరోపించింది. ఐతే యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆ ఆరోపణలను తోసిపుచ్చారు. ఎలాంటి ఒత్తిడి లేదని, ఇది క్రమశిక్షణకు సంబంధించిన విషయమని అన్నారు. -
ఐదేళ్ల తర్వాత.. ఈ చిట్టిబాబుకు చెవులొచ్చాయ్!
లండన్: వైద్య చరిత్రలో కొన్ని చిత్రమైన కేసులు అప్పుడప్పుడు నమోదు అవుతుంటాయి. అయితే.. ఇక్కడ మాత్రం విచిత్రమైన కేసు ఒకటి నమోదు అయ్యింది. ఐదేళ్లపాటు చెవులు వినిపించకుండా పోయిన ఓ వ్యక్తి.. ఇప్పుడు సాధారణ స్థితికి వచ్చాడు. అయితే ఆయన చెవిటితననాకి కారణం తెలుసుకుంటే.. విస్తుపోవడం మీ వంతూ అవుతుంది కూడా!. ఇంగ్లండ్(ఉత్తర) డోర్సెట్ వెయ్మౌత్లో నివాసం ఉండే వాలెస్ లీ గత కొంతకాలంగా వినికిడి సమస్యతో బాధపడుతున్నాడు. ఏవియేషన్ పరిశ్రమలో పని చేయడం వల్లనో, రగ్బీ మ్యాచ్‌ల సమయంలో ప్రమాదవశాత్తూ తగిలిన గాయాల వల్లనో అలా జరిగి ఉంటుందా? అనే అనుమానం పెంచుకున్నారు ఆ 66 ఏళ్ల పెద్దాయన. వినికిడి శక్తి నానాటికీ తగ్గిపోతూ వస్తుండడంతో ఆయన భార్య సైతం ఆందోళన చెందసాగింది. ఈ క్రమంలో.. డాక్టర్‌ను కలిసే ముందు హోం ఎండోస్కోప్ కిట్‌ను కొనుగోలు చేసి.. చెవిని పరీక్షించగా, చెవి లోపల తెల్లగా ఓ చిన్న వస్తువు కనిపించింది. ఆపై ఈఎన్టీ స్పెషలిస్ట్‌ను కలిసి ఆ తెల్లటి వస్తువును బయటకు తీసే యత్నం చేశారు. అయితే చెవిలో గులిమి మధ్య అది ఇరుక్కుపోవడంతో బయటకు తీయడం వైద్యులకు కష్టతరంగా మారింది. ఈ క్రమంలో.. ఓ చిన్నిపైపును చెవిలోకి జొప్పించి.. పంపింగ్ ద్వారా ఆ వస్తువును విజయవంతంగా బయటకు రాబట్టగలిగారు. అది బయటకు వచ్చిన మరుక్షణమే ఆ చిట్టిబాబు ప్రతీ సౌండ్‌ను క్లియర్‌గా వినగలిగారట!. ఐదేళ్ల కిందట.. ఆస్ట్రేలియా ట్రిప్‌కు వెళ్తున్న సమయంలో.. పాత ఇయర్‌బడ్ ముక్క చెవిలోకి దూరి ఉంటుందని ఆయన భావిస్తున్నారు. ఆ టూర్ తర్వాతే ఆయన చెవులు క్రమక్రమంగా వినిపించడం ఆగిపోయిందట!. -
ఆరోగ్యమంత్రి ఆకస్మిక తనిఖీ... కంగుతిన్న ఆస్పత్రి సిబ్బంది
పాట్నా: బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్ మెడికల్ కాలేజ్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సరిగ్గా అదే సమయానికి ఆస్పత్రి సీనియర్ అధికారి నిద్రకు ఉపక్రమించబోతున్నారు. ఇంతలో ఆరోగ్యమంత్రి తేజస్వీయాదవ్ ఆస్పత్రికి అకస్మాత్తుగా ఎంట్రీ ఇవ్వడంతో.. దెబ్బకు ఆస్పత్రి సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. ఆస్పత్రిలో అపరిశుభ్రత, రోగులకు సరైన మందులు అందుబాటులో లేకపోవడం, అపరిశుభ్రమైన మరుగుదొడ్లు తదితర అంశాలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఒక్కరు కూడా ఈ ఆస్పత్రిలే నిలబడలేనంతగా వైద్య వ్యర్థాలు, చెత్తా పేరుకుపోయి ఉన్నాయన్నారు. ఆ ఆస్పత్రి పై మహిళలు, పలు రోగులు మంత్రికి ఫిర్యాదులు చేశారు. అంతేకాదు ఆస్పత్రిలో నర్సులే హెల్త్ మేనేజర్లుగా విధులు నిర్వర్తించడంపై ఆరా తీశారు. రాత్రి సమయాల్లో హెల్త్ మేనేజర్లు ఎందుకు విధులు నిర్వర్తించడం లేదని ప్రశ్నించారు. ఆ తర్వాత వైద్యాధికారుతో సమావేశమై ఆస్పత్రిలోని పలు సమస్యలపై విచారించారు. అంతేకాదు ఈ ఆస్పత్రిలో రోగులకు ఎలాంటి సౌకర్యాలు అందడం లేదని, అధికారులంతా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోందన్నారు. తక్షణమై ఆస్పత్రి పై చర్యలు తీసుకుంటామని, సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని ప్రజలకు హామి ఇచ్చారు ఆరోగ్య మంత్రి తేజస్వీయాదవ్. (చదవండి: కచ్చితంగా ఆరోజు కూడా వస్తుంది: బిహార్ సీఎం) -
అన్నదాత కష్టాలు..తడిసి మోపెడు
ఈ ఫొటోలోని రైతు పేరు మట్టు యాదయ్య. ఈయనది నల్లగొండ జిల్లా జి.చెన్నారం గ్రామం. ఈ యాసంగిలో పండిన 10 ట్రాక్టర్ల ధాన్యాన్ని గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రానికి ఏప్రిల్ 10న అమ్మకానికి తీసుకువచ్చాడు. ధాన్యంపై కప్పేందుకు 20 పట్టాలు అద్దెకు తీసుకున్నాడు. ఒక్కో పట్టాకు రోజుకు రూ.20 అద్దె. ఇలా రోజుకు రూ.400 అద్దె కడుతున్నాడు. ఇప్పటికి 37 రోజుల వుతోంది. తేమ శాతం చూసి పెట్టారు. కానీ కొనడం లేదు. ఈయన కంటే ముందు 50 మంది రైతులు ఉన్నారు. వారం దరివీ కొన్న తరువాతనే కొంటామని చెప్పడంతో కేంద్రం వద్ద పడిగాపులు పడుతున్నాడు. పట్టాల అద్దె ఇప్పటివరకు రూ.14 వేలకు పైగా చెల్లించాడు. ‘ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకుందామంటే ఇన్ని కష్టాలా? ఏం చేయాలో పాలు పోవడం లేదు..’అంటూ యాదయ్య వాపోతున్నాడు. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో ఎన్న డూ లేనంతగా జరిగిన యాసంగి పంటల సాగు సంబురం రైతుల కళ్లల్లో ఏమాత్రం కన్పించడం లేదు. ఆరుగాలం శ్రమించి సాగు చేయడం ఒక ఎల్తైతే, పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు కూడా అన్నదాతలు అష్ట కష్టాలూ పడుతున్నారు. ధాన్యం సేకరణలో జరుగుతున్న జాప్యం, సేకరించిన తర్వాత రవాణాకు వాహనాలు లభించక ధాన్యాన్ని తరలించలేని పరిస్థితులు, భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) విధించిన కఠిన నిబంధనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరోవైపు అకాల వర్షాలు, ఇవి చాలదన్నట్టుగా ముంచుకొచ్చిన తుపాను.. వెరసి రైతులకు కడగండ్లనే మిగులుస్తున్నాయి. మరో పదిహేను రోజుల్లో పూర్తి స్థాయి వానాకాలం మొదలుకానున్నా.. ఇంతవరకు యాభై శాతం ధాన్యం సేకరణ కూడా పూర్తి కాకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. లక్ష్యం చేరని సేకరణ ప్రభుత్వమే ధాన్యం కొనుగోళ్లు జరుపుతుందన్న ప్రకటనలో జరిగిన జాప్యం మొదలు.. ప్రస్తుతం ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు, అన్నీ కలిసి రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. రాష్ట్రంలో ధాన్యం సేకరణ చురుగ్గా ముందుకు కదలడం లేదు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 54 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. కనీసంగా 1.30 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేశారు. ఇందులో 94.81 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకు ప్రణాళిక వేశారు. ఇందుకోసం 7,204 కొనుగోలు కేంద్రాలను ప్రతిపాదించగా, 6,700 కేంద్రాలను తెరిచారు. వీటి ద్వారా సుమారు 2 లక్షలకు పైగా రైతుల నుంచి ఇప్పటివరకు సుమారు 40 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం సేకరించారు. మరో 54 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం సేకరించాల్సి ఉంది. ఇప్పటికి 40 రోజులుగా సాగుతున్న సేకరణలో రోజుకు లక్ష టన్నుల మేర సేకరణ జరుగుతోంది. ఈ లెక్కన మిగతా సేకరణకు మరో నెలన్నర రోజులు పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే అకాల వర్షాలతో రైతులు ఆగమాగం అవుతుండగా, జూన్‌లో మళ్లీ వర్షాలు మొదలైతే ధాన్యాన్ని అమ్ముకోవడం మరింత కష్టతరం కానుంది. పూర్తిస్థాయిలో వర్షాలు మొదలైతే పెట్టుబడి కూడా దక్కక తాము అప్పులపాలు కావాల్సిందేనని రైతులు అంటున్నారు. అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి జగిత్యాల జిల్లాలో 6.50 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకు గాను ఇంతవరకు 2.50 లక్షల టన్నులు, నిజామాబాద్‌లో 8 లక్షల టన్నులకు గాను 5 లక్షల టన్నులు, ఖమ్మంలో 4.5 లక్షల టన్నులకు గాను 2 లక్షల టన్నులు, యాదాద్రిలో 4.7 లక్షల టన్నులకు గాను 1.9 లక్షల టన్నులు, సిద్దిపేటలో 5.46 లక్షల టన్నులకు గాను 1.6 లక్షల టన్నుల ధాన్యం సేకరణే జరిగింది. ఈ జిల్లాల్లో అకాల వర్షాల కారణంగా ధాన్యం సేకరణ ఆలస్యమవుతోంది. తరుగు పేరిట గొరిగేస్తున్నారు.. మరోవైపు ఎఫ్‌సీఐ నిబంధనలంటూ పౌర సరఫరాల శాఖ నాణ్యత విషయంలో వ్యవహరిస్తున్న కఠిన వైఖరి రైతులకు ఇక్కట్లు తెచ్చిపెడుతోంది. తేమ 17 శాతం మించకుండా చూసుకోవడంతో పాటు తాలు.. చెత్త ఒక శాతం, మట్టి పెడ్డలు, రాళ్లు ఒక శాతం, చెడిపోయిన, రంగు మారిన, మొలకెత్తిన ధాన్యం 5 శాతం, పూర్తిగా పరిపక్వత చెందని ధాన్యం 3 శాతానికి మించి ఉండకూడదన్న ఎఫ్‌సీఐ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశించింది. దీంతో నాణ్యత లేని ధాన్యాన్ని కేంద్రాల్లో తూకం వేయడం లేదు. ప్రస్తుతం అకాల వర్షాల నేపథ్యంలో తేమ 20 శాతానికి పైగానే ఉంటోంది. దీన్ని పగలంతా ఆరబెట్టి రాత్రికి కుప్పలు చేస్తే, మళ్లీ వర్షం పడటంతో తేమ శాతం మళ్లీ పెరుగుతోంది. చాలా చోట్ల టార్పాలిన్ల కొరత రైతుల్ని వేధిస్తోంది. రోజుకు రూ.20 చొప్పున నాలుగైదు టార్పాలిన్లు అద్దెకు తెచ్చి కుప్పలను కప్పుతున్నా తేమ శాతం తగ్గకపోవడం, ధాన్యం రంగుమారడం జరుగుతోంది. ఎలాగో ధాన్యాన్ని తూకం వేసినా క్వింటాల్‌కు కనీసంగా తరుగు పేరిట నాలుగు నుంచి 5 కిలోలు తీసేస్తున్నారు. మిల్లు వద్ద నాణ్యత పేరిట మరో రెండు కిలోలు తరుగు తీస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వేధిస్తున్న వాహనాల సమస్య కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని తరలించేందుకు అవసరమైన మేర లారీలు, డీసీఎంలు లేకపోవడం సమస్యగా మారుతోంది. ఒకేసారి పంట కోతకు రావడం, కుప్పలుగా ధాన్యం కేంద్రాలకు రావడంతో అక్కడి నుంచి కేంద్రానికి కేటాయించిన ఐదారు లారీల ద్వారా తరలింపు ఆలస్యమవుతోంది. బిహార్, యూపీలకు చెందిన హమాలీలు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోవడం, కరోనా కారణంగా స్థానిక కూలీలెవరూ పనికి ముందుకు రాకపోవడంతో లోడింVŠ ప్రక్రియ జాప్యం అవుతోంది. ఇక మిల్లుల వద్ద అన్‌లోడింగ్‌లోనూ సమస్య ఎదురవుతోంది. దీంతో మిల్లుల వద్ద వాహనాలు బారులు కడుతున్నాయి. దీన్ని నివారించేందుకు స్థానికంగా ఏ వాహనం అందుబాటులో ఉంటే దాన్ని వాడుకోవాలని చెబుతున్నా, లాక్డౌన్ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 10 తర్వాత పెట్రోల్ బంకులు మూసి వేస్తుండటంతో వాహనాలు సమకూర్చేందుకు యజమానులు ముందుకు రావట్లేదు. లారీలు వస్తలేవంటున్నరు మూడు ఎకరాల్లో వరి సాగు చేసిన. కోత కోసి ఊరిలోనే కేంద్రానికి తీసుకొస్తే పది రోజులు అవుతున్నా కొంటలేరు. అడిగితే లారీలు వస్తలేవంటున్నరు. వానొస్తే ధాన్యం తడిచిపోతాది. టార్పాలిన్లు అడిగితే ఇస్తలేరు. నేనే బయట ఎక్కువ రేటు పెట్టి కొనుక్కొచ్చిన. తొందరగా కొనేటట్టు చూడాలె. – మల్లేశం, చాట్లపల్లి, సిద్దిపేట జిల్లా తాలు పేరుతో దోచుకుంటున్నారు.. రెండెకరాల్లో పండిన 40 క్వింటాళ్ల ధాన్యాన్ని మందపల్లి పీఏసీఎస్ కేంద్రానికి 10 రోజుల క్రితం తీసుకువచ్చాను. కుప్పలు పోసి ప్యాడీ క్లీనర్లు తూర్పారబట్టిన తర్వాత ఆరు రోజులకు గన్నీ సంచులు ఇచ్చారు. తర్వాత రెండ్రోజులకు కాంటా పెట్టిండ్రు. తూర్పారపట్టినా కూడా మిల్లు వాడు నలభై కిలోల బస్తాకు మూడు కిలోల ధాన్యాన్ని తీసుకున్నాడు. మొత్తం మీద నాకు క్వింటాకు 5 కిలోల తరుగు నష్టం జరిగింది. – అజ్మీర్ రాములు, రాజ్యాతండా, దుగ్గొండి మండలం, వరంగల్ రూరల్ జిల్లా 40 రోజులుగా పడిగాపులు నా పొలంలో 320 బస్తాల వడ్ల దిగుబడి వచ్చింది. అమ్ముదా మని కూసుమంచిలోని కొనుగోలు కేంద్రానికి 40 రోజుల కిందట తీసుకొచ్చిన. ఇప్పటివరకు 170 బస్తాలు కాంటా వేశారు. 150 బస్తాలు మిగిలే ఉన్నాయి. కాంటా వేసిన ధాన్యం ఎగుమతి కాలేదు. కొనుగోలు కేంద్రంలోనే పడిగాపులు కాస్తున్నా. వర్షాలు, గాలిదుమారాలు వస్తుంటే భయంగా ఉంది. ధాన్యం తడిస్తే రంగు మారిందని తరుగు తీస్తున్నారు. – వడ్త్యి నాగేశ్వరరావు, గంగ బండతండా, ఖమ్మం జిల్లా ఈ ఫొటోలోని రైతు.. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం గౌరాయపల్లికి చెందిన నరెడ్ల అంజిరెడ్డి. 3 ఎకరాల్లో వరి సాగుచేస్తే దాదాపు 75 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. గ్రామంలోని కొనుగోలు కేంద్రానికి ఆరు ట్రాక్టర్లలో తరలించాడు. కానీ అక్కడ ధాన్యం ఆరబోయడానికి వసతులు లేవు. టార్పాలిన్ కవర్లు అందుబాటులో లేకపోవడంతో 10 టార్పాలిన్ కవర్లు అద్దెకు తీసుకువచ్చాడు. ఇంత చేసినా వర్షం కురవడంతో రంగు మారిపోయింది. రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అంటున్నాడు. ఈమె పేరు ఎల్లోబోయిన సమ్మక్క (జనగామ జిల్లా చీటకోడూరు గ్రామం). ఐదున్నర ఎకరాల్లో వరిసాగు చేశారు. 120 బస్తాల దిగుబడి వచ్చింది. జనగామలో ప్రభుత్వ కొనుగోలు సెంటర్‌కు 11 రోజుల కింద తీసుకొచ్చారు. అకాల వర్షాలకు రెండుసార్లు ధాన్యం తడిసిపోయింది. ధాన్యం ఆరబోసేందుకు రోజుకు రూ.వెయ్యి ఖర్చయ్యింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం రెడ్డిగూడెం గ్రామానికి చెందిన రైతు నిమ్మల జయపాల్‌రెడ్డి రెండెకరాలు కౌలుకు తీసుకుని వరి సాగుచేశాడు. అకాల వర్షానికి తడిసి ధాన్యం రంగు మారింది. మిల్లర్ల వద్దకు చేరిస్తే క్వింటాకు 7.30 కేజీల చొప్పున తరుగు తీశారు. తరుగును రైతులు అంగీకరిస్తేనే కొనుగోలు జరుగుతోందని చెప్పాడు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామానికి చెందిన పెంటప్ప 15 ఎకరాల పొలంలో వరి సాగు చేశాడు. పంట కోశాక గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో విక్రయించేందుకు వెళ్లాడు. అయితే అక్కడ ధాన్యం నిల్వ చేసేందుకు వసతులు లేకపోవడంతో యాలాల మండలం లక్ష్మీ నారాయణపూర్ వద్ద రైస్ మిల్లులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి మొత్తం 900 ధాన్యం బస్తాలను తరలించాడు. కానీ అక్కడి నిర్వాహకులు ధాన్యంలో తాలు ఉందని, క్వింటాలుకు 10 కిలోల తరుగు తీసి వేస్తామని చెప్పడంతో ధాన్యం బస్తాలను తిరిగి గ్రామానికి తీసుకొని వెళ్లాడు. రైస్ మిల్లులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం అధికార పార్టీకి చెందిన మండల ప్రజా ప్రతినిధిది కావటం గమనార్హం. ఈయన మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం నాగారం గ్రామానికి చెందిన రైతు. పేరు వెంకట్రామిరెడ్డి. తనకున్న రెండున్నర ఎకరాల్లో వరి సాగు చేశాడు. 210 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది. ప్రభుత్వం అందించే మద్దతు ధరకు అమ్ముకుందామనే ఉద్దేశంతో స్థానిక పీఏసీఎస్ సెంటర్‌కు తీసుకొచ్చి విక్రయించాడు. అయితే ధాన్యం సేకరించి రెండు మూడు రోజులు గడిచినా లారీల కొరతతో కేంద్రం సిబ్బంది ఆ ధాన్యాన్ని మిల్లుకు తరలించలేదు. వర్ష సూచన, ధాన్యంపై కప్పడానికి టార్పలిన్ కవర్లు అందుబాటులో లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బస్తాకు రూ.20 చెల్లించి ప్రైవేట్ వాహనాలలో మిల్లు వద్దకు తరలించారు. ఇంతా చేస్తే అక్కడ ధాన్యం దించడానికి వారం సమయం పట్టింది. వాహనాల యజమానులు వెయిటింగ్ చార్జీ కింద రోజుకు రూ.400 వసూలు చేశారు. నిబంధనల ప్రకారం 40 కిలోల బస్తాకు బస్తా బరువు కలుపుకొని 40.600 గ్రాములు తూకం వేయాలి. కానీ తరుగు, తేమ అంటూ మిల్లర్ల పేరిట కొనుగోలు సెంటర్లోనే బస్తాకు అదనంగా 600 గ్రాములు చొప్పున క్వింటాల్‌కు కిలోకు పైగానే ధాన్యం తరుగు తీశారు. తర్వాత లారీల కొరత, రైసుమిల్లులో ధాన్యం దించడానికి వెయిటింగ్ ఇలా వారం నుండి పది రోజులు çసమయం గడవడంతో గింజ బరువు తగ్గి తూకంలో తేడా వచ్చింది. దీంతో మిల్లర్లు మళ్ళీ కిలోకు పైగా ధాన్యం తరుగు తీశారు. ఇంత దోపిడీ జరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదని వెంకట్రామిరెడ్డి వాపోయాడు. రెండున్నర ఎకరాలు పంట సాగుకు దాదాపు రూ.80 వేలు, ధాన్యం రవాణా ఖర్చు రూ.6 వేలు అయ్యిందని, ధాన్యం అమ్మితే వచ్చే డబ్బులు పెట్టుబడికే సరిపోయి నట్టయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ధాన్యం రవాణాకు సరిపడినన్ని లారీలు, ఇతర వాహనాలు లేక రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యంతో వేచి చూడాల్సి వస్తోంది. వర్షాలతో తేమ 17 శాతం మించకుండా చూడటం కష్టమవుతోంది. ఈ తేమ తగ్గేందుకు ఆరబెడుతున్నా, మళ్లీ వర్షాలు వస్తుండటంతో మళ్లీ ఆరబెట్టాల్సి వస్తోంది. ఈ క్రమంలో ధాన్యం రంగుమారినా, ఆరబెట్టే క్రమంలో పెళ్లలు వచ్చినా క్వింటాల్‌కు 3–4 కిలోలు తరుగు పోతోంది. మిల్లుల్లోనూ కోత పెడుతున్నారు. వాస్తవానికి కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం వెళ్లాక రైతుకు సంబంధం ఉండొద్దు. కానీ అక్కడ నాణ్యతను సాకుగా చూపి మొత్తం తూకంలో మళ్లీ కోత వేస్తున్నారు. హమాలీల కొరతతో కేంద్రాల వద్ద లోడింగ్, మిల్లుల వద్ద అన్లోడింగ్ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. టార్పాలిన్లు, మిల్లుల వద్ద వెయిటింగ్ చార్జీలు తడిసి మోపెడవుతు న్నాయి. ఒక్క టార్పాలిన్కు రూ.20 వరకు అద్దె ఉంటోంది. ఒక రైతుకు కనీసం పది టార్పాలిన్లు అవసరం అవుతున్నాయి. -
ఎందుకింత తెగులు..?
తెలుగుమీడియం ఆకస్మిక రద్దుపై విమర్శల వెల్లువ ముందస్తు కసరత్తు లేకుండానే నిర్ణయం మున్సిపల్, నగరపాలక పాఠశాలల విద్యార్థుల ఆందోళన తెలుగు రాష్ట్రం.. అయితే తేనెలూరించే తెలుగు నుడికారంపై తెలుగుదేశం ప్రభుత్వమే కత్తిగట్టింది. ఈ ఏడాది నుంచి మున్సిపల్, నగరపాలక పాఠశాలల్లో తెలుగు మాథ్యమాన్ని రద్దు చేసి..ఆంగ్ల మాథ్యమమే నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఆంగ్ల భాషపై మోజు కంటే కార్పొరేటుపై మోజే ఇందుకు కారణమంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకింత తెగులు.. అంటూ ప్రభుత్వ నిర్ణయానికి విద్యార్థులు, తల్లిదండ్రులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంగ్లిష్ మీడియం క్లాసుల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయకుండానే ఇంత హడావుడి నిర్ణయం ఏమిటని ఉపాధ్యాయులు ‘నారాయణ..నారాయణ’అంటున్నారు. రాయవరం (మండపేట) : దేశభాషలందు తెలుగు లెస్స అని శ్రీ కృష్ణదేవరాయులు తెలుగు భాష కీర్తిని కొనియాడితే, తెలుగు పౌరుషాన్ని తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ప్రపంచానికి చూపించారు. తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అంటూ ఇంగ్లిష్ కవి ప్రశంసించారు. తెలుగు భాషకు ఉన్న ఇంతటి ఔనత్యాన్ని తెలుసుకుండీ కూడా.. కార్పొరేటు మోజుతో.. చంద్రబాబు హైటెక్ ప్రభుత్వం మున్సిపల్, నగరపాలక సంస్థల పాఠశాలల్లో తెలుగు భాషను పాతరేసేందుకు సిద్ధమవుతోందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. జిల్లాలో ఇదీ పరిస్థితి.. రాజమహేంద్రవరం, కాకినాడ కార్పొరేషన్లతోపాటు రామచంద్రపురం, మండపేట, అమలాపురం, సామర్లకోట, పెద్దాపురం, తుని, పిఠాపురం మున్సిపాల్టీల్లో 226 ప్రాథమిక, 12 ప్రాథమికోన్నత, 47 ఉన్నత పాఠశాలలున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో 15,035, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1,461, ఉన్నత పాఠశాలల్లో 19,760 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 18,156 మంది బాలురు, 18,100 బాలికలు ఉన్నారు. ఉన్న పళంగా ఈ పాఠశాలల్లో ఆంగ్ల మాథ్యమం ప్రవేశపెట్టడంతో వారందరూ అయోమయ పరిస్థితిలో పడ్డారు. ఏకపక్ష నిర్ణయం.. మున్సిపల్ పాఠశాలల్లో ఈ ఏడాది నుంచి ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టింది. ముందస్తు కసరత్తు లేకుండా ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ విధానం అమలు చేయాలంటూ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ తీసుకున్న ఈ నిర్ణయం వీరిని కలపరపెడుతున్నాయి. ఒక్కసారిగా ఆంగ్ల మాథ్యమం ప్రవేశపెడితే పాఠాలు బోధించే ఉపాధ్యాయులకూ కష్టమే. విద్యకు దూరమయ్యే ప్రమాదం.. మున్సిపల్ పాఠశాలల్లో పేద, బడుగు, బలమీన వర్గాల విద్యార్థులే ఎక్కువగా ఉంటారు. ఆంగ్ల భాష అందరికీ అవసరమే అయినా.. తెలుగు మీడియం పూర్తిగా పక్కనబెట్టి.. కేవలం ఇంగ్లిష్ మీడియం చదవాలంటే విద్యార్థులు చదువుకు దూరమయ్యే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రంలో తెలుగు భాషకు పట్టం కట్టాల్సింది పోయి తెలుగును విద్యార్థి దశ నుంచే దూరం చేయడం సిగ్గచేటని పలువురు విమర్శిస్తున్నారు. పొరుగు రాష్ట్రాలను చూసైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వైఎస్సార్ హయాంలో.. 2009లో ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పేద విద్యార్థులకు ఇంగ్లిష్ చదువులు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో సక్సెస్ పేరుతో ఆరో తరగతి నుంచి తెలుగుతో పాటు ఆంగ్ల మాథ్యమం ప్రవేశ పెట్టారు. అయితే తెలుగు మీడియం రద్దు చేయలేదు. విద్యార్థులు ఆసక్తిని బట్టి ఇంగ్లిష్ మీడియంలో చదువుకునే అవకాశం కల్పించారు. ఈ నిర్ణయాన్ని ప్రజలు ఎంతో మెచ్చుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం తెలుగు మీడియాన్ని పూర్తిగా రద్దు చేయడం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందనే పలువురు విమర్శిస్తున్నారు. తొందరపాటు చర్య.. మున్సిపల్, కార్పొరేషన్ స్కూల్స్‌లో ఒకేసారి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం తొందరపాటు చర్య. ఇంగ్లిషుతో పాటు మాతృభాషను సమాంతరంగా కొనసాగించాలి. బలవంతపు చదువు వల్ల విద్యార్థులు చదువుకు దూరమవుతారు. – కవి శేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్టీయూ మీడియం ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలి విద్యార్థి మీడియంను ఎంచుకునే స్వేచ్ఛను కల్పించాలి. ఒకేసారిగా ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టడం, ఉపాధ్యాయులకు ఎటువంటి శిక్షణ ఇవ్వకపోవడం వల్ల గందరగోళం ఏర్పడుతుంది. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం పునఃసమీక్షించుకోవాలి. – టి.కామేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్ -
పరిశీలిస్తూ.. ప్రశ్నిస్తూ..
కోనసీమలో పలు ప్రాంతాల్లో కలెక్టర్ మిశ్రా సుడిగాలి పర్యటన ఉరుకులు, పరుగులు పెట్టిన అధికారులు సఖినేటిపల్లి : జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా బుధవారం మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. దీంతో ఆయన వెంట వివిధ శాఖల అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టారు. పలు అభివృద్ధి పనులను పరిశీలిస్తూ.. రైతులకు, ప్రజలకు అవసర మయ్యే పనులు గుర్తిస్తూ కలెక్టర్ ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. అంతర్వేది శ్రీలక్ష్మీనృసింహస్వామివారి దర్శనానికి వచ్చిన కలెక్టర్ మండలంలోని దేవస్థానం, పల్లిపాలెం, సఖినేటిపల్లి, అంతర్వేదిపాలెం, మోరి ప్రాంతాల్లో పర్యటించారు. తొలుత అంతర్వేది గెస్ట్‌హౌస్ నుంచి కలెక్టర్ సరాసరి దేవస్థానంలోని సముద్ర స్నానాల రేవును పరిశీలించారు. స్నానాలరేవు పరిసరాల్లో పారిశుద్ధ్యం సక్రమంగా లేదంటూ స్థానిక భక్తులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. తక్షణం దీనిపై దృష్టి పెట్టాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అక్కడి నుంచి లైట్‌హౌస్ మీదుగా సాగరసంగమం ప్రాంతాన్ని సందర్శించారు. అనంతరం సుమారు రూ.23 కోట్లతో జరుగుతున్న ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులను పరిశీలించారు. హార్బర్లో జరుగుతున్న పనులను హెడ్‌వర్క్స్ ఈఈ కృష్ణారావు, కలెక్టర్‌కు వివరించారు. తొలి ఫేజ్ పనులు ఎప్పటికి పూర్తిచేస్తారని కలెక్టర్ ప్రశ్నించగా ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని ఈఈ కృష్ణారావు బదులు చెప్పారు. అనంతరం అంతర్వేది ఏటిగట్టుకు రాళ్ల, నవా మురుగుకాలువలకున్న శిథిల అవుట్‌ఫాల్ స్లూయిస్‌లను, నీరు–చెట్టు పథకంలో వివిధ పంటకాలువల్లో జరుగుతున్న రక్షణగోడ నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. సఖినేటిపల్లి, అంతర్వేదిపాలెం, మోరి గ్రామాల పరిధిల్లోని ఆయా పనులను చూశారు. అండర్‌టన్నెల్ నిర్మించాలని.. కాలువమొగ సెంటర్ నుంచి పల్లిపాలెం వరకూ తవ్విన మురుగుకాలువకు అంతర్వేది దేవస్థానం పరిధిలో ఆదర్శనగర్ వద్ద అండర్‌టన్నెల్ నిర్మించాలని, ఇది లేకపోవడం వల్ల మురుగుకాలువలోకి ఉప్పునీరు పోటెత్తే అవకాశం ఉందని కలెక్టర్‌కు, స్థానిక జెడ్పీటీసీ సభ్యురాలు రావి దుర్గ ఆలేంద్రమణి వివరించారు. దీనిని పరిశీలించాల్సిందిగా ఆర్డీఓ గణేష్‌కుమార్‌ను కలెక్టర్ ఆదేశించారు. గోదావరి డెల్టాకమిటీ చైర్మన్ భూపతిరాజు ఈశ్వరరాజువర్మ, రాజోలు సబ్‌డివిజన్ నీటి సంఘ ఛైర్మన్ ఓగూరి విజయ్‌కుమార్, ఎంపీపీ పప్పుల లక్ష్మీసరస్వతి, సర్పంచ్‌లు చొప్పల చిట్టిబాబు, భాస్కర్ల గణపతి, పోతురాజు నాగేంద్రకుమార్, ఎంపీటీసీ సభ్యులు దొంగ నాగసత్యనారాయణ, జి వాసు, తహసీల్దార్ డీజే సుధాకర్‌రాజు, ఎంపీడీఓ జీ వరప్రసాద్‌బాబు, ఈఓపీఆర్డీ బొంతు శ్రీహరి, ఎన్ఆర్ఈజీఎస్ జేఈ సునీల్, రాజోలు ఏఎంసీ చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణమూర్తి, ఆర్డబ్ల్యూఎస్ అధికారి కృష్ణారావు, పలు శాఖ అధికారులు పాల్గొన్నారు. పర్యాకుల విడిది కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ మిశ్రా పాశర్లపూడి(మామిడికుదురు) : పాశర్లపూడిబాడవలో రూ.1.13 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న పర్యాటకుల విడిది కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా బుధవారం పరిశీలించారు. పర్యాటకులు వైనతేయ గోదావరి నదిలో విహరించిన అనంతరం ఇక్కడ విశ్రాంతి తీసుకునేలా ఈ కేంద్రాన్ని నిర్మిస్తున్నామని అఖండ గోదావరి ప్రాజెక్టు ప్రత్యేకాధికారి భీమశంకరం కలెక్టర్‌కు వివరించారు. ఈ కేంద్రానికి సమీపంలో ఉన్న అప్పనపల్లి శ్రీబాలబాలాజీ స్వామి వారి దేవస్థానంతో పాటు ఆదుర్రులోని ప్రాచీన ఆది బౌద్ధ స్థూపాన్ని బోటు షికారు ద్వారా సందర్శించే పర్యాటకుల విడిది కోసం ఈ కేంద్రం నిర్మిస్తున్నామన్నారు. ఈ కేంద్రానికి కనకదుర్గమ్మ ఆలయం పక్కన ఉన్న మెటల్ రోడ్డును సిమెంట్ కాంక్రీట్ రోడ్డుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. మరో వైపున సీసీ రోడ్డు నిర్మాణానికి జిరాయితీ రైతుల నుంచి భూసేకరణ జరగాల్సి ఉందన్నారు. ఇక్కడ జరుగుతున్న పనులను కలెక్టర్ పరిశీలించి టూరిజం అధికారులకు పలు సూచనలు అందించారు. ఆయన వెంట అమలాపురం ఆర్డీఓ జి.గణేష్‌కుమార్, టూరిజం, రెవెన్యూ శాఖ అధికారులు ఉన్నారు. -
పోలీసుల ఆకస్మిక తనిఖీలు
పెద్దాపురం : జిలాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పెద్దాపు రం ఎన్టీఆర్నగర్, రామచంద్రపురం మండలం ఉట్రుమి ల్లిలోని సదాశివ కాలనీ తదితర చోట్ల విస్తృత తనిఖీ చేశారు. పోలీసు అధికారులు సహా సుమారు 50 మంది ఒక్కసారిగా పెద్దాపురం ఎన్టీఆర్నగర్ కాలనీని చుట్టుముట్టారు. కార్డెన్ సెర్చ్ పేరుతో ప్రతి ఇంటిలో సోదాలు చేశారు. డీఎస్పీ రాజశేఖర్ ఆధ్వర్యంలో సీఐ ప్రసన్న వీరయగౌడ్, ఎస్సైలు ప్రతి ఇంటిలో కుటుంబ సభ్యులు, యజమానుల వివరాలను తెలుసుకున్నారు. ఈ కాలనీలో వ్యభిచారం చేస్తున్నారని, గుర్తు తెలియని వ్యక్తులు అద్దె ఇళ్లల్లో ఉంటున్నారన్న ఫిర్యాదులు వచ్చాయని డీఎస్పీ రాజశేఖర్ తెలిపారు. అనుమానాస్పద వ్యక్తుల సమాచారం తెలియజేయాలని కాలనీవాసులను కోరారు. ఎస్సైలు వై.సతీష్, మురళీకృష్ణ, వి.సత్యనారాయణ, లక్ష్మీకాంతం పాల్గొన్నారు. అదుపులో ముగ్గురు వ్యక్తులు... ఎన్టీఆర్ నగర్లో నిర్వహించిన తనిఖీల్లో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పెద్దాపురం ఎస్సై వై.సతీష్ తెలిపారు. మూడు ఆటోలు, నాలుగు బైక్‌లను స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టణంలో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే 94409 04846కు సమాచారం ఇవ్వాలని కోరారు. -
ఇసుక రీచ్‌ల్లో కేటీఆర్ ఆకస్మిక తనిఖీలు
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని ఇసుక రీచ్‌ల్లో రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కొత్తపల్లి ఇసుకరీచ్‌లో కూలీలు, డ్రైవర్లతో కేటీఆర్ ముచ్చటించారు. మైనింగ్ జరుగుతున్న తీరు, ఇసుక తరలింపుపై ఆయన ఆరా తీశారు. ఇదే విధంగా ఇతర జిల్లాల్లోనూ తనిఖీలు నిర్వహిస్తానని ఈ సందర్భంగా కేటీఆర్ వెల్లడించారు. మైనింగ్ జాతీయ సంపద అని, అక్రమాలను సహించేది లేదని కేటీఆర్ స్పష్టంచేశారు. పర్మిట్ ఉన్నా రాత్రివేళల్లో ఇసుక రవాణా నిషేధం అని ఈ సందర్భంగా కేటీఆర్ స్పష్టం చేశారు. అక్రమ దందాను అరికట్టాలంటే రెవిన్యూ, పోలీసు, మైనింగ్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కేటీఆర్ అన్నారు. -
కూకట్‌పల్లిలో కేటీఆర్ ఆకస్మిక పర్యటన
-
కూకట్‌పల్లిలో కేటీఆర్ ఆకస్మిక పర్యటన
హైదరాబాద్: హైదరాబాద్ కూటట్పల్లిలో తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆకస్మిక పర్యటన నిర్వహించారు. రోడ్లు, నీటి సరఫరా, బస్టాండ్ తదితర ప్రాంతాలను మంత్రి పరిశీలించారు. రాత్రి 11 గంటలనుంచి 2:30 గంటల వరకు కేటీఆర్ తనిఖీలు కొనసాగాయి. ఈ సందర్భంగా రోడ్లపై వాననీరు నిల్వ ఉండటం పట్ల జీహెచ్ఎంసీ సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారి రమ్య మృతికి కారణమైన ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని మంత్రి పరిశీలించారు. -
బదిలీలపై న్యాయ పోరాటం
ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన సబ్ రిజిస్ట్రార్లు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం విజయవాడ : ప్రభుత్వం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలో ఇటీవల చేసిన బదిలీలపై పలువురు సబ్ రిజిస్ట్రార్లు న్యాయపోరాటానికి దిగారు. అక్రమ బదిలీలను ఆకస్మికంగా చేశారంటూ జిల్లాకు చెందిన సబ్ రిజిస్ట్రార్లు ట్రిబ్యునల్‌లో పిటిషన్లు దాఖలు చేశారు. కొందరు సబ్ రిజిస్ట్రార్లు బదిలీలకు సంబంధించి సోమవారం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఆకస్మిక బదిలీలతో ఇబ్బందులే.. రాష్ట్ర ప్రభుత్వం గత నెల 30 తేదీన రాష్ట్రవ్యాప్తంగా జీరో సర్వీసు జీవో ప్రకారం మూకుమ్మడిగా సబ్ రిజిస్ట్రార్లను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జిల్లాలో 30 మంది సబ్ రిజిస్ట్రార్లను బదిలీ చేశారు. వారు ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. సంవత్సరం మధ్యలో ఆకస్మికంగా బదిలీచేస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందని వివరించారు. కౌన్సెలింగ్ జరపకుండా ప్రభుత్వం ఇష్టానుసారం బదిలీ చేసిందని, ఇది చట్టవిరుద్ధమని పిటిషన్లలో పేర్కొన్నారు. నందిగామ, కంకిపాడుల్లో సబ్ రిజిస్ట్రార్లుగా పనిచేసిన రాంబాబు, రాఘవరావుతో పాటు పలువురు శుక్రవారం ట్రిబ్యునల్‌లో పిటిషన్లు వేర్వేరుగా దాఖలు చేశారు. వీటిని ట్రిబ్యునల్ విచారణకు స్వీకరించింది. బదిలీల ప్రక్రియకు సంబంధించి పూర్తి వివరాలను వచ్చే బుధవారంలోగా సమర్పించాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ఏలూరు డీఐజీ సాయిప్రసాద రెడ్డిని ట్రిబ్యునల్ ఆదేశించింది. తదుపరి విచారణ అనంతరం ట్రిబ్యునల్ నుంచి తీర్పు వెలువడనుంది. ఇదిలాఉంటే.. జిల్లాలో పది మంది సబ్ రిజిస్ట్రార్లు బదిలీ జరిగినప్పటికీ చార్జి అప్పగించకుండా, బదిలీ అయిన ప్రదేశానికి వెళ్లలేదని సమాచారం. దీనివల్ల రిజిస్ట్రేషన్లకు ఆటంకం కలుగుతోంది. బదిలీలు అస్తవ్యస్తంగా జరిగాయని కంకిపాడు ప్రాంతానికి చెందిన ఓ సీనియర్ సిటిజన్ శుక్రవారం హైకోర్టులో పిల్ వేశారు. జిల్లాలో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అందులో పేర్కొన్నారు. బదిలీలు రద్దు? ఇటీవల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలో జరిగిన బదిలీలు రద్దవుతాయని తెలుస్తోంది. ప్రభుత్వం రూపొందించిన జీరో సర్వీసు నిబంధన చట్టవిరుద్ధమని, బదిలీలు కౌన్సెలింగ్ ద్వారా మాత్రమే జరగాల్సి ఉండగా సర్వీసు రూల్స్‌ను పక్కనపెట్టి ఉత్తర్వులు జారీ చేయడం తగదని పలువురు పేర్కొంటున్నారు. వచ్చే వారంలో బదిలీలన్నీ రద్దవుతాయని పెద్దఎత్తున ప్రచారం నడుస్తోంది. -
అకస్మాత్తుగా సంభవించే ఆపద!
Civils Prelims Paper - I డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తులు తీవ్ర నష్టాన్ని కలుగజేస్తూ, ప్రజలను పూర్తిగా నిరాశ్రయులను చేసే ఆకస్మిక ఘటనలనే విపత్తులు అంటారు. ప్రకృతి వనరులు, మౌలిక వనరులు ధ్వంసం కావడం, సాధారణ జన జీవనానికి ఆటంకాలు కలగడం, సామాన్య ప్రజలు తమ జీవనోపాధిని పునరుద్ధరించుకోలేకపోవడం, ధన, ప్రాణ నష్టాలు ఈ విపత్తుల వల్ల సంభవిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా క్రీ.పూ. 430 నుంచి విపత్తులకు సంబంధించిన వివరాల నమోదు ప్రారంభమైంది. అదే సంవత్సరంలో ఏథేన్స నగరంలో టైఫస్ మహమ్మారి సంభవించినట్లు నమోదు చేశారు. క్రీ.పూ. 1556 జనవరి 23న చైనాలోని షాంగ్జీ ప్రావిన్‌సలో సంభవించిన భూకంపంలో 8,30,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తం గా అత్యధికంగా ప్రాణ నష్టానికి కారణమైన విపత్తు ఇదే. గ్రీక్ భాషకు చెందిన ఈఠట(చెడ్డ), అఠట్ట్ఛట (నక్షత్రం) అనే పదాల కలయిక ద్వారా వచ్చిన ఈజీట్చట్ట్ఛట, మధ్యయుగాల నాటి ఫ్రెంచి పదం ఈ్ఛట్చట్టట్ఛ, ప్రాచీన ఇటలీ భాషకు చెందిన ఈజీట్చట్టటౌ పదాల నుంచి విపత్తు అనే పదం ఏర్పడింది. గ్రీక్, లాటిన్ భాషల్లో ఈజీట్చట్ట్ఛట అంటే ‘దుష్టనక్షత్రం’ (Bad Star) అని అర్థం. ప్రాచీన కాలంలోని ప్రజలు ఏదైనా విధ్వంసం లేదా విపత్తును ఏదో ఒక నక్షత్రానికి ఆపాదిస్తూ దాన్ని దుష్ట నక్షత్రంగా భావించేవారు. విపత్తు సంభవించే ప్రాంతంలో వచ్చే మార్పులు - ప్రజల దైనందిన కార్యక్రమాలు పూర్తిగా దెబ్బతింటాయి. - మౌలిక వసతులు (రోడ్డు, రైల్వేమార్గాలు, వైద్యవసతులు, తాగునీరు మొదలైనవి) దెబ్బతింటాయి. - సాధారణ ప్రజల జీవనోపాధి దెబ్బతిం టుంది. వారు నిరాశ్రయులవుతారు. - ప్రకృతి వనరులు ధ్వంసమవుతాయి. - ధన, ప్రాణ నష్టాలు సంభవిస్తాయి. విపత్తుల లక్షణాలు - ఆకస్మికంగా వస్తాయి. అందువల్ల వాటి రాకను ముందుగా గుర్తించలేం. అవి సంభవించిన తర్వాత వాటివల్ల జరిగే తీవ్రతను మాత్రమే ముందస్తు చర్యల ద్వారా తగ్గించవచ్చు. - విపత్తులు అతివేగంగా వస్తాయి. - తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి. విపత్తు నిర్వచనాలు 2005 విపత్తు నిర్వహణ చట్టం ఇచ్చిన నిర్వచనం ప్రకారం విపత్తు అంటే ‘ఏదైనా ప్రాంతంలో ప్రకృతి సిద్ధంగా లేదా మానవ చర్యల వల్ల సంబంధిత ప్రాంతం తనంతట తాను కోలుకోలేని విధంగా పెద్ద ఎత్తున ప్రాణ నష్టానికి, ఆస్తి నష్టానికి, పర్యావరణ విధ్వంసానికి కారణమయ్యే ఉపద్రవం, ప్రమాదం లేదా దుర్ఘటననే’ విపత్తు అని పిలుస్తారు.ఐక్యరాజ్య సమితి (ూ్ఖై) ఇచ్చిన నిర్వచనం ప్రకారం... ‘ఒక సమాజపు సాధారణ నిర్మాణాన్ని, సాధారణ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తూ అకస్మాత్తుగా లేదా తీవ్రంగా సంభవించే ఆపదే విపత్తు’. విపత్తుల స్వభావాన్ని పరిశీలిస్తే అవి రెండు రకాలు. ప్రకృతిలో మార్పుల వల్ల సంభవించేవి. ఉదా: భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాల విస్ఫోటనాలు. మానవ తప్పిదాలు, నిర్లక్ష్యం వల్ల సంభవించేవి. ఉదా: రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, ఆయిల్ లీకేజీ, పారిశ్రామిక దుర్ఘటనలు. ముఖ్యంగా ఈ విపత్తులు అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నాయి. 20వ శతాబ్దం రెండో అర్ధభాగంలో ప్రపంచవ్యాప్తంగా 200లకు పైగా తీవ్ర విపత్తులు సంభవించాయి. వీటి కారణంగా సుమారు 14 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. పారిశ్రామిక దేశాలతో పోలిస్తే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నష్ట తీవ్రత 20 రెట్లు అధికంగా ఉంది. ప్రాణ నష్టం అధికంగా జరిగిన దేశాల్లో ఆసియా దేశాలు అగ్రభాగాన ఉన్నాయి. 1995 నుంచి 2004 మధ్య ప్రపంచ వ్యాప్తంగా సంభవించిన విపత్తుల తరచుదనం కిందివిధంగా ఉంది. వరదలు - 30 % తుఫాన్లు - 21 % కరవు సంబంధిత విపత్తులు - 19 % మహమ్మారి వ్యాధులు - 15 % భూకంపాలు, సునామీలు - 8 % భూపాతాలు - 4 % అగ్నిపర్వత విస్ఫోటనాలు - 1 % కీటక దాడులు - 1 % హిమసంపాతాలు - 1 % భారతదేశంలోని విశిష్టమైన భౌగోళిక, వాతావరణ, సామాజిక, ఆర్థిక పరిస్థితుల కారణంగా పెద్ద సంఖ్యలో ప్రకృతి, మానవ కారక విపత్తులు సంభ విస్తున్నాయి. గడిచిన 30 ఏళ్ల కాలంలో భారతదేశంలో 431 తీవ్ర విపత్తులు సంభవించాయి. వాటి వల్ల ఆస్తి, ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. ్కట్ఛఠ్ఛ్టిజీౌ గ్ఛిఛ ్ట్చ్టజీట్టజీఛిట ప్రకారం గత 3 దశాబ్దాలలో సంభవించిన ముఖ్యమైన విపత్తుల కారణంగా 1,43,039 మంది ప్రాణాలు కోల్పోగా, 15 కోట్ల మందికిపైగా వీటి ప్రభావానికి గురయ్యారు. ఆస్తులు, ఇతర మౌలిక సౌకర్యాలకు 48 00 కోట్ల అమెరికన్ డాలర్ల నష్టం జరిగింది. భారతదేశంలో ముఖ్యంగా వరదలు, తుఫాన్లు, భూకంపాలు, భూపాతాలు, హిమపాతాలు, కరవు అధికంగా సంభవిస్తున్నాయి. దేశంలోని 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 27 విపత్తు భరితమై ఉన్నాయి. దాదాపు 58.6% భూభాగం భూకంప తాకిడికి, 68% కరవు, 12% భూభాగం (40 మిలియన్ల హెక్టార్లు) వరదలు, 8% భూభాగం (5,700 కి.మీ. తీర ప్రాంతం) తుఫాన్లకు లోనవుతున్నాయి. భారతదేశంలో విపత్తుల స్వభావాలు ప్రపంచంలో అత్యంత విపత్తు ముప్పు కలిగి ఉన్న మొదటి 10 దేశాల్లో భారతదేశం ఒకటి. ఇందుకు అనేక ప్రకృతి, మానవ చర్యలు కారణమవుతున్నాయి. ప్రతికూల భౌగోళిక, శీతోష్ణస్థితి పరిస్థితులు, స్థలాకృతి స్వభావాలు, పర్యావరణ నిమ్నీకరణ, జనాభావృద్ధి, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, అశాస్త్రీయ అభివృద్ధి మొదలైన కారకాలు దేశంలో విపత్తులకు కారణమవుతున్నాయి. వీటివల్ల తీవ్రస్థాయిలో ధన, ప్రాణ నష్టాలు సంభవించడమే కాకుండా దేశంలోని జీవనాధార వ్యవస్థకు అంతరాయం ఏర్పడుతోంది. విపత్తులకు గురయ్యే స్వభావాన్ని బట్టి దేశంలో ఐదు ప్రత్యేక ప్రాంతాలు ఉన్నాయి. అవి... 1. భౌగోళిక విరూప కారకాల వల్ల (ఎౌ్ఛ ఖ్ఛీఛిౌ్టజీఛి ఊ్ఛ్చ్టఠట్ఛట) హిమాలయాలు, వాటిని ఆనుకొని ఉన్న ఒండ్రుమైదానాలు తరచూ భూకంపాలు, భూపాతాలు, జలక్షయం లాంటి విపత్తులకు గురవుతున్నాయి. 2. భారతదేశ ద్వీపకల్ప ప్రాంతం స్థిరమైన భూభాగం అయినప్పటికీ మానవ తప్పిదాల వల్ల అప్పుడప్పుడూ ఇక్కడ జరుగుతూ ఉన్నట్లు కనిపించే భౌగోళిక విరూపక చలనాల వల్ల ఈ ప్రాంతం కూడా ఇటీవల భూకంప ప్రభావానికి లోనవుతోంది. 3. గంగా - సింధూ - బ్రహ్మపుత్రా మైదాన ప్రాంతాలు హిమాలయాలను ఆనుకొని ఉన్నందు వల్ల భూకంపాలకు గురవు తున్నాయి. ఈ నదీ వ్యవస్థల్లో పాత ఒండ్రుమట్టి పేరుకు పోవడం వల్ల తరచూ వరద ముప్పును ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్ మైదాన ప్రాంతాలు ఎక్కువగా ఈ ప్రభావానికి లోనవుతున్నాయి. 4. రాజస్థాన్, గుజరాత్ లాంటి రాష్ట్రాలు ఎడారి శీతోష్ణస్థితి ప్రభావం కారణంగా తరచూ కరవుకు లోనవుతున్నాయి. 5. తూర్పు తీర రాష్ట్రాలన్నీ తరచూ వరదలు, తుఫాన్ల తాకిడికి లోనవుతున్నాయి. 6. మహాసముద్రాల భూతలంపై జరిగే భౌగోళిక విరూపకార చలనాల వల్ల తీర ప్రాంతాలను సునామీలు ముంచెత్తుతున్నాయి. ప్రపంచ బ్యాంకు అధ్యయనం ప్రకారం భారతదేశంలో విపత్తుల కారణంగా ఏటా జీడీపీలో 2% ఆర్థిక నష్టం జరుగుతోంది. దేశంలో 1982 నుంచి 2001 మధ్య సంభవించిన సహజ విపత్తుల వల్ల 1,07,813 మంది ప్రాణా లు కోల్పోయారు. సగటున సంవత్సరానికి 5,390 మరణాలు సంభవించాయి. మానవుడు చేపట్టే అభివృద్ధి పోకడల తీవ్రత పరిమితికి మించి కొనసాగితే ‘ఎల్‌నినో’ లాంటి వా తావరణ మార్పుల తీవ్రత, తరచుదనం పెరిగి భారతదేశంపై కరవు ప్రభావం మరింత ఉధృతమవుతుందని ఐపీసీసీ నివేదిక తెలిపింది. మాదిరి ప్రశ్నలు 1. విపత్తు పదాన్ని ఏ భాషా పదజాలాల నుంచి గ్రహించారు? 1) గ్రీక్ 2) ఫ్రెంచి 3) లాటిన్ 4) పైవన్నీ 2. విపత్తుల నమోదు కార్యక్రమం ఎప్పటి నుంచి ప్రారంభమైనట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి? 1) క్రీ.పూ. 450 2) క్రీ.పూ. 470 3) క్రీ.పూ. 430 4) క్రీ.పూ. 420 3. ఏదైనా భౌగోళిక ప్రాంతంలో విపత్తు సంభ వించినప్పుడు కలిగే మార్పు? 1) ప్రకృతి, సమాజ వనరులు విధ్వంసానికి లోనవుతాయి 2) ధన, ప్రాణ నష్టాలు సంభవిస్తాయి 3) సామాన్య ప్రజల జీవనోపాధి దెబ్బ తింటుంది 4) పైవన్నీ 4. {పపంచవ్యాప్తంగా తుఫాన్ల ప్రభావానికి ఎంతశాతం భూభాగం లోనవుతోంది? 1) 30 % 2) 21 % 3) 19 % 4) 12 % 5. కిందివాటిలో ప్రకృతి వైపరీత్యం ఏది? 1) కరవు 2) యుద్ధం 3) ఉగ్రవాదం 4) పైవన్నీ 6. {పపంచబ్యాంకు నివేదిక ప్రకారం భారతదేశంలో ఏటా విపత్తుల వల్ల సంభవించే నష్టతీవ్రత దేశ జాతీయ ఆదాయంలో ఎంతశాతం ఉంది? 1) 1 2) 2 3) 3 4) 4 7. భారతదేశంలో ఎంతశాతం భూభాగం భూకంప ప్రభావిత ప్రాంతంలో ఉంది? 1) 58 2) 68 3) 48 4)12 8. విపత్తు అంటే ‘ఒక సమాజపు సాధారణ నిర్మాణానికి, కార్యకలాపాలకు అంత రాయం కలిగిస్తూ అకస్మాత్తుగా, తీవ్రంగా సంభవించే ఆపద’ అని నిర్వచించింది? 1) ూ్ఖై 2) గిఏై 3) ప్రపంచ బ్యాంక్ 4) ఏషియన్ బ్యాంక్ 9. {పపంచవ్యాప్తంగా సంభవించే విపత్తుల వల్ల ఏ ప్రాంతాలు అధికంగా నష్టానికి లోనవుతున్నాయి? 1) లాటిన్ అమెరికా దేశాలు 2) ఆఫ్రికా దేశాలు 3) ఆసియా దేశాలు 4) దక్షిణ అమెరికా దేశాలు 10. 1995 నుంచి 2004 మధ్య ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువసార్లు సంభవించిన విపత్తు ఏది? 1) వరదలు 2) తుఫాన్లు 3) కరవు 4) భూకంపాలు 11. గడిచిన 30 ఏళ్లలో ్కట్ఛఠ్ఛ్టిజీౌ గ్ఛిఛ ్ట్చ్టజీట్టజీఛిట ఖ్ఛఞౌట్ట ప్రకారం విపత్తుల వల్ల భారత దేశంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య? 1) 3,20,000 2) 2,20,000 3) 1,90,039 4) 1,43,039 12. Prevention Web Statistics Report ప్రకారం గడిచిన 30 ఏళ్లలో దేశంలో సంభవించిన విపత్తుల వల్ల ఎన్ని కోట్ల అమెరికన్ డాలర్ల నష్టం జరిగింది? 1) 2800 2) 3800 3) 4800 4) 5800 13. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు విపత్తు భరిత ప్రాంతంలో ఉన్నాయి? 1) 25, 2 2) 24, 3 3) 23, 4 4) 27, 2 14. భారతదేశంలో ఎంత భూభాగం తుఫాన్ల ప్రభావిత ప్రాంతంలో ఉంది? 1) 16 % 2) 12 % 3) 8 % 4) 2 % 15. హిమాలయా ప్రాంతాల్లో భూకంపాల తర చుదనం ఎక్కువగా ఉండటానికి కారణం? 1) జలక్రమక్షయం 2) భౌగోళిక విరూపకారక చలనాలు 3) నేల క్రమక్షయం 4) అధిక వర్షపాతం