పోలీసుల ఆకస్మిక తనిఖీలు
పెద్దాపురం : జిలాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పెద్దాపు రం ఎన్టీఆర్‌నగర్, రామచంద్రపురం మండలం ఉట్రుమి ల్లిలోని సదాశివ కాలనీ తదితర చోట్ల విస్తృత తనిఖీ చేశారు. పోలీసు అధికారులు సహా సుమారు 50 మంది ఒక్కసారిగా పెద్దాపురం ఎన్టీఆర్‌నగర్ కాలనీని చుట్టుముట్టారు. కార్డెన్ సెర్చ్ పేరుతో ప్రతి ఇంటిలో సోదాలు చేశారు. డీఎస్పీ రాజశేఖర్ ఆధ్వర్యంలో సీఐ ప్రసన్న వీరయగౌడ్, ఎస్సైలు ప్రతి ఇంటిలో కుటుంబ సభ్యులు, యజమానుల వివరాలను తెలుసుకున్నారు. ఈ కాలనీలో వ్యభిచారం చేస్తున్నారని, గుర్తు తెలియని వ్యక్తులు అద్దె ఇళ్లల్లో ఉంటున్నారన్న ఫిర్యాదులు వచ్చాయని డీఎస్పీ రాజశేఖర్ తెలిపారు. అనుమానాస్పద వ్యక్తుల సమాచారం తెలియజేయాలని కాలనీవాసులను కోరారు. ఎస్సైలు వై.సతీష్, మురళీకృష్ణ, వి.సత్యనారాయణ, లక్ష్మీకాంతం పాల్గొన్నారు.
అదుపులో ముగ్గురు వ్యక్తులు...
ఎన్టీఆర్ నగర్‌లో నిర్వహించిన తనిఖీల్లో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పెద్దాపురం ఎస్సై వై.సతీష్ తెలిపారు. మూడు ఆటోలు, నాలుగు బైక్‌లను స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టణంలో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే 94409 04846కు సమాచారం ఇవ్వాలని కోరారు.