ఆరోగ్యంగానే ఉన్నాను
పుకార్లు నమ్మొద్దు {పజా సంక్షేమ కూటమి
విజయకాంత్ స్పష్టీకరణ
చీలిక ఎవరి తరం కాదన్న ప్రేమలత
వామపక్షాల వద్దకు వైగో, తిరుమా పరుగు
ఒకే వేదిక మీదుగా అభ్యర్థుల జాబితా
చెన్నై : ప్రజా సంక్షేమ కూటమికి వ్యతిరేకంగా సాగుతున్న ప్రచారాలు, పుకార్లను నమ్మకండి అని తమ కేడర్‌కు ఆ కూటమి నేతలు సూచించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానంటూ డీఎండీకే అధినేత విజయకాంత్ స్పష్టం చేశారు. ఈ కూటమిని చీల్చడం ఎవరి తరం కాదని ప్రేమలత విజయకాంత్ వ్యాఖ్యానించారు. ఇక, కూటమి పేరు వ్యవహారంలో వామపక్షాల భిన్న స్వరంతో ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమా పరుగులతో బుజ్జగింపులు సాగించి ఉన్నారు. డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా డీఎండీకే, ఎండీఎంకే, వీసీకే, వామపక్షాల నేతృత్వంలో ఏర్పాటైన కూటమిపై రోజుకో మలుపులతో చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో కూటమి పేరు వ్యవహారంలో ఆదివారం వామపక్షాలు, ఎండీఎంకే, వీసీకేల మధ్య భిన్న స్వరాలు బయలు దేరాయి. అలాగే, డీఎండీకే అధినేత, సీఎం అభ్యర్థి విజయకాంత్ అనారోగ్యం పేరుతో సింగపూర్ పయన సమాచారం చర్చకు దారి తీశాయి. ఇక, మరెన్ని ట్విస్టులతో ఈ కూటమి పయనం సాగనుందో అన్న ప్రశ్న బయలు దేరింది.
కెప్టెన్ టీం అన్న పేరుకు వ్యతిరేకంగా వామపక్షాల వ్యాఖ్యలతో ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్ మేల్కొన్నట్టున్నారు. ఆగమేఘాలపై ఈ ఇద్దరు నేతలు సీపీఎం కార్యాలయంలో ప్రత్యక్షం అయ్యారు. సీపీఎం నేత జి రామకృష్ణన్, సీపీఐ నేత ముత్తరసన్‌లను బుజ్జగించడంతో పాటుగా సీట్ల పందేరంలో సమయానుకూలంగా సర్దుకుందామన్న హామీని ఇచ్చి ఉన్నారు. దీంతో కూటమిపై వస్తున్న వదంతులు నమ్మ వద్దంటూ కేడర్‌కు నాయకులు సూచించే పనిలో పడ్డారు. ఇక, తమ కూటమిని చీల్చే యత్నం సాగుతున్నదని, ఇందుకు మీడియా కూడా వంత పాడుతున్నట్టుగా నాయకులు పల్లవిని అందుకోవడం గమనార్హం. ఇక, తన ఆరోగ్యంపై వచ్చిన వార్తలను డీఎండీకే అధినేత విజయకాంత్ తీవ్రంగా ఖండించారు. విజయకాంత్ ఆరోగ్యంపై ఆయన సతీమణి ప్రేమలత చేసిన వ్యాఖ్యలతోనే సింగపూర్ పర్యటన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే, తాను ఆరోగ్యంగానే ఉన్నానంటూ విజయకాంత్ తరపున సోమవారం ప్రకటన వెలువడటం గమనార్హం. కూటమికి, తనకు వ్యతిరేకంగా వస్తున్న కథనాలు, ప్రచారాలు, పుకార్లు ఏ ఒక్కటినీ నమ్మొద్దని అందులో కేడర్‌కు సూచించారు. ఏదేని విషయాలు ఉంటే, పార్టీ కార్యాలయం సమాచారాలు అందిస్తుందని, అంతే గానీ, మీడియాల్లో వచ్చే వార్తలు, కథనాలతో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎన్నికల ప్రచారంతో ప్రజల్లోకి వస్తానని విజయకాంత్ వివరించారు. అలాగే, ఏప్రిల్ పదో తేదిన కూటమిలోని పార్టీల అభ్యర్థులు ప్రకటన, పరిచయ కార్యక్రమం జరుగుతుందని ప్రకటించారు. ఇక, కూటమిని చీల్చేందుకు తీవ్ర కుట్రలు జరుగుతున్నాయని, ఇందుకు పలు మీడియాలు కొన్ని పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని ప్రేమలత విజయకాంత్ తీవ్రంగా దుయ్యబట్టారు.
మదురైలో జరిగిన ప్రచార కార్యాక్రమంలో అధికార మార్పు లక్ష్యంగా ప్రజా కూటమి ఆవిర్భవించిందని, దీనిని చీల్చేందుకు రకరకాల ప్రయత్నాలు, కుట్రలు జరుగుతూనే ఉన్నాయని మండి పడ్డారు. పండు తేనెలో పడిందని, ఇన్నాళ్లు అమ్మకు, అయ్యకు ఓటేయండంటూ నినాదాలు విన్పించాయని, ఇక ఆ రెండింటిని పక్కన పెట్టి అన్న(విజయకాంత్)కు ఓటేయండన్న నినాదాన్ని ప్రతి ఒక్కరూ అందుకోవాలని పిలుపునిచ్చార