శుభాకాంక్షలు తెలుపుతున్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డి
సాక్షి, కొమ్మాది (భీమిలి)/ విశాఖ స్పోర్ట్స్: రాష్ట్ర వ్యాప్తంగా 110 జలక్రీడ ప్రాంతాలను గుర్తించినట్టు రాష్ట్ర శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తెలిపారు. క్రీడలను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా ఆయన విశాఖ రుషికొండలోని యాటింగ్ సెంటర్‌ను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని నదులు, సముద్రంలో 110 ప్రాంతాలు జల క్రీడలు నిర్వహించేందుకు అనుకూలంగా ఉన్నాయన్నారు.
అనంతరం ఆయన లైవ్ అడ్వంచర్ డైరెక్టర్ బలరామ్‌నాయుడుతో కలసి సముద్రంలో 30 అడుగుల లోతు వరకు స్కూబా డైవ్ చేశారు. ఈనెల 21న సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా సముద్ర గర్భంలోకి వెళ్లి అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే సీఎం సార్ అంటూ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
Byreddy Siddharth Reddy's special birthday wishes to CM YS Jagan garu 🔥🔥#CMYSJagan pic.twitter.com/twqNJVYsGK
— Manvitha (𝕾𝖚𝖒𝖆) (@ManviDad) December 19, 2021
సీఎం కప్ బాక్సింగ్ టోర్నీ ప్రారంభం
విశాఖలోని వైఎంసీఏ వద్ద ఆదివారం సీఎం కప్ స్టేట్ సీనియర్స్, యూత్ మెన్, ఉమెన్ బాక్సింగ్ టోర్నీ ప్రారంభమైంది. తొలి బౌట్‌ను బైరెడ్డి సిద్దార్థరెడ్డి ప్రారంభించారు. మూడు రోజుల పాటు ఈ పోటీలు కొనసాగనున్నాయి. కార్యక్రమంలో ఏపీ బాక్సింగ్ సంఘం అధ్యక్షుడు కాయల వెంకటరెడ్డి, జీసీసీ చైర్‌పర్సన్ స్వాతిరాణి, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, 13 జిల్లాల బాక్సర్లు పాల్గొన్నారు.
చదవండి: (సినిమా టికెట్ల ఆన్‌లైన్ విక్రయాలకు ప్రత్యేక వ్యవస్థ)
Comments
Please login to add a commentAdd a comment