లండన్: వైద్య చరిత్రలో కొన్ని చిత్రమైన కేసులు అప్పుడప్పుడు నమోదు అవుతుంటాయి. అయితే.. ఇక్కడ మాత్రం విచిత్రమైన కేసు ఒకటి నమోదు అయ్యింది. ఐదేళ్లపాటు చెవులు వినిపించకుండా పోయిన ఓ వ్యక్తి.. ఇప్పుడు సాధారణ స్థితికి వచ్చాడు. అయితే ఆయన చెవిటితననాకి కారణం తెలుసుకుంటే.. విస్తుపోవడం మీ వంతూ అవుతుంది కూడా!.
ఇంగ్లండ్(ఉత్తర) డోర్‌సెట్ వెయ్‌మౌత్‌లో నివాసం ఉండే వాలెస్ లీ గత కొంతకాలంగా వినికిడి సమస్యతో బాధపడుతున్నాడు. ఏవియేషన్ పరిశ్రమలో పని చేయడం వల్లనో, రగ్బీ మ్యాచ్‌ల సమయంలో ప్రమాదవశాత్తూ తగిలిన గాయాల వల్లనో అలా జరిగి ఉంటుందా? అనే అనుమానం పెంచుకున్నారు ఆ 66 ఏళ్ల పెద్దాయన. వినికిడి శక్తి నానాటికీ తగ్గిపోతూ వస్తుండడంతో ఆయన భార్య సైతం ఆందోళన చెందసాగింది. ఈ క్రమంలో..
డాక్టర్‌ను కలిసే ముందు హోం ఎండోస్కోప్ కిట్‌ను కొనుగోలు చేసి.. చెవిని పరీక్షించగా, చెవి లోపల తెల్లగా ఓ చిన్న వస్తువు కనిపించింది. ఆపై ఈఎన్‌టీ స్పెషలిస్ట్‌ను కలిసి ఆ తెల్లటి వస్తువును బయటకు తీసే యత్నం చేశారు. అయితే చెవిలో గులిమి మధ్య అది ఇరుక్కుపోవడంతో బయటకు తీయడం వైద్యులకు కష్టతరంగా మారింది. ఈ క్రమంలో..
ఓ చిన్నిపైపును చెవిలోకి జొప్పించి.. పంపింగ్ ద్వారా ఆ వస్తువును విజయవంతంగా బయటకు రాబట్టగలిగారు. అది బయటకు వచ్చిన మరుక్షణమే ఆ చిట్టిబాబు ప్రతీ సౌండ్‌ను క్లియర్‌గా వినగలిగారట!.
ఐదేళ్ల కిందట.. ఆస్ట్రేలియా ట్రిప్‌కు వెళ్తున్న సమయంలో.. పాత ఇయర్‌బడ్ ముక్క చెవిలోకి దూరి ఉంటుందని ఆయన భావిస్తున్నారు. ఆ టూర్ తర్వాతే ఆయన చెవులు క్రమక్రమంగా వినిపించడం ఆగిపోయిందట!.
Comments
Please login to add a commentAdd a comment