
ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాతృమూర్తి బుల్లెమ్మ(80)
దమ్మపేట: అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాతృమూర్తి బుల్లెమ్మ(80) గురువారం పశ్చిమగోదావరి జిల్లా టీ నర్సాపురం మండలం మర్రిగూడెంలోగల చిన్న కుమారుడు చిన్న వెంకటేశ్వర్లు స్వగృహంలో గురువారం మృతిచెందారు. ఆమె కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. గురువారం మర్రిగూడెం తన చిన్నకుమారుడు చిన్న వెంకటేశ్వర్లు నివాసంలో తుది శ్వాస విడిచారు. తాటి వెంకటేశ్వర్లును రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫోన్‌లో పరామర్శించారు.