Deafness
-
Silent Village of India: అక్కా చెల్లెళ్ల ‘నిశ్శబ్ద’ విప్లవం
గందోహ్(జమ్మూకశ్మీర్): ఆరోగ్యంగా ఉండి కూడా ఓటేయడానికి బద్ధకించే పౌరులున్న దేశం మనది. అలాంటిది పుట్టుకతోనే చెవుడు, మూగ సమస్యలతో ఇబ్బందులు పడుతూ కూడా ఓటేయడానికి ముందుకొచ్చి మొత్తంగా గ్రామానికే ప్రేరణగా నిలిచిన ముగ్గురు అక్కాచెల్లెళ్ల స్ఫూర్తిదాయక గాథ ఇది. గ్రామంలో సగం కుటుంబాలకు సమస్యలు జమ్మూకశీ్మర్‌లోని డోడా జిల్లాలోని భద్రవాహ్ పట్టణానికి 105 కిలోమీటర్ల దూరంలోని కొండప్రాంతంలో దధ్‌కాయ్ గిరిజన గ్రామం ఉంది. గ్రామంలో కేవలం 105 కుటుంబాలే నివసిస్తున్నాయి. ఇందులో సగానికి పైగా అంటే 55 కుటుంబాలను దశాబ్దాలుగా ఆరోగ్యసమస్యలు చుట్టుముట్టాయి. ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కరైనా మూగ, చెవిటివారిగా మిగిలిపోతున్నారు. ఇలా గ్రామంలో 84 మంది ఉన్నారు. వారిలో 43 మంది మహిళలు, పదేళ్లలోపు 14 మంది చిన్నారులు ఉన్నారు. ఎక్కువ మంది మాట్లాడలేని కారణంగా ఈ గ్రామానికి సైలెంట్ విలేజ్ ఆఫ్ ఇండియా అనే పేరు పడిపోయింది. రేహమ్ అలీ ముగ్గురు కూతుళ్లు రేష్మా బానో(24), పరీ్వన్ కౌసర్(22), సైరా ఖాటూన్(20)లకూ ఏమీ వినిపించదు. మాట్లాడలేరు కూడా. అయితే ఓటేసి తమ హక్కును వినియోగించుకోవాలనే కోరిన ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లలో బలంగా నాటుకుపోయింది. ఈసారి ఎలాగైనా ఓటేస్తామని ముగ్గురూ ఘంటాపథంగా చెబుతున్నారు. వీళ్లు ఓటేస్తుండటం ఇదే తొలిసారికావడం విశేషం. బీజేపీ నేత జితేంద్రసింగ్ పోటీచేస్తున్న ఉధమ్‌పూర్ ఎంపీ నియోజకవర్గం పరిధిలోనే ఈ గ్రామం ఉంది. శుక్రవారం జరగబోయే పోలింగ్‌లో ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నామని తమ ఊరికొచి్చన మీడియా వాళ్లకు ఈ అక్కాచెల్లెళ్లు తమ ఓటర్ ఐడీ కార్డులు చూపించిమరీ చెబుతున్నారు. ‘ మొదటిసారిగా ఓటేయనున్న మ్యూట్ మహిళల ఉత్సాహం ఊరి జనం మొత్తానికి స్ఫూర్తినిస్తోంది’ అని పొరుగింటి వ్యక్తి జమాత్ దానిష్ ఆనందం వ్యక్తంచేశారు. ‘‘ ఔత్సాహిత యువ మహిళా ఓటర్లను చూసి మొత్తం గ్రామమే గర్వపడుతోంది. ప్రతి ఇంట్లో ఇదే చర్చ. ఈ సారి ఇక్కడ 100 శాతం పోలింగ్ నమోదైనా ఆశ్చర్యపోనక్కర్లేదు ’’ అని గ్రామ మాజీ వార్డు సభ్యుడు మొహమ్మద్ రఫీఖ్ వ్యాఖ్యానించారు. -
ఐదేళ్ల తర్వాత.. ఈ చిట్టిబాబుకు చెవులొచ్చాయ్!
లండన్: వైద్య చరిత్రలో కొన్ని చిత్రమైన కేసులు అప్పుడప్పుడు నమోదు అవుతుంటాయి. అయితే.. ఇక్కడ మాత్రం విచిత్రమైన కేసు ఒకటి నమోదు అయ్యింది. ఐదేళ్లపాటు చెవులు వినిపించకుండా పోయిన ఓ వ్యక్తి.. ఇప్పుడు సాధారణ స్థితికి వచ్చాడు. అయితే ఆయన చెవిటితననాకి కారణం తెలుసుకుంటే.. విస్తుపోవడం మీ వంతూ అవుతుంది కూడా!. ఇంగ్లండ్(ఉత్తర) డోర్సెట్ వెయ్మౌత్లో నివాసం ఉండే వాలెస్ లీ గత కొంతకాలంగా వినికిడి సమస్యతో బాధపడుతున్నాడు. ఏవియేషన్ పరిశ్రమలో పని చేయడం వల్లనో, రగ్బీ మ్యాచ్‌ల సమయంలో ప్రమాదవశాత్తూ తగిలిన గాయాల వల్లనో అలా జరిగి ఉంటుందా? అనే అనుమానం పెంచుకున్నారు ఆ 66 ఏళ్ల పెద్దాయన. వినికిడి శక్తి నానాటికీ తగ్గిపోతూ వస్తుండడంతో ఆయన భార్య సైతం ఆందోళన చెందసాగింది. ఈ క్రమంలో.. డాక్టర్‌ను కలిసే ముందు హోం ఎండోస్కోప్ కిట్‌ను కొనుగోలు చేసి.. చెవిని పరీక్షించగా, చెవి లోపల తెల్లగా ఓ చిన్న వస్తువు కనిపించింది. ఆపై ఈఎన్టీ స్పెషలిస్ట్‌ను కలిసి ఆ తెల్లటి వస్తువును బయటకు తీసే యత్నం చేశారు. అయితే చెవిలో గులిమి మధ్య అది ఇరుక్కుపోవడంతో బయటకు తీయడం వైద్యులకు కష్టతరంగా మారింది. ఈ క్రమంలో.. ఓ చిన్నిపైపును చెవిలోకి జొప్పించి.. పంపింగ్ ద్వారా ఆ వస్తువును విజయవంతంగా బయటకు రాబట్టగలిగారు. అది బయటకు వచ్చిన మరుక్షణమే ఆ చిట్టిబాబు ప్రతీ సౌండ్‌ను క్లియర్‌గా వినగలిగారట!. ఐదేళ్ల కిందట.. ఆస్ట్రేలియా ట్రిప్‌కు వెళ్తున్న సమయంలో.. పాత ఇయర్‌బడ్ ముక్క చెవిలోకి దూరి ఉంటుందని ఆయన భావిస్తున్నారు. ఆ టూర్ తర్వాతే ఆయన చెవులు క్రమక్రమంగా వినిపించడం ఆగిపోయిందట!. -
భావోద్వేగ క్షణం: 35 ఏళ్ల తర్వాత తొలిసారిగా అమ్మగొంతు విని....
ఒక్కక్షణం నిశబ్దం చాలా భరించలేని విధంగా ఉంటుంది. అలాగని గందరగోళంగా ఉన్నా భరించలేం. కానీ కొంతమంది పుట్టుకతో వినపడని వాళ్లు ఉంటారు. వాళ్లు ఆ నిశబ్దాన్నిఎలా భరించగలుగుతారో తెలియదు. ఆ నిశబ్దం కారణంగా వారు ఏమి గ్రహించలేక మాటలు కూడా నేర్చుకోవడం అసాధ్యంగా ఉంటుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఇక్కడొక వ్యక్తి చిన్నప్పుడే ఒక ఆరోగ్య సమస్యతో వినికిడి శక్తిని కోల్పోయాడు. అలాంటి వ్యక్తి తొలిసారిగా తన తల్లి గొంతు వినగానే ఒక్కసారిగా భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నాడు. వివరాల్లోకెళ్తే...ఎడ్వర్డో అనే వ్యక్తి మెనింజైటిస్ అనే వ్యాధి కారణంగా వినకిడి శక్తిని కోల్పోయాడు. దీంతో అతను దశాబ్దాలుగా నిశబ్దంలోనే గడిపాడు. ఎట్టకేలకు నిశబ్దాన్ని చీల్చుకుని ఒక చిన్న మైనర్ సర్జరీ తదనంతరం తొలిసారిగా తల్లి గొంతును విన్నాడు. 35 ఏళ్ల నిశబ్ద అనంతరం తొలిసారిగా తన అమ్మ గొంతు విని ఒక్కసారిగా భావోద్వేగంతో కళ్లు చెమ్మగిల్లాయి. ఈ మేరకు ఎడ్వర్డో తల్లి తన పక్కనే కూర్చిని పదేపదే తన కొడుకును పేరుతో పిలిస్తూ ఏడ్చేసింది. అక్కడే ఉన్న మిగతా బంధువులంతా ఆ అద్భుత క్షణాన్ని చూస్తూ భావోద్వేగం చెందారు. సదరు వ్యక్తి తన చెవులు వినిపిస్తున్నందుకు ఆనందంతో తన కూతురు సంతోషంతో ఆలింగనం చేసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఎడ్వర్డో అమ్మ మీతో మాట్లాడుతోందని ఒకరు, ఇది హార్ట్ టచ్ చేసే ఘటన అని మరోకరు రకరకాలుగా కామెంట్ చేస్తూ ట్వీట్ చేశారు. View this post on Instagram A post shared by Good News Movement (@goodnews_movement) (చదవండి: ట్రైయిన్‌లో టీ ఇలానా వేడి చేసేది! బాబోయ్...) -
ఆరోగ్య శ్రీ తో వినికిడి వరాన్ని పొందిన చిన్నారులు
-
చెవుడే శాపమైంది
కర్నూలు ,మహానంది: పుట్టుకతో వచ్చిన చెవుడు ఓ యువతికి శాపమైంది. తన అంగవైకల్యంపై ఇరుగుపొరుగు వారి సూటిపోటు మాటలకు జీవితంపై విరక్తి చెంది ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. గాజులపల్లెలో సోమవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. మహానంది పోలీసులు తెలిపిన వివరాల మేరకు... గాజులపల్లెకు చెందిన షేక్ ఖాజాహుసేన్‌కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వీరిలో షేక్ కరిష్మా(16)కు చిన్నప్పటి నుంచి చెవుడు ఉంది. ఈ లోపాన్ని ప్రతి ఒక్కరూ పదేపదే గుర్తు చేస్తూ మాట్లాడుతుండటంతో కుంగిపోయేది. చివరకు జీవితంపై విరక్తి చెంది ఆదివారం రాత్రి ఎలుకల మందు తాగింది. తర్వాత వాంతులు చేసుకుంటుండగా గమనించిన తల్లిదండ్రులు స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి రెఫర్ చేశారు. తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందింది. ఈ మేరకు యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మహానంది ఎస్ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. -
చెవుడుకి త్రీడీ ప్రింటర్‌తో చెక్!
చెవుల్లోపల ఒస్సికల్స్ అని మూడు చిన్న చిన్న ఎముకలుంటాయి. ఇవి శబ్దాల ద్వారా పుట్టే ప్రకంపనలను కర్ణభేరి నుంచి కాక్లియా ఇయర్ డ్రమ్ నుంచి కాక్లియాకు ప్రసారం చేస్తాయి. ఏ కారణం చేతనైనా ఇవి దెబ్బతింటే బధిరత్వం వచ్చేస్తుంది. అయితే త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ పుణ్యమా అని ఇప్పుడు ఈ పరిస్థితి మారనుంది. ఇప్పటివరకూ ఈ మూడు చిన్న ఎముకల స్థానంలో ఉక్కు లేదా పింగాణి భాగాలను అమర్చడం ద్వారా చికిత్స అందిస్తున్నా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. ఈ కృత్రిమ భాగాలు తగిన సైజులో లేకపోవడం దీనికి కారణం. ఈ నేపథ్యంలో మేరీల్యాండ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ ఒస్సికల్స్ను నేరుగా త్రీడీ ప్రింటర్ ద్వారా తయారు చేసేందుకు ప్రయత్నించారు. మృతదేహాల నుంచి సేకరించిన మూడు ఒస్సికల్ ఎముకలను సీటీ స్కాన్ ద్వారా ఫొటో తీశారు. ఆ స్కాన్లను ఓ చౌక త్రీడీ ప్రింటర్ ద్వారా రెజిన్ పదార్థంతో ముద్రించారు. ఎముకలను సేకరించిన మృతదేహాలకు వీటిని కచ్చితంగా అమర్చగలిగారు. దీంతో ఉక్కు, పింగాణీ పదార్థాలతో కాకుండా.. మన శరీరానికి సరిపడే ఇతర పదార్థాలతో వీటిని త్రీడీ ప్రింటర్ ద్వారా ముద్రించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒక్కో వ్యక్తి శారీరక నిర్మాణానికి అనుగుణంగా కచ్చితమైన ఆకారంలో ముద్రించే వీలు ఉండటం వల్ల సమీప భవిష్యత్తులో ఈ రకమైన బధిరత్వ సమస్యను సులువుగా అధిగమించే వీలేర్పడుతుందని అంచనా. -
ముంబైపై శబ్ద‘భేరీ’..!
సాక్షి, ముంబై : కాలుష్యపు కోరల్లో చిక్కుకుని నగరం విలవిల్లాడుతోంది. ముఖ్యంగా విపరీతంగా పెరిగిన ధ్వని కాలుష్యం వల్ల చెవుడు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరించారు. దీంతో తేరుకున్న మహానగర పాలక సంస్థ (బీఎంసీ) నగరంలో కీలకమైన 1,200 చోట్ల ధ్వని కాలుష్యాన్ని నియంత్రించే ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. కానీ ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు ఏ కంపెనీ బీఎంసీకి దొరకడం లేదు. పరిపాలన విభాగం ఆందోళనలో పడిపోయింది. రోజురోజుకూ అనేక రకాల కాలుష్యాలతోపాటు ధ్వని కాలుష్యం పెరిగిపోవడంతో ప్రజలు, వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. సెలైన్స్ జోన్‌లోనూ యథాతథం నగరంలో విద్యా సంస్థలు, ప్రార్థన మందిరాలు, ఆస్పత్రులున్న ప్రాంతాలను రెండు సంవత్సరాల కిందట హై కోర్టు ‘సెలైన్స్ జోన్’ గా ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో పరిస్థితులు యథాతథంగా ఉన్నాయి. కొన్ని సార్వజనిక ఉత్సవాలను నియంత్రించారు. వాహనాల నుంచి వెలువడే ధ్వని కాలుష్యం ఏ మాత్రం తగ్గలేదు. నియమాల ప్రకారం సెలైన్స్ జోన్ ప్రకటించిన ప్రాంతాలు ప్రశాంతంగా ఉండాలి. అందుకు నగరంలో అధ్యయనం చేయగా 1,200 చోట్ల ధ్వని కాలుష్యన్ని కచ్చితంగా నియంత్రించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకు ఉపాయాన్ని ఆలోచించేందుకు సలహాదారుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు బీఎంసీ డిప్యూటీ కమిషనర్ ప్రకాశ్ పాటిల్ చెప్పారు. రెండు సార్లు టెండర్లను ఆహ్వానించినప్పటికీ ఒక్క కంపెనీ కూడా ఆసక్తి కనబర్చ లేదు. ఎమ్మెమ్మార్డీయే ఆధ్వర్యంలో.. ముంబై ప్రాంతీయ అభివృద్థి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) కొద్ది రోజుల కిందట పవయి. బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) పరిసరాల్లో ధ్వని కాలుష్య నియంత్రణ పరికరాలు ఏర్పాటు చేసింది. అప్పట్లో ధ్వని కాలుష్యాన్ని నియంత్రించేందుకు విద్యా సంస్థలు, ప్రార్థన మందిరాలు, ఆస్పత్రులున్న ప్రాంతాల్లో వేగ నియంత్రణ (స్పీడ్ బ్రేకర్స్) ఏర్పాటు చేసింది. వీటివల్ల కొంత శాతమే నియంత్రించగలిగారు. పూర్తగా అరికట్టేందుకు బీఎంసీ ప్రయత్నాలు ప్రారంభించింది. నగరంలో ఏర్పాటు చేసేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పెరిగిన వాహనాల సంఖ్య నగరంలో విపరీతంగా పెరిగిపోయిన వాహనాల సంఖ్యవల్ల ధ్వని కాలుష్యం కూడా పెద్ద ఎత్తున పెరిగిపోయింది. అస్పత్రులున్న చోట వాహనాలకు అనుమతివ్వక పోవడం, కొన్ని కీలకమైన రహదారులపై భారీ వాహనాలకు నిషేధించడం, నో హార్న్ జోన్‌గా ప్రకటించడం లాంటి ప్రయత్నాలు చేసింది. అవికూడా అనుకున్నంతమేర ఫలితాలివ్వలేకపోయాయి. త్వరలో నియమించనున్న సలహదారుల కమిటీ సూచనల ప్రకారం స్వయంగా ఆ ప్రాజెక్టు చేపట్టాలని యోచిస్తున్నట్లు పాటిల్ చెప్పారు.