
సాక్షి, విశాఖ: విశాఖ జిల్లాలోని రుషికొండలో పులి సంచారం కలకలం రేపుతోంది. ఓ కేసు దర్యాప్తుకు సంబంధించి పోలీసులు రుషికొండలోని లేఔట్ కు వెళ్లారు. నిందితుల కోసం అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్‌లను పరిశీలించిన పోలీసులకు నేరస్థులకు బదులు పులి కదలికలు కనిపించాయి.
ఫుటేజ్‌లో కనిపించిన పులి ఆహారం కోసం పరిసరాలలో వెతుకులాడుతున్నట్టు పోలీసులు గుర్తించి వెనుదిరిగారు. పులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురి అవుతున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు పులి జాడ కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment