‘మాపై డీఎండీకే ప్రభావం ఉండదు’ | 'DMDK has no effect on us' | Sakshi
Sakshi News home page

‘మాపై డీఎండీకే ప్రభావం ఉండదు’

Published Fri, May 13 2016 2:50 AM | Last Updated on Sun, Sep 3 2017 11:57 PM

‘మాపై డీఎండీకే ప్రభావం ఉండదు’

‘మాపై డీఎండీకే ప్రభావం ఉండదు’

చెన్నై: తమ విజయావకాశాలపై సినీనటుడు విజయ్‌కాంత్ నేతృత్వంలోని డీఎండీకే, బీజేపీ కూటమి ప్రభావం ఏమీ ఉండబోదని డీఎంకే చీఫ్ కరుణానిధి విశ్వాసం వ్యక్తం చేశారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు. ఈ నెల 16న తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మహా అయితే ఆ కూటమి ఏఐడీఎంకే ఓట్లను కొల్లగొట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. 1957 నుంచి వరుసగా 12 అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొంటూ వస్తున్న కరుణానిధి ఈసారి ఎన్నికలను కూడా ఎదుర్కొంటున్నారు. ఈ ఎన్నికలు విభిన్నమైన పరిస్థితికి అద్దం పడుతున్నాయని, కొన్ని పార్టీలైతే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాలను కూడా ప్రకటించాయని ఆయన పేర్కొన్నారు.

ఆయా పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే అవకాశంలేదని, కాకపోతే వారి ప్రభావం అధికార పార్టీ అవకాశాలను దెబ్బతీయవచ్చన్నారు. కాషాయ పార్టీకి తమిళనాడులో చోటు లేదని అభిప్రాయపడ్డారు. సంపూర్ణ మద్య నిషేధంపై జయలలిత ఇచ్చిన హామీని ప్రజలు నమ్మబోరన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement