స్కూబా డైవింగ్‌లో పదేళ్ల చిన్నారి విశాఖ వేదికగా సరికొత్త రికార్డు నమోదు చేసింది. చిచ్చరపిడుగు దేబప్రియ రుషికొండ సముద్ర జలాల్లో 35 అడుగుల లోతులో స్కూబా డైవింగ్ చేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. సముద్రగర్భంలో స్కూబా డైవింగ్ చేసిన ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది. మొదటి డైవ్‌ని 40 నిమిషాల పాటు సముద్రంలో కొనసాగించిన దేబప్రియ.. రెండో డైవ్‌ని మరో 5 నిమిషాలు అదనంగా సాగర జలాల్లో కలియతిరుగుతూ 45 నిమిషాల పాటు కొనసాగించింది.
ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆఫ్ డైవింగ్ ఇన్‌స్ట్రక్టర్ బలరాం సారథ్యంలో చిన్నారి దేబప్రియ ఈ సాహస రికార్డుని నెలకొల్పింది. ఈ సందర్భంగా దేబప్రియకు ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆఫ్ డైవింగ్ ఇన్‌స్ట్రక్టర్స్ (పాడీ) ప్రతినిధుల బృందం అభినందనలు తెలిపింది. తన పదో పుట్టిన రోజునే చిన్నారి ఈ రికార్డు సృష్టించడం కొసమెరుపు.
చదవండి: (సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్: వీటిపైనే నిషేధం)
Comments
Please login to add a commentAdd a comment