సాక్షి, చెన్నై: డీఎండీకేతో పొత్తుకు తాను ఎదురు చూపు ల్లో ఉన్నట్టు డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ అన్నారు. విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకేను రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ వైపుకు తిప్పుకునేందుకు డిఎం కే తీవ్రంగానే ప్రయత్నిస్తున్నది. ఈ పరిస్థితుల్లో రెండు రోజుల క్రితం మేఘదాతులో డ్యాంల నిర్మాణం అడ్డుకట్ట నినాదంతో డిఎంకే అధినేత కరుణానిధిని విజయకాంత్ కలుసుకున్నారు. ఈ భేటీ అనంతరం కరుణానిధి పరోక్ష వ్యాఖ్య చేశారు. డీఎండీకేను తమ వైపుకు తిప్పుకునేలా ఇది కూటమిగా ఆవిర్భవిస్తే బాగుంటుం దన్నట్టు స్పందించారు. ఇందుకు విజయకాంత్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
అదే సమయంలో విజయకాంత్ ఢిల్లీలో బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులతో మంతనాల్లో మునగడం చర్చకు దారి తీసింది. దీంతో డీఎండీకే ఎవరితో పొత్తు అన్నట్టుగా రాష్ర్టంలో ప్రచారం బయలు దేరి ఉన్నది. ఈ విషయంగా డిఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ ఓ మీడియాతో మాట్లాడుతూ స్పందించారు. ఎదురు చూపుల్లో : సినీ నటుడిగా ఉన్న సమయంలో డిఎంకే అధినేత కరుణానిధితో విజయకాంత్ సన్నిహితంగా ఉండే వారని గుర్తు చేశారు. విజయకాంత్ వివాహం కరుణానిధి అధ్యక్షతన, దివంగత నేత మూపనార్ నేతృత్వంలో జరిగిందని వివరించారు.
కరుణానిధిని ఓ వేడుకకు ఆహ్వానించిన విజయకాంత్ అతి విలువైన కానుకను ఇచ్చారని, అది నేటికి డిఎంకే ట్రెజరీలో ఉందని పేర్కొన్నారు. విజయకాంత్‌ను తాను సోదరిగా భావించి గౌరవిస్తానన్నారు. తామిద్దరం పలు సందర్భాల్లో ఎదురు పడ్డప్పుడల్లా తప్పని సరిగా మాట్లాడుకోవడం జరిగిందని కొన్ని సంఘటనలను గుర్తు చేశారు. సోదరుడు, స్నేహపూర్వకంగా మెలగాలని ఎదురు చూస్తున్నామని పేర్కొంటూ, డిఎంకే కూటమిలోకి డీఎంకే రావాలన్న ఆకాంక్ష తనకు ఉందన్నారు. ఆ ఎదురు చూపుల్లోనే ఉన్నాం అని, తరచూ ఎదురు అవతున్న హఠాత్ సంఘటనల పలకరింపు వలే, ఆ పొత్తు సాధ్యం కావాలని ఎదురు చూస్తున్నట్టు పేర్కొన్నారు.
పొత్తుకు ఎదురు చూపు
Published Fri, May 1 2015 2:45 AM | Last Updated on Sun, Sep 3 2017 1:10 AM
Advertisement
Advertisement