
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ప్రభుత్వ యంత్రాంగం విశాఖకు తరలివచ్చే ప్రక్రియ వేగవంతమవు తోంది. మునిసిపల్, ఆర్థిక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శులతో కూడిన అధికారుల బృందం వైజాగ్‌లో పర్యటిస్తోంది. సీఎం కార్యాలయంతో పాటు ఇతర కార్యాలయాలకు అవ సరమైన భవనాలు, అధికారుల వసతి కోసం అనువైన స్థలాలను ఈ బృందం పరి లించనున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే ఆయా శాఖల అధికారులు ఎంపిక చేసిన స్థలాలను పరిశీలించి.. అనువుగా ఉంటే ఓకే చేసేందుకు అధికా రుల కమిటీ కసరత్తు మొదలెట్టినట్టు సమా చారం. దీనికనుగుణంగా జిల్లా యంత్రాంగంతో సోమవారం సమావేశమైన కమిటీ.. ఖాళీ గా ఉన్న భవనాల వివరాలు సేకరించింది.
Comments
Please login to add a commentAdd a comment