న్యూఢిల్లీ: రుషికొండ కేసులో ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు ఎదురు దెబ్బ తగిలింది. రుషికొండ కేసులో దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రతి ఇంచు జాగాకు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఎలా అని ప్రశ్నించింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై తాము జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు తెలిపింది.
ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చేవరకూ వేచి చూడాలని పిటిషనర్‌కు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. రుషికొండలో రెండు కిలోమీటర్ల వరకు తవ్వకాలు జరిపారని సుప్రీంకోర్టుకు రఘురామకృష్ణరాజు న్యాయవాది ఫోటోలు ఇవ్వగా, జోక్యం చేసుకునేందుకు అత్యున్నత స్యాయస్థానం ఆసక్తి చూపలేదు.
అభివృద్ధి - పర్యావరణం మధ్య సమతుల్యత పాటిస్తూ ముందుకు వెళ్లాలని గతంలోనే సుప్రీంకోర్టు సూచించింది. అభివృద్ధి కూడా అవసరమేనని గతంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment