సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఢిల్లీ యూనివర్సిటీలో ఆకస్మికంగా పర్యటించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఢిల్లీ యూనివర్సిటీ కూడా ప్రోటోకాల్ పాటించకుండా ఇలా సడెన్‌గా యూనివర్సిటీలో పర్యటించడం కరెక్ట్ కాదని నోటీసులు పంపుతామని హెచ్చరింది. అన్నట్లుగానే ఢిల్లీ యూనివర్సిటీ రాహుల్ గాంధీకి బుధవారం నోటీసులు పంపించింది. జెడ్‌ప్లస్ భద్రతతో ఓ జాతీయ పార్టీ నాయకుడి హోదాలో ఉన్న రాహుల్‌కి ఇది తన స్థాయికి తగ్గ పని కాదని చురకలంటిస్తూ..రెండు పేజీల నోటీసులు జారీ చేసింది.
ఈ సంఘటనను అతిక్రమణ, బాధ్యతరాహిత్యమైన ప్రవర్తనగా పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించింది. ఆ నోటీసులో హాస్టల్ ప్రవేశ నిర్దేశిత నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంది. ఏ నాయకుడు యూనివర్సిటీలో మూడు వాహానాలతో యూనివర్సిటీలోకి ప్రవేశించేటప్పుడు ఆ నిబంధనలను అనుసరించాలని తెలిపింది. అలాగే హాస్టల్ ప్రాంగణంలో అకడమిక్ అండ్ రెసిడెంట్స్ కౌన్సిల్ కార్యకలాపాల్లో తప్ప మరే ఏ ఇతర కార్యకలాపాల్లో పాల్లొనకూడదని పేర్కొంది.
హాస్టల్ యూనివర్సిట్ ఆఫ్ ఢిల్లీ చట్టం ప్రకారం కొన్ని కార్యకలాపాల్లో పాల్గొనేందుకు దానికంటూ కొన్ని నియమ, నిబంధనలు ఉంటాయని తెలిపింది. నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా జరిగే ఏ కార్యక్రమాన్నైనా ఆపే హక్కు మాకు ఉందన్నారు. ఇది హాస్టల్ హ్యాండ్ బుక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రూల్‌కి సంబంధించిన క్రమశిక్షణలో భాగమని తెలిపారు. హాస్టల్ మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్, ఇతర సభ్యులు దీన్ని బాధ్యతరాహిత్యమైన చర్యగా పేర్కొంటూ తీవ్రంగా ఖండిస్తున్నామని నోటీసులో పేర్కొంది.
అలాగే ఇలాంటి చర్య హాస్టలోని విద్యార్థుల భద్రతకు ప్రమాదం కలిగిస్తుందని, అందువల్ల ఇలాంటి ఆకస్మిక చర్యలను మానుకోవాలని రాహుల్‌కి సూచిస్తూ యూనివర్సిటీ నోటీసులో పేర్కొంది. ఇదిలా ఉండగా గత శుక్రవారం రాహుల్ గాంధీ ఢిల్లీ యూనివర్సిటీలో మెన్స్ పురుషుల హాస్టల్‌ని సందర్శించి..అక్కడ వారితో సంభాషించడమే గాక కలిసి భోజనం చేశారు. ఇదికాస్త సీరియస్ అంశంగా మారీ డీల్లీ యూనివర్సిటీ అధికారులు ఫైర్ అవ్వుతూ నోటీసులు పంపేందుకు దారితీసింది.
(చదవండి: ఢిల్లీ యూనివర్సిటీలో రాహుల్ ఆకస్మిక పర్యటన! నోటీసులు పంపుతామని వార్నింగ్)
Comments
Please login to add a commentAdd a comment