
జకార్తా: ఇండోనేసియాలోని సుమత్రా దీవిలో ఆకస్మికంగా కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా 37 మంది మృతి చెందగా మరో 18 మంది వరకు కనిపించకుండా పోయారు. మరాపి అగ్నిపర్వతం నుంచి రాళ్లు, లావా కలిసి కొండచరియలు విరిగిపడ్డాయి.
దీనికి తోడు, శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలతో ఎగువ నుంచి వచ్చిన బురద ప్రవాహం నాలుగు జిల్లాల పరిధిలోని నివాసప్రాంతాలను తుడిచిపెట్టింది. వందకు పైగా నివాసాలు, భవనాలు వరదలో మునిగిపోయాయి. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను చేపట్టినట్లు అధికార యంత్రాంగం తెలిపింది.